China mysterious pneumonia: చైనాలో మరో కొత్త వ్యాధి … పిల్లల్లో విస్తరిస్తున్న మిస్టీరియస్ న్యుమోనియా
చైనాను మరో మహమ్మారి వణికిస్తోంది. మిస్టీరియస్ న్యుమోనియా విస్తరిస్తుండటంతో చాలామంది పిల్లలు దీని బారిన పడి హాస్పిటల్స్ లో చేరుతున్నారు. ఇది ప్రమాదకర వ్యాధేని ప్రొమెడ్ సంస్థ హెచ్చరిస్తోంది.
China: మొన్నటిదాకా కోవిడ్19(Covid-19)తో ఇబ్బందులు పడ్డ చైనాను ఇప్పుడో కొత్త మహమ్మారి ఇబ్బంది పెడుతోంది. చైనాలోని స్కూళ్ళల్లో మిస్టీరియస్ న్యుమోనియా వేగంగా విస్తరిస్తోంది. భారీ సంఖ్యలో పిల్లలు హాస్పిటల్స్ లో చేరుతున్నారు. దాంతో ఆరోగ్య అధికారులు ఆందోళన పడుతున్నారు. కరోనా (Carona) మొదట్లో లాగే హాస్పిటల్స్ లో రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. వ్యాధి పీడితుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు. న్యుమోనియా భయతో ఇప్పటికే చాలా స్కూళ్ళను మూసివేశారు.
చైనాలో కరోనా సంక్షోభం మొదలైనప్పుడు కూడా ఇలాగే పరిస్థితి ఉండేది. హాస్పిటల్స్ లో చేరుతున్న వాళ్ళ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం బీజింగ్, లియానింగ్‌లోని హాస్పిటల్స్ లో అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లల సంఖ్య పెరుగుతోంది. భారీ సంఖ్యలో రోగులు వస్తుండటంతో హాస్పిటల్ సిబ్బందికి వైద్యం అందించడం కష్టమవుతోందని అంటున్నారు. మిస్టీరియస్ న్యుమోనియా వ్యాధి బారిన పడిన పిల్లలు ఊపిరితిత్తుల్లో వాపు, అధిక జ్వరంతో (High fever) బాధపడుతున్నారు. కానీ దగ్గు,ఫ్లూ, RSV ఇతర లక్షణాలు లేవని చైనా వైద్యాశాఖాధికారులు చెబుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా మానవ, జంతు వ్యాధుల వ్యాప్తిని ట్రాక్ చేసే ఓపెన్-యాక్సెస్ సర్వైలెన్స్ ప్లాట్‌ఫారమ్ ProMed, చైనాలో వ్యాపిస్తున్న ఈ మిస్టీరియస్ న్యుమోనియాపై హెచ్చరిక జారీ చేసింది. డిసెంబర్ 2019లోనూ ఓ వ్యాధికి సంబంధించి హెచ్చరించింది. అప్పుడే SARS-CoV-2 రూపంలో కరోనా మహమ్మారి విజృంభించింది. తెలియని శ్వాసకోశ వ్యాధి వ్యాపించే అవకాశం ఉందని ప్రోమెడ్ హెచ్చరిస్తోంది.