Universe, Earth, Planet : విశ్వంలో భూమి లాంటి మరోగ్రహం.. అక్కడ ఏలియన్స్ ఉన్నాయా?
ఈ అనంత విశ్వంలో భూమిలాంటి మరో గ్రహం ఉందా? మనుషులు జీవించేందుకు అక్కడ అనువైన వాతావరణం ఉందా? ఒకవేళ ఉంటే.. అక్కడ ఆల్రెడీ ఏలియన్స్ ఉంటున్నాయా? ఎన్నో ఏళ్ల నుంచి సమాధానం లేని ప్రశ్నలు ఇవి. భూమిని పోలిన గ్రహాన్ని ఎప్పటి నుంచో వెతుకున్న శాస్త్రవేత్తలు.. ఇప్పుడు మన భూమి లాంటి మరో గ్రహం అంతరిక్షంలో ఉన్నట్లు భావిస్తున్నారు.

Another planet like Earth in the universe.. Are there aliens?
ఈ అనంత విశ్వంలో భూమిలాంటి మరో గ్రహం ఉందా? మనుషులు జీవించేందుకు అక్కడ అనువైన వాతావరణం ఉందా? ఒకవేళ ఉంటే.. అక్కడ ఆల్రెడీ ఏలియన్స్ ఉంటున్నాయా? ఎన్నో ఏళ్ల నుంచి సమాధానం లేని ప్రశ్నలు ఇవి. భూమిని పోలిన గ్రహాన్ని ఎప్పటి నుంచో వెతుకున్న శాస్త్రవేత్తలు.. ఇప్పుడు మన భూమి లాంటి మరో గ్రహం అంతరిక్షంలో ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ గ్రహాన్ని అత్యంత దగ్గరగా తీసిన ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి. ఆ గ్రహంపై.. భూమిపై ఉన్నట్లు సముద్రాలు ఉన్నాయనేది ఆ ఫొటోలు చూస్తే స్పష్టమవుతోంది.
మొదట దీనిని ఓ చిన్న గ్రహంగా భావించినా.. పరిశోధనల తర్వాత ఆ గ్రహంపై రాళ్లు, కొండలు, నీళ్లు ఉండే అవకాశం ఉందని బలంగా నమ్ముతున్నారు శాస్త్రవేత్తలు. ఇది భూమి కంటే చాలా పెద్దగా ఉందని చెబుతున్నారు. సైంటిస్టులు చేసిన అధ్యయనం ప్రకారం, LHS 1140b సీటస్‌గా పిలవబడుతున్న ఈ గ్రహం సుమారు 48 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్లు అంచనా వేశారు. ఈ గ్రహం ప్రవర్తన కారణంగా జీవం మనుగడ సాగించే అవకాశం ఉంటుందనేది శాస్త్రవేత్తల నమ్మకం. LHS 1140బి గ్రహాన్ని చుట్టుముట్టి ఉన్న నక్షత్రాల ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ అంచనాకు వచ్చారు. మొదట్లో మందపాటి హైడ్రోజన్-రిచ్ వాతావరణంతో మినీ-నెప్ట్యూన్‌గా భావించబడినప్పటికీ, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ నుండి వచ్చిన కొత్త డేటాలో ఇది భూమి కంటే పెద్ద గ్రహమని నిరూపించబడింది. రాళ్లు, నీరు, మంచు అధికంగా ఉండే సూచనలు ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
రాతి లేదా మంచు అధికంగా ఉండే నివాసయోగ్యమైన జోన్‌లో వాతావరణం చూడటం ఇదే మొదటిసారి. మిచిగాన్ యూనివర్సిటీ సైంటిస్ట్ మెక్‌డొనాల్డ్ ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు. గ్రహం యొక్క వాతావరణాన్ని విశ్లేషించడంలో కీలక పాత్ర పోషించిన మిచిగాన్ యూనివర్సిటీ నుంచి ఇలాంటి స్టేట్‌మెంట్ బయటికి రావడంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్‌గా మారింది. LHS 1140b యొక్క ద్రవ్యరాశిలో 10 నుండి 20 శాతం నీరు కలిగి ఉండవచ్చని పరిశోధనలో వెల్లడైంది. అలాగే, మధ్య భాగంలో 20 డిగ్రీల సెల్సియస్ ఉపరితల ఉష్ణోగ్రత ఉన్నట్లు నిర్ధారించారు. ఈ పరిశోధనలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, నైట్రోజన్ అధికంగా ఉండొచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు. ఇతర వాయువుల ఉనికి కోసం మరిన్ని పరిశోధణ అవసరమని చెప్తున్నారు.