Ismail Vs Israel, Mossad : మొసాద్ టార్గెట్ చేస్తే.. శాల్తీ ఎవడైనా గల్లంతే.. వెన్నులో వణుకు పుట్టించే నిజాలు..
మొసాద్.. దేనికైనా భయం కూడా భయపడుతుందా అంటే.. అదే మొసాద్. అణువణువునా దేశభక్తి.. ప్రతీ కణంలో ప్రాణాలకు తెగించే ధైర్యం. ఇంకా చెప్పాలంటే దే విల్ మేక్ ది రూల్స్.. దే విల్ బ్రేక్ ది రూల్స్.

If Mossad makes a target.. Salty anyone can lose.. The truths that make the spine tremble
మొసాద్.. దేనికైనా భయం కూడా భయపడుతుందా అంటే.. అదే మొసాద్. అణువణువునా దేశభక్తి.. ప్రతీ కణంలో ప్రాణాలకు తెగించే ధైర్యం. ఇంకా చెప్పాలంటే దే విల్ మేక్ ది రూల్స్.. దే విల్ బ్రేక్ ది రూల్స్. ఇలా వెళ్లాలి.. ఇలా వెళ్లాలనే నియమాలు, నిబంధనలు లేవు. ఎలాగైనా వెళ్తారు.. వేసేస్తారు అంతే ! దేశం కోసం దేశాలు దాటేసి.. రక్తపాతం సృష్టించే నిఘా సంస్థ. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్య తర్వాత.. ఈ పేరు మళ్లీ తెరమీదకు వచ్చింది. మొసాద్ (Mossad) అనేది ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ. ఈ సంస్థ గురించి ఒక్కోరు ఒక్కోలా చెప్తారు. ఒకరి కథ ఆశ్చర్యం అనిపిస్తే.. మరొకరు చెప్పే కథ మాత్రం వెన్నులో వణుకు పుట్టిస్తుంది.
ఇది కూడా చదవండి : Israel, Iran War : ఇజ్రాయెల్ పై ఇరాన్ భీకర దాడులు.. యుద్ధానికి సంకేతమా..?
హిబ్రూ భాష (Hebrew language) లో మొసాద్ అంటే.. సంస్థ అని అర్థం. వాల్డ్‌లోని శక్తిమంతమైన గూఢచర్య సంస్థల్లో మొసాద్ ఒకటి. మొసాద్ ఆపరేషన్ చేపట్టిందంటే.. ఏ చిన్న ఆధారం కూడా దొరకదు.. ఇప్పుడు కూడా అదే జరిగింది. హమాస్ చీఫ్ (Hamas chief) హత్య వెనక మొసాద్ ఉందన్న అనుమానమే తప్ప.. అది నిజం అని ప్రూవ్ చేయడానికి ఆధారం లేదు. ఏం చేసినా.. ఎలా చేసినా.. మొసాద్ ఎప్పుడూ బహిరంగంగా ఒప్పుకోదు. ఆ సంస్థ పుట్టినప్పటి నుంచి.. అలా జరిగిన సంఘటన ఒక్కటి కూడా లేదు. ప్రాణాలకు తెగించి పోరాడడం.. మొసాద్‌కు కొత్తేం కాదు. ఇజ్రాయెల్‌కు అన్ని వైపులా శత్రుదేశాలు ఉండటం.. చాలా కఠిన పరిస్థితులను ఎదుర్కోవడంతో.. ఇలాంటి విధానాలనే మొసాద్ మొదటి నుంచి అనుసరిస్తోంది.
ఇది కూడా చదవండి : Hamas Chief Murder : 2నెలల కిందే గదిలో బాంబ్ ఫిక్స్.. ఎంటర్ అవుతూనే బ్లాస్ట్.. హమాస్ చీఫ్ హత్య వెనక మాస్టర్ ప్లాన్
ఇజ్రాయెల్ దేశం ఆవిర్భవించిన ఏడాది తర్వాత.. అంటే 1949లో మొసాద్ సంస్థ ఏర్పాటు జరిగింది. ఇజ్రాయెల్ (Israel) యూదుల దేశం. దీని చుట్టూ ఐదు అరబ్ దేశాలు ఉన్నాయ్. సరిహద్దుల వెంట శత్రువులపై ఎప్పుడూ నిఘా పెట్టేందుకు… మొసాద్ లాంటి సంస్థ ఇజ్రాయెల్‌కు అవసరమైంది. ఆ అవసరమే ఈ సంస్థకు బీజం వేసింది. 1960ల్లో నిర్వహించిన ఓ ఆపరేషన్‌తో… ప్రపంచదేశాల దృష్టి మొసాద్‌పై పడింది. మాజీ నాజీ అధికారి అడాల్ఫ్ ఈచ్‌మన్‌ను ప్రాణాలతో పట్టుకునేందుకు మొసాద్ ఈ ఆపరేషన్ (operation) చేపట్టింది. అర్జెంటీనాలో అతన్ని పట్టుకొని.. ఇజ్రాయెల్‌కు ప్రాణాలతో తీసుకువచ్చింది. ఇది మొసాద్ చేపట్టిన అతిపెద్ద భారీ ఆపరేషన్.
