Cargo Ship, Hijack : ఇండియాకు వస్తున్న కార్గో షిప్ హైజాక్..

టర్కీ దేశం నుంచి భారత్ కు బయలుదేరిన ఓ బడా భారీ కార్గో షిప్ హైజాక్ గురైంది.. ఇక వివరాల్లోకి వెలితే టార్కీ దేశం కోర్ఫెజ్ నుంచి ఇండియాకు గెలాక్సీ లీడర్ అనే ఓ భారీ నౌక గుజరాత్‌లోని పిపావావ్‌కు వాహనాలను తరలిస్తుండగా ఎర్ర సముద్రంలో ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారులు హైజాక్ కు గురైంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 20, 2023 | 10:58 AMLast Updated on: Nov 20, 2023 | 10:58 AM

A Huge Cargo Ship From Turkey To India Was Hijacked

టర్కీ దేశం నుంచి భారత్ కు బయలుదేరిన ఓ బడా భారీ కార్గో షిప్ హైజాక్ గురైంది.. ఇక వివరాల్లోకి వెలితే టార్కీ దేశం కోర్ఫెజ్ నుంచి ఇండియాకు గెలాక్సీ లీడర్ అనే ఓ భారీ నౌక గుజరాత్‌లోని పిపావావ్‌కు వాహనాలను తరలిస్తుండగా ఎర్ర సముద్రంలో ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారులు హైజాక్ కు గురైంది.

 Mexico tower collapsed : మెక్సికోలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన టవర్.. ఐదుగురు కార్మికులు దుర్మరణం

కార్గో షిప్ హైజాక్ కై ఇజ్రాయెల్ స్పందన..

ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం స్పందించింది. అంతర్జాతీయ నౌక పై ఇరానియన్ దాడిని ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొంది. ఈ నౌకను బ్రిటీష్ కంపెనీకి చెందినదైతే జపనీస్ కంపెనీ ఆపరేట్ చేస్తున్నాయని వివరించింది ఇజ్రాయెల్. ఇరాన్ సూచనలతోనే యెమెనైట్ హౌతీ మిలిషియా హైజాక్ చేసిందని వెల్లడించారు. అయితే హైజాకింగ్‌లో ఇజ్రాయెల్ నౌక ప్రమేయం లేదని IDF తెలిపింది.

ఈ కార్గో షిప్ లో వివిధ దేశాలకు చెందిన 25 మంది నావికులు, 50 మంది క్రూ సిబ్బంది ఉన్నారని.. ఇజ్రాయిలీలు, భారతీయులు లేరని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. ఇది ఇజ్రాయెల్ దేశంకు నౌక కూడా కాదని తెలిపింది. ఈ షిప్ హైజాక్ కు గురైనట్లు స్వయంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడిఎఫ్) ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది.

ఈ నౌక హైజాక్ కు సంబంధించి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది.