David Warner : మిస్‌ యూ వార్నర్‌ మావా..

ఆస్ట్రేలియన్‌ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్.. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ చెప్పేశాడు. టీ20 వాల్డ్‌కప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓడిపోయింది. దీంతో వార్నర్ అంతర్జాతీయ కెరీర్ ముగిసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 25, 2024 | 04:30 PMLast Updated on: Jun 25, 2024 | 4:30 PM

Australian Star Opener David Warner Has Announced His Retirement From International Cricket

 

 

 

ఆస్ట్రేలియన్‌ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్.. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ చెప్పేశాడు. టీ20 వాల్డ్‌కప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓడిపోయింది. దీంతో వార్నర్ అంతర్జాతీయ కెరీర్ ముగిసింది. టీ20 వాల్డ్‌కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తానని… ఈ ఏడాది ప్రారంభంలో చెప్పేశాడు వార్నర్‌. దీంతో వార్నర్ అంతర్జాతీయ కెరీర్ ముగిసింది. ఇప్పటికే టెస్ట్, వన్డేలకు వార్నర్ గుడ్‌ బై చెప్పాడు. వాల్డ్‌కప్‌లో భాగంగా టీమిండియాతో మ్యాచ్‌ను ఆస్ట్రేలియా ఓడిపోయింది.

దీంతో సెమీస్ అవకాశాలను కష్టం చేసుసకుంది. అటు బంగ్లాదేశ్‌పై ఆఫ్ఘనిస్తాన్ విక్టరీ కొట్టడంతో.. ఆస్ట్రేలియా సూపర్ 8లోనే ఇంటిదారి పట్టింది. దీంతో ఈ టోర్నీలో ఆస్ట్రేలియా ఆడే అవకాశం లేకుండా పోయింది. తన చివరి మ్యాచ్‌లో వార్నర్ 6 పరుగులే చేశాడు. వాల్డ్‌కప్‌ టైటిల్‌తో ఆస్ట్రేలియాకు వీడ్కోలు చెప్పాలనుకున్న వార్నర్ ఆశలు అడియాశలుగానే మిగిలాయ్‌. మ్యాచ్ తర్వాత వార్నర్‌కు స్టాండింగ్‌ ఒవేషన్ కూడా లేదు. బాధతోనే తన అంతర్జాతీయ క్రికెట్ ను ముగించాల్సి వచ్చింది. ఈ ఏడాది జనవరి 6న టెస్ట్ ఫార్మాట్‌‌కు వీడ్కోలు పలికిన వార్నర్‌.. ఆ తర్వాత కొద్దిరోజులకే వన్డేలకు గుడ్ బై చెప్పారు. ఐే తన సేవలు క్రికెట్ ఆస్ట్రేలియా కావాలి అనుకుంటే.. వచ్చే ఏడాది పాక్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో అడతానని వార్నర్ చెప్పాడు.

ఐతే వార్నర్‌కు పిలుపు వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు. వీడ్కోలు పలికిన ఆటగాడికి క్రికెట్ ఆస్ట్రేలియా మరో అవకాశమిచ్చే మంచి మనసు లేదు. దీంతో అతను మున్ముందు వన్డేల్లోనూ కనిపించేది అసాధ్యమే. 2011లో ఆస్ట్రేలియా తరపున టెస్ట్ అరంగ్రేటం చేసిన వార్నర్‌.. తన కెరీర్ మొత్తంలో 112 టెస్టులు ఆడారు. 205 ఇన్నింగ్స్‌లో 8786 పరుగులు చేశారు. ఇందులో 3 డబుల్ సెంచరీలు, 26 సెంచరీలు, 36 అర్థ సెంచరీలు ఉన్నాయి. హైయెస్ట్ స్కోర్ 335 పరుగులు కాగా.. యావరేజీ 44.60.

ఇక 161 వన్డేల్లో 6932 పరుగులు చేశాడు. వీటిలో 22 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నప్పటికీ వార్నర్‌.. మున్ముందు ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఎక్కువగా కనిపించనున్నాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ తరఫున వార్నర్ ఆడుతున్నాడు. వార్నర్‌ను హైదరాబాద్‌ జనాలు ఓన్ చేసుకున్నారు. పుష్ప డ్యాన్సులతో అదరగొట్టే వార్నర్‌ను ముద్దుగా డేవిడ్ మావా అని పిలుచుకుంటుంటారు మనోళ్లు.