Donald Trump:  ఆమెకు ట్రంప్ 692 కోట్లు చెల్లించాలి … ఎందుకంటే !

పరువు నష్టం కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు భారీ జరిమానా పడింది. రచయిత్రి జీన్‌ కరోల్‌కు ఆయన రూ. 692 కోట్లు చెల్లించాలని కోర్టు ఆదేశింది. 

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 27, 2024 | 04:34 PMLast Updated on: Jan 27, 2024 | 4:35 PM

Donald Trump Defamation Case

అమెరికా అధ్యక్షుడిగా ఒక టర్మ్ పనిచేశాడు.  రిపబ్లికన్ పార్టీ తరపున మరోసారి పోటీ చేసి రెండోసారి అధ్యక్షుడు కావాలని కలలు కంటున్నారు. కానీ డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump)కు కోర్టులు వరుసగా మొట్టికాయలు వేస్తున్నాయి. అమెరికన్‌ మాజీ కాలమిస్ట్‌ జీన్‌ కరోల్‌ ఫైల్ చేసిన పరువు నష్టం కేసు (Defamation Case)లో న్యూయార్క్‌లోని మాన్‌ హటన్‌ ఫెడరల్‌ కోర్టు ట్రంప్ కి భారీగా జరిమానా వేసింది. ఆమెకు 83.3 మిలియన్‌ డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు రూ.692 కోట్లకు పైగా చెల్లించాలని ఆదేశించింది.

గతంలో తనపై ట్రంప్ లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా….. ఇప్పుడు పరువుకు భంగం కలిగించేలా కామెంట్స్ చేశాడంటూ కరోల్‌ కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ట్రంప్‌నకు ఈ భారీ జరిమానా విధించింది. కరోల్ కి పరిహారం కింద 18.3 మిలియన్‌ డాలర్లతో చెల్లించాలి. పైగా భవిష్యత్తులో మల్ళీ ఇలాంటి కామెంట్స్ చేయకుండా మరో 65 మిలియన్‌ డాలర్లు చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించింది.  ఈ కేసుపై ఫెడరల్ కోర్టులో విచారణ జరుగుతుండగానే.. ట్రంప్‌ సడన్ గా కోర్టు హాలు నుంచి బయటకు వెళ్లిపోయారు.

ఇదే కేసులో ట్రంప్‌నకు ఇంతకుముందే కోర్టు జరిమానా విధించింది. జీన్‌ కరోల్‌ను ట్రంప్‌ లైంగికంగా వేధించినట్టు నిర్ధారించిన కోర్టు… ఆమెకు 5 మిలియన్‌ డాలర్లు చెల్లించాలని ఆదేశించింది.  అయితే, కరోల్‌ తన పుస్తకాలను అమ్ముకోడానికి చీప్ ట్రిక్ ప్లే చేస్తున్నారంటూ ట్రంప్ కామెంట్ చేయడంతో పరువునష్టం కేసు దాఖలైంది.  తనపై కేసుల విషయంలో విచిత్రంగా బైడెన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు ట్రంప్.  న్యాయవ్యవస్థ నియంత్రణ కోల్పోయిందనీ… రాజకీయంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు.  పైకోర్టుకు అప్పీల్ కు వెళతానన్నారు ట్రంప్

1996లో మాన్‌హటన్‌లోని ఓ స్టోర్‌లో కరోల్‌కు ట్రంప్‌ పరిచయమయ్యారు.  ఓ మహిళకు అండర్ వెయిర్స్ గిఫ్ట్ గా ఇవ్వాలని ట్రంప్‌ తనతో మాట కలిపారని కరోల్ చెప్పారు. ఆ టైమ్ లో ఒంటరిగా ఉన్న తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. తాను షాక్‌ అయ్యాననీ… అత్యాచార బాధితురాలిగా అనుకోకపోవడం వల్లే అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలిపారు. ఇది జరిగిన కొన్నేళ్ల తర్వాత ఓ బుక్ ట్రంప్ సంగతిని బయటపెట్టారు. ఈ వివరాలను న్యూయార్క్‌ మ్యాగజైన్‌ 2019లో ప్రచురించింది.