India vs Australia, : టాస్ ఓడితే మ్యాచ్ గెలిచినట్లే.. కప్ మనదే.. రాసిపెట్టుకో బిగిలు..
దేశమంతా ఇప్పుడు టీవీలకు అతుక్కుపోయింది. వన్డే వాల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ స్టార్ట్ అయింది. మెగా మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా టాస్ ఓడిపోవడంతో భారత క్రికెట్ అభిమానులంతా కాస్త నిరాశకు గురయ్యారు. ఐతే ఇందులో కంగారు పడాల్సిన పనిలేదు.
దేశమంతా ఇప్పుడు టీవీలకు అతుక్కుపోయింది. వన్డే వాల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ స్టార్ట్ అయింది. మెగా మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా టాస్ ఓడిపోవడంతో భారత క్రికెట్ అభిమానులంతా కాస్త నిరాశకు గురయ్యారు. ఐతే ఇందులో కంగారు పడాల్సిన పనిలేదు. మోదీ క్రికెట్ స్టేడియంలో టాస్ అంత కీలకం కాదు. ముందుగా బ్యాటింగ్ చేసినా, బౌలింగ్ చేసినా పెద్దగా ఫరక్ పడదు. ఇప్పుడు టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వస్తుండటంతో ఏ మాత్రం ఒత్తిడి లేకుండా ఫ్రీగా బ్యాటింగ్ చేయవచ్చు. ఐతే ఈ టాస్ ఓడిపోవడం టీమిండియాకే ఒక రకంగా కలిసొచ్చేలా ఉంది. పిచ్ ఎలా ఉంది.. స్టేడియంలో సీన్ ఏంటి అన్న సంగతి పక్కన పెడితే.. ఓ సెంటిమెంట్ ప్రకారం.. టీమిండియాదే విజయం అని క్లియర్‌గా అర్థం అవుతోంది.
ICC WORLD CRICKET CUP: కష్టాల్లో ఇండియా… మూడు వికెట్లు కోల్పోయిన భారత్
వాల్డ్‌కప్ ఫైనల్‌లో టాస్ ఓడిన ప్రతీసారి.. భారత్ కప్ ఎగురేసుకుపోయింది. గెలిచినప్పుడు.. ఓడిపోయింది. కావాలంటే ఒక్కసారి క్రికెట్ హిస్టరీ పుస్తకాలు తిరగేసి చూడండి.. మీకే అర్థం అవుతుంది ! ఇది ఇప్పటిది కాదు.. 1983నుంచి ఇదే జరుగుతోంది. 1983లో అండర్‌డాగ్స్‌గా వాల్డ్‌కప్ ఎంట్రీ ఇచ్చిన భారత్.. సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పట్లో బలంగా ఉన్న వెస్టిండీస్, ఇంగ్లండ్, జింబాబ్వేలాంటి జట్లకు షాక్ ఇస్తూ.. కప్ ఎగురేసుకుపోయింది. ఐతే ఫైనల్ ఫ్యాన్‌లో విండీస్‌లో ఢీకొట్టగా.. అప్పుడు టాస్ ఓడింది కపిల్ సేన. ఐతే కప్ మాత్రం కొట్టేసింది. 2003లో వాల్డ్‌కప్ ఫైనల్ చేరిన భారత్… ఆస్ట్రేలియాను ఢొట్టింది. ఐతే ఆ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా.. ఫైనల్లో చతికిలపడిపోయింది. ఆస్ట్రేలియా కప్ నెగ్గింది. 2011 ఫైనల్‌లో ధోని సేన టాస్ ఓడిపోయింది. ఐతే శ్రీలంక మీదా గ్రాండ్ విక్టరీ కొట్టి కప్‌ను ముద్దాడింది. 2023.. అంటే ఇప్పుడు ఫైనల్ మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడిపోయింది. సెంటిమెంట్ ప్రకారం.. మ్యాచ్ గెలవడం పక్కా అంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.