T20, World Cup : పాక్ కొంపముంచిన అమెరికా.. ఇక కథ ముగిసినట్టే..
టీ ట్వంటీ (T20) వరల్డ్ కప్ (World Cup) లో ఈ సారి సంచలనాల మోత మోగుతోంది. పలు చిన్న జట్లు పెద్ద టీమ్స్ కు షాకిస్తున్నాయి. తద్వారా సూపర్ 8 రేసును రసవత్తరంగా మార్చేశాయి.

America bought by Pakistan.. the story is over
టీ ట్వంటీ (T20) వరల్డ్ కప్ (World Cup) లో ఈ సారి సంచలనాల మోత మోగుతోంది. పలు చిన్న జట్లు పెద్ద టీమ్స్ కు షాకిస్తున్నాయి. తద్వారా సూపర్ 8 రేసును రసవత్తరంగా మార్చేశాయి. గ్రూప్-ఏలో భారత్, అమెరికా(America), కెనడా(Canada), ఐర్లాండ్ (Ireland)లతో ఉన్న పాకిస్థాన్ (India VS Pakistan) క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఈ గ్రూప్‌లో రెండు మ్యాచ్‌లకు రెండు గెలిచిన టీమిండియా 4 పాయింట్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలవడం భారత్‌కు పెద్ద కష్టం కాదు. పాకిస్థాన్, కెనడాపై విజయం సాధించిన అమెరికా కూడా 4 పాయింట్స్‌తో రెండో స్థానంలో కొనసాగుతోంది. చివరి రెండు మ్యాచ్ లో ఒక్కటి గెలిచినా అమెరికా ఖాతాలో 6 పాయింట్స్ చేరుతాయి. కాబట్టి అమెరికాకే సూపర్-8 చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
రెండు మ్యాచ్‌లకు రెండు ఓడిన పాకిస్థాన్, ఐర్లాండ్ మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. పాకిస్థాన్ తమ చివరి రెండు మ్యాచ్‌లు గెలిచినా పాక్ ఖాతాలో 4 పాయింట్స్ చేరుతాయి. పాక్ సూపర్ 8 చేరాలంటే అమెరికా తమ చివరి రెండు మ్యాచ్‌లు ఓడిపోవాలి. అప్పుడు పాక్, అమెరికా 4 పాయింట్స్‌తో సమంగా నిలుస్తాయి. మెరుగైన రన్‌రేట్ ఉన్న జట్టు సూపర్ 8కు వెళ్తోంది. ప్రస్తుతం పాక్ కంటే అమెరికా రన్‌రేట్ మెరుగ్గా ఉంది. మెరుగైన రన్ రేట్ సాధించాలంటే పాక్ తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.