Pakistan : పాకిస్తాన్ లోని కారు బాంబు పేలుడు.. నలుగురు మృతి
పాకిస్తాన్- అఫ్గనిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో కారు బాంబు పేలుడు జరిగింది. కారులోని బాంబును రిమోట్ కంట్రోల్‌తో పేల్చిన ఘటనలో పాక్ మాజీ ఎంపీతో పాటు మరో ముగ్గురు మృతి చెందారు.

Car bomb blast in Pakistan, four killed
పాకిస్తాన్- అఫ్గనిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో కారు బాంబు పేలుడు జరిగింది. కారులోని బాంబును రిమోట్ కంట్రోల్‌తో పేల్చిన ఘటనలో పాక్ మాజీ ఎంపీతో పాటు మరో ముగ్గురు మృతి చెందారు. మామండ్ బజౌర్‌లోని దమడోలా ప్రాంతంలో ఈ పేలుడు జరిగినట్లు పోలీసులు తెలిపారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం.. పేలుడు జరిగిన సమయంలో పాక్ పార్లమెంటు మాజీ సభ్యుడు హిదయతుల్లా అక్కడే ఉన్నారు.
కాగా ఖైబర్ ఫక్తున్ ఖ్వా ప్రావిన్స్ సీఎం అలీ అమీన్ గండాపూర్, ప్రధాన కార్యదర్శి నదీమ్ అస్లాం చౌదరి ఈ పేలుడును తీవ్రం ఖండిస్తున్నామని వెల్లడించారు. దీంతో ఈ ఘటనలో మృతులకు సంతాపం వ్యక్తం చేశారు.
పాకిస్తాన్- అఫ్గనిస్తాన్ కారు బాంబు పేలుడు దాడికి ఇప్పటి వరకు ఏ సంస్థ కూడా బాధ్యత వహించలేదని ఆయన వెల్లడించారు.