2024 UK Election Result.. Rishi Sunak : బ్రిటన్‌లో లేబర్ పార్టీ ఘన విజయం.. రిషి సునాక్ ఘోర ఓటమికి 7 కారణాలు ఇవే..
భారత సంతతికి చెందిన.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ బ్రిటన్ అధ్యక్ష ఎన్నికల్లో ఘోర ఓటమి పాలయ్యారు. 2024 బ్రిటన్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 650 స్థానాలకు గాను ఇప్పటివరకు సగానికి పైగా నియోజకవర్గాల ఫలితాలు వెలువడ్డాయి.

Great victory of Labor Party in Britain.. These are 7 reasons for Rishi Sunak's heavy defeat..
భారత సంతతికి చెందిన.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ బ్రిటన్ అధ్యక్ష ఎన్నికల్లో ఘోర ఓటమి పాలయ్యారు. 2024 బ్రిటన్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 650 స్థానాలకు గాను ఇప్పటివరకు సగానికి పైగా నియోజకవర్గాల ఫలితాలు వెలువడ్డాయి. మ్యాజిక్ ఫిగర్(326)ను దాటి 364 సీట్లను కైవసం చేసుకుంది లేబర్ పార్టీ.. ప్రధాని రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీకి 77 సీట్లు, లిబరల్ డెమొక్రాటిక్ 48 సీట్లలో గెలిచింది. ఓటమికి తనదే బాధ్యతని సునాక్ వెల్లడించారు. లేబర్ పార్టీ నేత కైర్ స్టార్మర్‌కు ఫోన్ చేసి అభినందించారు. కాగా రిషి సునాక్ రిచ్‌మండ్&నార్తలర్టన్ స్థానానికి తిరిగి ఎంపీగా ఎన్నికయ్యారు. కాగా గత 14 ఏళ్లుగా బ్రిటన్‌లో అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ పాలనకు తెరపడింది. లేబర్ పార్టీ తరఫున కీర్ స్టార్మర్ ప్రధాని అభ్యర్థిగా ఉన్నారు. లేబర్ పార్టీ నాయకుడు కైర్ స్టార్మేర్ తర్వతి బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇవాళే అధికార మార్పిడి జరుగుతుందని సమాచారం..
బ్రిటన్ వ్యాప్తంగా మొత్తం 4.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. కాగా ఈ సారి 2019తో పోలిస్తే తక్కువ పోలింగ్ నమోదైనట్లు అధికారులు అంచనా వేశారు. గత ఎన్నికల్లో 67 శాతం పోలింగ్ నమోదైంది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 10 గంటల సమయానికి లేబర్ పార్టీ 368 సీట్లు కైవసం చేసుకోగా.. కన్జర్వేటివ్ పార్టీ 87 స్థానాల్లో గెలుపొందింది. బ్రిటన్ కాలమానం ప్రకారం గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. రాత్రి 10 గంటలకు వరకు కొనసాగింది.
- క్షమించండి.. ఓటమికి బాధ్యత నాదే.. రిషి సునాక్
బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఓటమి ఖాయమైంది. 2024 కన్జర్వేటివ్ పార్టీ ఓటమిని రిషి సునాక్ అంగీకరించారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం సాధించింది.. ఈ సందర్బంగా ఆ పార్టీ నేత కీర్ స్టార్మర్ అభినందనలు తెలియజేశారు. రిచ్‌మండ్ అండ్ నార్తర్న్ అలర్టన్‌లోని తన మద్దతుదారుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. వారిని క్షమించమని కోరారు. ఈ ఓటమికి తానే పూర్తి బాధ్యత వహిస్తానని ఆ పార్టీ నేత, భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్ అన్నారు. మరోవైపు సునాక్ కేబినెట్ మంత్రులైన గ్రాంట్ షాప్స్, అలెక్స్ చాల్క్ ఈ ఎన్నికల్లో ఓడిపోయారు.
కన్జర్వేటివ్ పార్టీ ఓటమికి 7 ప్రధాన కారణాలు..
- 2016 నుంచి ఐదుగురు ప్రధానులు మారడం..
- దేశంలో ఆర్థిక సంక్షోభ పరిస్థితుల సంభవించడం..
- ఆరు నెలల గడువు ఉండగానే ముందస్తు ఎన్నికలకు వెళ్లడం..
- రిషి సునాక్ నిర్ణయంపై సొంత పార్టీ నాయకుల వ్యతిరేకత..
- ఆర్థిక సంక్షోభంపై ఇచ్చిన మాట నిలబెట్టు లేకపోవడం..
- ముఖ్యంగా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భార్య అక్షతా మూర్తి సంపాదన పై ఆరోపణలు..
- బ్రిటన్ లో జీవన వ్యయ సంక్షోభం నానాటికీ చతికిల పడటం..