13 Sharks Drugs Positive : బ్రెజిల్ సముద్రంలోని 13 సొరచేపలకు డ్రగ్స్ పాజిటివ్…
పైన టైటిల్ చూసి షాక్ అవుతున్నారా.. అందులో ఏమాత్రం సందేహం లేదు.. ముమ్మాటికి నిజమే.. ఓ సముద్ర సొరచేపకు డ్రగ్స్ పాజిటివ్ అయ్యింది.

13 sharks in Brazil sea tested positive for drugs
పైన టైటిల్ చూసి షాక్ అవుతున్నారా.. అందులో ఏమాత్రం సందేహం లేదు.. ముమ్మాటికి నిజమే.. ఓ సముద్ర సొరచేపకు డ్రగ్స్ పాజిటివ్ అయ్యింది. బ్రెజిల్ తీరంలో షార్క్‌లు కొకైన్‌కు పాజిటివ్‌గా పరీక్షించినట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. బ్రెజిల్ సముద్ర తీరంలో దాదాపు 13 సొరచేపలకు డ్రగ్స్(కొకైన్) పాజిటివ్ వచ్చిందని అక్కడి సైంటిస్టులు వెల్లడించారు. బ్రెజిల్‌లోని ఓస్వాల్డో క్రజ్ ఫౌండేషన్ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. కొన్నేళ్లుగా, స్మగ్లర్లు సముద్రంలోకి డంప్ చేసిన డ్రగ్స్.. కాలుష్యం సహా అక్రమ కొకైన్ వ్యర్థాలు సముద్రంలో కలపడం వల్లే.. సముద్ర జీవులపై ప్రభావం పడుతుందని పరిశోధకులు అనుమానిస్తున్నారు. సముద్రంలో ఉన్న సొరచేపల్లో కొకైన్ ఆనవాళ్లు కనిపించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈమేరకు ‘కొకైన్ షార్క్’ అనే టైటిల్‌తో ఇంటర్నేషనల్ వీక్లీ మ్యాగజైన్ ‘సైన్స్ ఆఫ్ ది టోటల్ ఎన్విరాన్‌మెంట్’లో కథనం ప్రచురితమైంది. మరో వైపు సముద్రల్లో 100 రెట్లు అధికంగా మాదకద్రవ్యాల సాంద్రతలు ఉన్నాట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.