Gold Mine Collapse : బంగారు గని కూలి.. 12 మంది మృతి..
ఇండోనేషియాలోని జకర్తాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇండోనేషియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

12 dead in gold mine collapse
ఇండోనేషియాలోని జకర్తాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇండోనేషియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పెద్ద ఎత్తున్న అక్కడ కొండచరియలు విరిగిపడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో అక్కడి ఓ బంగారు గని కూలిపోయింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. మరో 20 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు.
కాగా గతంలో కూడా ఇండోనేషియాలో అక్రమ తవ్వకాలు జరుపుతుండగా బంగారం గని కూలడంతో అప్పడు కూడా 12 మంది దుర్మరణం పాలయ్యారు. కాగా ఈ ఘటనలో మరణించి వారిలో అందరు కూడా మైనర్లుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో దాదాపు 10 నుంచి 30 మీటర్ల లోతున కార్మీకులు కూరుకుపోయినట్లు గుర్తించారు. కాగా వరందరు కూడా ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పుడు 2024 జరిగిన ప్రమాదంలో మృతులకు గల కారణాలు ఇంక తెలియలేదు.