China Virus: మరో వైరస్‌పై చైనా ప్రయోగాలు.. ఇంకో కరోనా మహమ్మారి కానుందా..?

బయోవెపన్స్ ద్వారా ప్రపంచాన్ని నాశనం చేయాలనుకున్న చైనా కుయుక్తి వల్లే కరోనా వైరస్ ప్రబలిందని చాలా మంది నమ్మే మాట. ఈ వైరస్ మిగిల్చిన చేదు జ్ఞాపకాలను ఇంకా మర్చిపోలేని ప్రపంచానికి చైనా.. మరో వైరస్ అంటించబోతుందా..?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 17, 2024 | 04:17 PMLast Updated on: Jan 17, 2024 | 4:26 PM

China Experimenting With 100 Percent Deadly New Covid Strain

China Virus: కరోనా వైరస్ సృష్టించిన మరణ మృదంగాన్ని ప్రపంచం ఇంకా మర్చిపోలేదు. కోట్లాది మంది ప్రాణాల్ని బలిగొన్న కరోనా (కోవిడ్ 19) వైరస్‌ను సృష్టించింది చైనా అనే ఆరోపణలున్న సంగతి తెలిసిందే. ఈ విషయం ఇంకా తేలలేదు. బయోవెపన్స్ ద్వారా ప్రపంచాన్ని నాశనం చేయాలనుకున్న చైనా కుయుక్తి వల్లే కరోనా వైరస్ ప్రబలిందని చాలా మంది నమ్మే మాట. ఈ వైరస్ మిగిల్చిన చేదు జ్ఞాపకాలను ఇంకా మర్చిపోలేని ప్రపంచానికి చైనా.. మరో వైరస్ అంటించబోతుందా..?

Lakshadweep: లక్షద్వీప్ లక్ష్యం పర్యాటకమే కాదు.. మోదీ తిరుగులేని ప్లాన్..

ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం చూస్తే నిజమే అనిపిస్తోంది. కరోనా జాతికి చెందిన ఒక ప్రమాదకర వైరస్‌పై చైనా ప్రయోగాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక.. ఈ వైరస్ ప్రభావం ఎంతగా ఉందంటే.. వంద శాతం మరణాలు సంభవించాయట. అంటే.. వైరస్ సోకిన ప్రాణులన్నీ మరణించాయి. చైనాలోని వుహాన్‌లో జరిగిన ఒక అధ్యయనంలో ఈ విషయాలు తెలిశాయి. కోవిడ్ వైరస్ కూడా ఇక్కడి నుంచే వ్యాపించిందనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన ఒక నివేదిక ప్రకారం.. SARS-COV-2 రకానికి చెందిన GX_P2V ఉపరకం వైరస్‌పై చైనా శాస్త్రవేత్తలు ప్రయోగాలు జరుపుతున్నారు. ఇది కూడా కోవిడ్ రకానికి చెందినదే. దీన్ని 2017లో బయటపడ్డ జీఎక్స్‌ ఉత్పరివర్తన వైరస్‌గా భావిస్తున్నారు. అప్పట్లో దీన్ని మలేషియన్ పాంగోలిన్స్ జంతువుల్లో కనుగొన్నారు. GX_P2V ఉపరకం వైరస్‌‌ను పరిశోధకులు ఎలుకలపై ప్రయోగించారట.

ఈ వైరస్ సోకిన ఎలుకలు.. ఎనిమిది రోజుల్లోనే పూర్తిగా మరణించాయట. వైరస్ ప్రయోగించిన తర్వాత ఎలుకల లంగ్స్, ఎముకలు, కళ్లు, మెదడు దెబ్బతిని, బలహీనంగా తయారయ్యాయి. అనంతరం నడవలేని స్తితికి చేరి, కొద్ది రోజుల్లోనే మరణించాయి. అయితే, ఈ వైరస్ మనుషులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే విషయంలో ఇంకా స్పష్టతలేదు. అయితే, మనుషుల్లోనూ ఇలాంటి ప్రభావమే ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ వైరస్ మనుషులకు సోకితే, ప్రపంచానికి పెను ముప్పు సంభవించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. చైనా జరుపుతున్న ఈ ప్రయోగాలు ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్నాయి.