koalas : సోషల్ మీడియాలో కంటతడి పెట్టిస్తున్న కోలా జంతువు వీడియో
తాజాగా ఓ చిన్న జీవి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వైరల్ అవ్వడంమే కాదు.. అందరితోటి కంటతడి కూడా పెట్టిస్తుంది ఆ విడియో.. కోలా ఈ జంతువు పేరు చాలా తక్కువగా వినుంటారు.. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చూసి ఉంటారు.

A video of a koala animal that is making people cry on social media
ఈ భూ ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవికి.. మరణం ఒక్కటే.. ఆ మరణం నుంచి వచ్చే భాద ఒక్కటే.. చాలా వరకు మనుషులల్లో తప్ప మరే జీవులలో దుఃఖం అనేది.. మరణం వస్తే భాద అనే ఉండదు అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు.. ఈ సృష్టిలో ప్రతి జీవికి కోసం, భాద, ఆవేశం,ఆకలి, అన్ని ఉంటాయి. అవి వ్యక్తపరిచే సమయంలో వ్యక్తపరుస్తాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటారా..? అక్కడికే వస్తున్నా..
తాజాగా ఓ చిన్న జీవి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వైరల్ అవ్వడంమే కాదు.. అందరితోటి కంటతడి కూడా పెట్టిస్తుంది ఆ విడియో.. కోలా ఈ జంతువు పేరు చాలా తక్కువగా వినుంటారు.. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చూసి ఉంటారు. ఎందుకంటే ఇది మన దేశంలో ఉండే జంతువు అయితే కాదు.. ఆస్ట్రేలియా సముద్రపు తీరంలో ఉండే అరుదైన.. అంతరించిపోతున్న జంతువులు. కోలా పూర్తి శాకాహార జీవులు. ఈ జంతువులను చిన్న ఎలుగుబంటి అని కూడా అంటారు. దీన్ని ప్రవర్త.. దీన్ని వాయిస్ కూడా అచ్చం ఎలుగు బంటి వలే ఉంటుంది.
సోషల్ మీడియాలో కంటతడి పెట్టిస్తున్న కోలా జంతువు వీడియో … #koalas #wildlifecarers #savethekoalas #abcmyphoto #southaustralia #adelaidehills #conservation #ilovekoalas #wildliferescue @abcadelaide #babykoala #adelaide #babykoalas #koalajoey #adelaide #nativeaustralianwildlife pic.twitter.com/kdkq13IhBE
— Dial News (@dialnewstelugu) February 25, 2024
ఇక విషయానికి వస్తే.. ఓ ప్రాంతంలో కోలా సహచర కోలాను కోల్పోయింది (చనిపోయింది) ఆ కోలా దానిని పట్టుకుని రోదిస్తున్న వీడియో సోషల్ మీడియాలో.. సామాజిక మాధ్యమాల్లో చూసే వారి చెంత కూడా కన్నీళ్లు తెప్పిస్తోంది. దక్షిణ ఆస్ట్రేలియాకు చెందిన కోలా రెస్క్యూ గ్రూప్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో ఆ కోలా చనిపోయిన తన కోలాను తన ఒళ్లో పెట్టుకుని రోదిస్తోంది. దానిని తనివితీరా హత్తుకుని తన ప్రేమను.. బాధను వ్యక్తపరుస్తుంది. ఆ దృశ్యం చూసి కన్నీళ్లు పెట్టుకున్న స్థానికులు కోలా రెస్క్యూ టీంకు సమాచారం అందించారు. వారొచ్చి కోలాను తమ రక్షణలోకి తీసుకున్నారు. కాగా ఆ వీడియో లో చనిపోయింది ఆడ కోలా అని గుర్తించారు. మగ కోలా కు ఆరోగ్య పరీక్షలు చేసిన అనంతరం దానిని అడవిలో విడిచిపెట్టారు. ఇక మరణించిన కోలా ఎందుకు చనిపోయిందని కోణంలో కోలా సంరక్షణ అధికారులు ఆరా తీస్తున్నారు.
View this post on Instagram