Turkey : టర్కీలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి
టర్కీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన టర్కీలోని పశ్చమిలో ఉన్న ఇజ్మీర్ నగరంలో సోమవారం ఒక రెస్టారెంట్‌లో ప్రొపేన్ ట్యాంక్ పేలుడు సంభవించింది.

Huge explosion in Turkey.. Five killed
టర్కీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన టర్కీలోని పశ్చమిలో ఉన్న ఇజ్మీర్ నగరంలో సోమవారం ఒక రెస్టారెంట్‌లో ప్రొపేన్ ట్యాంక్ పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బందిని వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, 63 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.. మరోవైపు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడి. ఒక్కసారిగా ఈ పేలుడు ఘటనకు చుట్టుపక్కల ఉన్న భవనాలు స్వల్ప నష్టాలకు గురయ్యాయి.
ఇజ్మీర్ గవర్నర్ సులేమాన్ ఎల్బాన్ ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. కాగా ఈ పేలుడు ఘటనకు ఇజ్నీర్ పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.