ఇది కూడా చదవండి : lsrael lran War : పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు.. ఫైటర్‌జెట్లతో దాడి చేసేందుకు రెడీగా ఉన్న అమెరికా
ఇక విదేశాల్లో ఆపరేషన్లు చేపట్టడానికి మొసాద్ ఎప్పుడూ ఇంకో ఆలోచన చేయదు. తమ శక్తి, సామర్థ్యాలతో ప్రపంచ దేశాలను మొసాద్ ఎప్పుడూ అవాక్కయ్యేలా చేస్తోంది. మొదట్లో ఏ గూఢచర్య సంస్థలూ తీసుకోనన్ని రిస్క్‌లు మొసాద్ తీసుకుంది. మిగతా దేశాలు తమ గురించి ఏం అనుకుంటున్నాయన్నది పట్టించుకోలేదు. మొసాద్‌లో పనిచేసే ఒక్కరికి కూడా ప్రాణం పోతుందనే భయం లేదు. దేశం కోసమే ఈ ప్రాణం అన్నట్లుగా కష్టపడుతుంటారు. ల్యాండ్‌మైన్లపై కాలు పెట్టడం, శత్రు దేశాలను కవ్వించడం, విదేశాల్లో నేరాలు చేయడం, ఇంటర్నేషనల్ చట్టాలను ఉల్లంఘించడం.. దేశం కోసం ఏమైనా చేయడానికి మొసాద్ టీమ్ రెడీగా ఉంటుంది. తమకు, తమ దేశానికి ఇబ్బందిగా మారారు.. ఇబ్బంది పెడుతున్నారు అనుకుంటే.. మరో ఆలోచన లేకుండా హత్యలు చేయడమే మొసాద్‌కు తెలిసిన పని. ఇలాంటి చర్యలతోనే ప్రపంచవ్యాప్తంగా భయం క్రియేట్ చేసి పేరు సంపాదించుకుంది మొసాద్.
ఇది కూడా చదవండి : Algerian boxer : అతడా ? ఆమెనా ? అల్జీరియా బాక్సర్ పై నెట్టింట చర్చ
1972లో మ్యూనిక్ ఒలింపిక్స్ (Munich Olympics) లో పాల్గొనడానికి వెళ్లిన 11మంది ఇజ్రాయెల్ క్రీడాకారులను పాలస్తీనా అతివాదులు హత్య చేశారు. దీన్ని మనసులో పెట్టుకున్న మొసాద్.. చాలాఏళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకుంది. ఈ ఘటనకు బాధ్యుల్ని మొసాద్ (Mossad) లక్ష్యంగా చేసుకుంటూ వచ్చింది. మొరాకోకు చెందిన ఓ అమాయక పౌరుణ్ని నార్వేలో మొసాద్ హత్య (Mossad Murder) చేసింది. ఆ సమయంలో మొసాద్ చాలా ఆగ్రహంతో ఉండేది. బ్లాక్ సెప్టెంబరుతో సంబంధంలేని చాలా మందిని కూడా లక్ష్యంగా చేసుకుంది.
ఇది కూడా చదవండి : Biggest Car Companies : ప్రపంచంలో అతిపెద్ద కార్ల కంపెనీలు ఎవో తెలుసా..?
ఇక మొసాద్ నెట్‌వర్క్ (Mossad Network) ప్రపంచవ్యాప్తంగా ఉంది. ట్విన్ టవర్లు కూలినప్పుడు సమాచారం కోసం అమెరికా (America) మొదట చూసింది మొసాద్ వైపే. ఇప్పుడు హమాస్ చీఫ్ హనియే హత్య తర్వాత మొసాద్ పేరు మళ్లీ వినిపిస్తోంది. హనియే హత్యకు మొసాద్ ప్లాన్.. ప్రతీ ఒక్కరిని అవాక్కయ్యేలా చేసింది. ఇద్దరు ఏజెంట్ల సాయంతో.. మూడు గదుల్లో బాంబులు పెట్టించింది. ఇదంతా శత్రుదేశం ఇరాన్‌లో చేసింది. రెండు నెలలు వెయిట్ చేసి మరీ.. హమాస్ చీఫ్‌ను లేపేసింది. ఇదీ మొసాద్ ప్లానింగ్ అంటే.. మొసాద్ ఎగ్జిక్యూషన్ అంటే !