Nigeria, suicide attack : నైజీరియాలో వరుస ఆత్మాహుతి దాడులు.. 18 మంది మృతి
ఈశాన్య నైజీరియాలోని బోర్నో రాష్ట్రంలో శనివారం ఆత్మాహుతి చేసింది. ఓ మహిళా సూసైడ్ బాంబర్లు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. ఈ దుర్ఘటనలో దాదాపు 18 మంది చనిపోయారు.

A series of suicide attacks in Nigeria.. 18 people died
ఈశాన్య నైజీరియాలోని బోర్నో రాష్ట్రంలో శనివారం ఆత్మాహుతి చేసింది. ఓ మహిళా సూసైడ్ బాంబర్లు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. ఈ దుర్ఘటనలో దాదాపు 18 మంది చనిపోయారు. మరో 42 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై రాష్ట్ర ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ బార్కిండో సైదు మాట్లాడుతూ.. ఆత్మాహుతి బాంబర్లు వేర్వేరు చోట్ల వరుస దాడులకు పాల్పడ్డారని చెప్పారు. గ్వోజా నగరంలో ఓ పెళ్లిలో మరణించిన వారి అంత్యక్రియలు జరుపుతుండగా మరో మహిళ ఆత్మాహుతి దాడికి పాల్పడింది.
మరో ప్రాంతంలో ఆసుపత్రిపై ఇంకో ఆత్మాహుతి బాంబర్లు దాడి చేశారు. ఇలా జనసమూహం అధికంగా ఉండే ప్రాంతాలే లక్ష్యంగా మహిళా సూసైడ్ బాంబర్లను ప్రయోగిస్తున్నాయి. ఈ ఘటనలో 18 మంది మృతి చెందగా.. మృతులలో మహిళలు, చిన్నారులు, గర్భిణీలు కూడా ఉన్నారు. 42 మంది గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రులను వివిధ ఆస్పత్రులకు తరలించారు. మరి కొందరి పరిస్థితి విషమంగం ఉన్నట్లు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా బోర్నో రాష్ట్రం బోకోహారం మిలిటెంట్ గ్రూప్‌కు కంచుకోటగా మారింది.
ఈ దాడులకు ముందు అంటే.. 2014లో ఉత్తర బోర్నో ప్రాంతంలోని గ్వోజాను బోకోహరం ఉగ్రవాదులు స్వాధీనం చేసుకున్నారు. నైజీరియా భద్రతా బలగాలు 2015లో గ్వోజాను తిరిగి తన స్వాధీనంలోకి తీసుకున్నాయి. అప్పటి నుంచి బోకో హరం తీవ్రవాదులు గ్వోజాపై దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు ఈ దాడుల్లో 40 వేల మంది చనిపోగా 20 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.