Nepal Earthquake : నేపాల్ లో మళ్లీ భూకంపం.. అయోధ్యలో భూప్రకంపనలు..
హిమాలయ దేశం నేపాల్ లో భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే.. నేపాల్ లో భూకంపం సంభవిస్తే .. వాటి ప్రభావం భూప్రకంపనలు భారతదేశంలోని పలు నగరాల్లో చోటు చేసుకుంటున్నాయి.
హిమాలయ దేశం (Himalayan country) నేపాల్ లో భూకంపం ( Nepal Earthquake) వచ్చిన సంగతి తెలిసిందే.. నేపాల్ లో భూకంపం సంభవిస్తే .. వాటి ప్రభావం భూప్రకంపనలు భారతదేశంలోని పలు నగరాల్లో చోటు చేసుకుంటున్నాయి. భూప్రకంపనలు ఉత్తరాది ప్రజలు ఆందోళన మొదలైంది. శుక్రవారం రాత్రి 11:47 నిమిషాలకు సంభవించిన భూకంపం 6.4 తీవ్రతతో నేపాలో లో తీవ్ర విషాదం నింపింది తెలిసిందే.. ఈ ప్రకృతి విపత్తులో పెద్ద సంఖ్యలో ఇళ్లు ధ్వంసం అయ్యి భారీ ఆస్తి నష్టం నెలకొంది. శనివారం ఉదయం నాటికి భూకంపం దాటికి మృతి చెందిన వారి సంఖ్య 157 కి చేరింది. ఎక్కువగా వ్యవసాయం చేసే పర్వత ప్రాంతం జాజరో కోట్ జిల్లాలో దాదాపు 105 మంది మరణించారు. రుకుమ్ జిల్లాలో 52 మంది మరణించారు. మరో 184 మంది తీవ్రంగా గాయపడ్డారని నేపాల్ ఆర్మీ తెలిపింది.
Telangana Rythubandhu scheme : ఎక్కువ భూములుంటే రైతుబంధు కట్..!? బాంబు పేల్చిన కేటీఆర్
తాజాగా నేపాల్ లో మరోసారి భూకంపం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం 3.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని అయోధ్య (Ayodhya0) కు ఉత్తరాన 215 కిలోమీటర్ల దూరంలో ఇవాళ తెల్లవారు జామున 1 గంటల తర్వాత భూకంపం సంభవించినట్లు అమెరికన్ నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ఎన్సీఎస్ నివేదించింది. ఈ భూకంప కేంద్రం జాజరోకోట్ లో 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లుగా గుర్తించారు.
SURESH