Japan Earthquake : జపాన్ లో భూకంపం.. 24 గంటల్లో 155 సార్లు భూప్రకంపనలు.. సూనామీ హెచ్చరికలు
యావత్ ప్రపంచం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అందరూ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు భారీ స్థాయిలో కార్యక్రామాలు సిద్ధం చేసుకుంటునారు. ఒక్క దేశం మాత్రం కొత్త సంవత్సరం రోజున.. ఈ భారీ విపత్తును చెవి చూడాల్సి వచ్చింది. అదే అత్యథునిక టేక్నాలజీతో ప్రపంచానికి సవాళ్లు విసురుతున్న జపాన్.

Earthquake in Japan.. 155 earthquakes in 24 hours.. Tsunami warnings
యావత్ ప్రపంచం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అందరూ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు భారీ స్థాయిలో కార్యక్రామాలు సిద్ధం చేసుకుంటునారు. ఒక్క దేశం మాత్రం కొత్త సంవత్సరం రోజున.. ఈ భారీ విపత్తును చెవి చూడాల్సి వచ్చింది. అదే అత్యథునిక టేక్నాలజీతో ప్రపంచానికి సవాళ్లు విసురుతున్న జపాన్.
న్యూ ఇయర్ రోజున జపాన్ వరుస భూకంపాలతో ఆ దేశాన్ని కుదిపేసింది. దీంతో టోక్యో లో.. భూకంపం ధాటికి వేల ఇండ్లు కుప్పకూలిపోయాయి. రిక్టర్ స్కేల్ పై 7.6 గా భూకంప తీవ్రత నమోదైంది. ఇప్పటి వరకు ఈ ఘటనలో దాదాపు 30 మంది మరణించినట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది. కూలిపోయిన భవనాల శిథిలాల నడుమ నుంచి మృతదేహాలను బయటకు తీసినట్లు అధికారులు నివేదించారు. సోమవారం నుంచి దాదాపుగా 155 సార్లు భూప్రకంపనలు చోటుచేసుకున్నట్లు భూపరిశోధన బృంధం తెలిపింది. యమగటా, ఫుకుమా, హ్యోగో, నీగాటా, టొయామా, ప్రిఫెక్చర్ సునామీ హెచ్చిరకలు జారీ చేసింది. దీంతో జపాన్ కు మరో సారి సునామీ సంభవించే అవకాశం ఉందని.. తీర ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జపాన్ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. నోటో ప్రాంతానికి 300 కిలో మీటర్ల దూరంలో భూ కంప కేంద్రం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.