పారిస్ ఒలింపిక్స్- 2024 ప్రారంభోత్సవ వేడుకల్లో భారత్ ర్యాలీ .
పారిస్ ఒలింపిక్స్- 2024 ప్రారంభోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. సెన్ నదిపై ఆరు కిలోమీటర్ల పరేడ్‌లో 85 పడవలపై దాదాపు 6800 క్రీడాకారులు పాల్గొన్నారు. సుమారు 3,20,000 మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. చిన్న పడవలో ఓ ముసుగు వ్యక్తి ఒలింపిక్ జ్యోతి పట్టుకుని రావడంతో ఈ కార్యక్రమం ఆరంభమైంది.

పారిస్ ఒలింపిక్స్- 2024

పారిస్ ఒలింపిక్స్- 2024 ప్రారంభోత్సవం

పారిస్ ఒలింపిక్స్- 2024 ప్రారంభోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి.

2024 పారిస్ ఒలింపిక్స్ మెడల్స్

భారతీయ ఒలింపిక్స్ క్రీడాకారులు

భారతీయ ఒలింపిక్స్ క్రీడాకారులు

భారత్ నుంచి 117 మంది క్రీడాకారులు ఈ విశ్వ క్రీడల్లో పాల్గొంటున్నారు.

ఒక్కో టీమ్ ఈవెంట్లో భారత్ తరపున ఒక జట్టు.. వ్యక్తిగత విభాగాల్లోనూ ఒక్కో కేటగిరీలో భారత్ నుంచి ఒకరు ప్రాతినిధ్యం వహిస్తారు.

చిన్న పడవలో ఓ ముసుగు వ్యక్తి ఒలింపిక్ జ్యోతి పట్టుకుని రావడంతో ఈ కార్యక్రమం ఆరంభమైంది.

కొన్ని విభాగాలకు సంబంధించి భారత్ తరపున ప్రాతినిధ్యం లేదు.

జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగారు.

పారిస్ ఒలింపిక్స్ లో మెరిసిన తెలుగు బిడ్డ పీవీ సింధు

ఈసారి కనీసం ఐదు బంగారు పతకాలతో కలిపి రెండంకెల సంఖ్యను దాటాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.

ముఖ్యంగా బ్యాడ్మింటన్(Badminton)లో మూడు పతకాలు, ఆర్చరీలో ఒకటి, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్‌లో మూడు నుంచి నాలుగు, ఇతర క్రీడలకు సంబంధించి ఒకటి నుంచి రెండు పతకాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.

గతంతో పోలిస్తే భారత్ తరపున పాల్గొంటున్న క్రీడాకారులకు మెరుగైన శిక్షణ అందించడంతో పాటు.. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారత ఒలింపిక్స్ సంఘం అన్ని చర్యలు తీసుకుంది.

కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ సైతం క్రీడాకారులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తోంది.

టోక్యో ఒలింపిక్స్‌లో ఒక బంగారు, రెండు రజత, నాలుగు కాంస్య పతకాలు సాధించగా.. ఈసారి మాత్రం రెండంకెల సంఖ్యను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ముఖ్యంగా బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్‌లో పతకం వచ్చే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయనే అంచనాలు ఉన్నాయి.

భారత క్రీడాకారుల జట్టుకు రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పివి సింధు, టేబుల్ టెన్నిస్ లెజెండ్ ఎ శరత్ కమల్ నాయకత్వం వహించారు.