Flood, California, America : అమెరికాలోని కాలిఫోర్నియాలో వరద బీభత్సం.. రెడ్ అలర్ట్ జారీ అధ్యక్షుడు జో బైడెన్
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రాన్ని శక్తిమంత మైన పసిఫిక్ తుపాను అతలాకుతలం చేసింది. ఈ తుపాను కారణంగా కాలిఫోర్నియా రాష్ట్రంలోని అనేక నగరాల్లో కుంభవృష్టి కురిసింది. ఈ వర్షాలకు నదులు పొంగి పొర్లుతుండటంతో వరదలు పోటెత్తాయి.

అమెరికాలోని కాలిఫోర్నియా వాసులు వరుస తుపానులతో బిక్కుబిక్కుమంటున్నారు.

భారీ వరదలు, మంచు కారణంగా రాష్ట్రంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు.

మరో రెండు రోజులు వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

కాలిఫోర్నియా వరదలను విపత్తుగా అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు.

సియెర్రా నెవడా ప్రాంతంలో మూడడుగుల మేర మంచు కురిసింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వారం రోజులుగా ఏడడుగుల మేర మంచు పడిందని తెలిపింది.

వరదల కారణంగా ప్రధాన రహదారులు, శివారు ప్రాంతాలు జలమయమయ్యాయి.

వరదలకు తోడు బలమైన గాలులు కూడా వీస్తున్నాయి.

అనేక చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలోని ఎనిమిది కౌంటీల్లో అత్యవసర పరిస్థితిని విధించారు.

రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలకు విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడిరది. ఈ తుపాను కారణంగా కాలిఫోర్నియా రాష్ట్రంలోని అనేక నగరాల్లో కుంభవృష్టి కురిసింది.

చాలా చోట్ల వీధుల్లోకి బురద కొట్టుకొచ్చింది. పలు చోట్ల రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. వరదల కారణంగా దెబ్బతిన్న పసిఫిక్ తీర హైవేను అధికారులు మూసివేశారు.

కొండచరియలు విరిగిపడుతుండటంతో రాష్ట్రంలోని దక్షిణాన ఉన్న పర్వతప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ప్రభుత్వం కోరింది.

అక్కడ గత 150 ఏళ్లలో నమోదైన అత్యధిక వర్షపాతాల్లో ఇది మొదటి ఐదు స్థానాల్లో ఉంది.

ఇక్కడ గత రెండు రోజుల్లో 10 అంగుళాల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.

మంగళవారం కూడా అక్కడ భారీ వర్షాలు, వరదలు సంభవించే ప్రమాదం ఉందని స్థానిక వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మరోవైపు ఇదే తుపాను లాస్‌వేగాస్, నెవాడ ప్రాంతాల్లో భారీ హిమపాతానికి కారణమైంది.

కాలిఫోర్నియా, అరిజోనా, నెవాడాల్లో 3.5 కోట్ల మంది ప్రస్తుతం వరద ముప్పులో ఉన్నారు.

సుమారు 2,90,000 గృహాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.

కుంభవృష్టి వల్ల వేల సంఖ్యలో విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది.

ఇక భారీ వర్షాలకు అమెరికా ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.

మరి కొన్ని రోజులు ప్రజలు జాగ్రతగా ఉండాలని.. అత్యవసరం అయితే తప్ప ఎవరు కూడా బయటకు రాకుడదని అమెరికా ప్రభుత్వం రెడ్డ్ అలర్ట్ జారీ చేసింది.
