Mukesh Ambani : ముఖేష్ కి బెదిరింపు కేసులో మరో యువకుడు అరెస్ట్..
తెలంగాణకు చెందిన 19 ఏళ్ల వ్యక్తితో పాటు, గుజరాత్‌కి చెందిన 21 ఏళ్ల యువకుడిని కూడా అరెస్ట్ చేశారు. సరదా కోసమే మెయిల్స్ పంపినట్టు నిందితులు పోలీసులకు తెలిపారు. అంబానీని చంపేస్తామంటూ పదే పదే ఆయన సెక్యూరిటీకి మెయిల్స్ పంపారు వీళ్ళిద్దరూ.
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీకి (Mukesh Ambani) కి బెదిరింపు మెయిల్స్ (Threat Mails) పంపిన కేసులో మరో యువకుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణకు చెందిన 19 ఏళ్ల వ్యక్తితో పాటు, గుజరాత్‌కి చెందిన 21 ఏళ్ల యువకుడిని కూడా అరెస్ట్ చేశారు. సరదా కోసమే మెయిల్స్ పంపినట్టు నిందితులు పోలీసులకు తెలిపారు. అంబానీని చంపేస్తామంటూ పదే పదే ఆయన సెక్యూరిటీకి మెయిల్స్ పంపారు వీళ్ళిద్దరూ. మొదట 20 కోట్లు తర్వాత 200కోట్లు.. చివరగా 400 కోట్ల రూపాయల డాకా డిమాండ్ చేశారు యువకులు. అడిగినంత ఇవ్వకపోతే కచ్చితంగా హత్య చేస్తామని కూడా బెదిరించారు. ఆరుసార్లు ఇలాంటి మెయిల్స్ వచ్చినట్టు ముంబై పోలీసులు తెలిపారు. విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
ఈ ఇద్దరు కలిసే ఈ బెదిరింపు మెయిల్స్ పంపారా.. ఇద్దరి మధ్యా ఏదైనా సంబంధం ఉందా అన్న కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు. వారం రోజుల్లో ఆరు సార్లు బెదిరింపు మెయిల్స్ పంపినట్టు పోలీసులు తెలిపారు. తెలంగాణకు చెందిన గణేశ్ రమేశ్ వనపర్తి నవంబర్ 1న ముకేశ్ అంబానీ సెక్యూరిటీకి మెయిల్ పంపాడు. గుజరాత్ కు చెందిన యువకుడిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. నవంబర్ 8న వరకూ రిమాండ్‌లో ఉంచాలని కోర్టు ఆదేశించింది. IP అడ్రెస్‌తో ట్రాక్ చేసి నిందితుడుని గుర్తించామన్నారు ముంబై పోలీసులు.