America : అమెరికాలో ఓ బర్తడే పార్టీలో కాల్పులు.. నలుగురు మృతి..
అమెరికాలో మరోమారు కాల్పుల మోత మోగింది. ఉత్తర కెంటకీలోని ఫ్లోరెన్స్ సిటీలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.

Four killed in shooting at a birthday party in America
అమెరికాలో మరోమారు కాల్పుల మోత మోగింది. ఉత్తర కెంటకీలోని ఫ్లోరెన్స్ సిటీలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను 12 కిలో. మీ. దూరంలో ఉన్న సిన్సినాటి ఆసుపత్రికి తరలించారు. వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఆసుపత్రికి వర్గాలు వెల్లడి. కాల్పుల అనంతరం పరారైన నిందితుడిని పోలీసులు చేజ్ చేసే క్రమంలో అతడి కారు గుంతలో పడింది. అప్పటికే అతడు తనకు తాను కాల్చుకుని ఆత్మహత్యకు యత్నించినట్టు పోలీసులు తెలిపారు.
ఇక అతడిని ఆసుపత్రిలో చేర్చగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తెలిపారు. బర్త్ డే పార్టీ సందర్భంగా ఈ ఘటన జరిగిందని, నిందితుడు ఇంటి యజమాని కొడుకే(21)నని, ఈ ఘటనలో ఇంటి యజమాని కూడా మృతి చెందినట్టు చెప్పారు. తెల్లవారుజామున 2.50 గంటలకు ఓ ఇంట్లో ఈ ఘటన జరిగిందని, సమాచారం అందుకుని వెళ్లేసరికి ఏడుగురు బాధితులు కనిపించినట్టు పోలీసులు తెలిపారు. గత నెల జూన్ 23న, అమెరికాలోని కెంటకీ రాష్ట్రం లో కాల్పుల సంఘటన జరిగిన విషయం తెలిసిందే..