UK లో మనోళ్లను..వేటాడి తరిమేస్తున్నారు..|

ఈ ట్రంప్ ఉన్నాడే...! ఉన్నచోట ఉండడు... ఏదోటి కెలికి దాన్ని చేంతాడంత చేస్తాడు. ఇలాగే తన జబ్బును ఇతర దేశాలకు కూడా అంటించాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 12, 2025 | 02:45 PMLast Updated on: Feb 12, 2025 | 2:45 PM

In The Uk They Are Hunting And Killing The Ghosts

ఈ ట్రంప్ ఉన్నాడే…! ఉన్నచోట ఉండడు… ఏదోటి కెలికి దాన్ని చేంతాడంత చేస్తాడు. ఇలాగే తన జబ్బును ఇతర దేశాలకు కూడా అంటించాడు. ఇమ్మిగ్రేషన్‌ విధానాన్ని కఠినంగా అమలు చేస్తున్న ట్రంప్… ఇప్పుడు బ్రిటన్‌కు ఆదర్శంగా మారిపోయాడు. మేం కూడా మీ బాటలోనే అంటూ ఆ దేశం కూడా అక్రమ వలసదారులపై ఫోకస్ పెట్టింది. ఏరివేతను మొదలు పెట్టింది. మన భారతీయులు కూడా చాలామంది దొరికిపోయారు.

అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని వేటాడి మరీ వెనక్కు పంపేస్తున్నారు ట్రంప్. ఈ డిపోర్టేషన్ ఇప్పుడు కొత్తదేం కాకపోయినా తనకు అది తప్ప వేరే పనిలేదన్నట్లు దానిపైనే ఫోకస్ పెట్టి ప్రపంచం దృష్టంగా దానిపైనే పెట్టేలా చేశాడు. ఇదేదో మైలేజ్ తెచ్చేలా ఉందనుకుని మిగిలిన దేశాల నేతలు కూడా ఆయన్ను ఫాలో అయిపోవాలని డిసైడైపోయారు. బ్రిటన్ ప్రధాని కీవ్ స్టార్మర్ ఈ రేసులో ముందున్నారు. తమ దేశంలో అక్రమంగా ఉంటున్న వివిధ దేశాల వారిని వెనక్కు పంపించడంపై ఫోకస్ పెట్టారు. బ్రిటన్‌లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్‌పై ఫోకస్ పెట్టింది. ఆ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మాస్ డిపోర్టేషన్‌కు దిగింది. ఆ వీడియోను కూడా షేర్ చేసింది. వీరిని తరలించేందుకు చార్టర్డ్ ఫ్లైట్స్‌ను వాడుతోంది.

బ్రిటన్ అధికారులు తమ దేశంలో అక్రమంగా ఉంటున్న వారిపై యుద్ధం ప్రకటించారు. అందులో భాగంగా రెస్టారెంట్లు, బార్లు, కార్ వాషింగ్ సెంటర్లు, సూపర్ మార్కెట్లపై వరుసగా దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా ఇండియన్ రెస్టారెంట్లపై ఫోకస్ పెట్టారు. ఎక్కడిక్కకడ తనిఖీలు చేస్తున్నారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే అదుపులోకి తీసుకుంటున్నారు. వారి దగ్గర సరైన డాక్యుమంట్లు లేకపోతే మాత్రం క్యాంపులకు తరలిస్తున్నారు. లేబర్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు 19వేల మందిని డిపోర్ట్ చేసింది. ఆ దేశ చరిత్రలో ఇదే అత్యధికం. ఈ జనవరిలోనే 828 చోట్ల దాడులు చేశారు. 609మంది అక్రమ వలసదారులను బంధించారు. అంతకుముందు ఏడాదితో పోల్చితే ఇది ఏకంగా 73శాతం ఎక్కువ. ఉత్తర ఇంగ్లండ్‌ హంబర్‌సైడ్‌లోని ఓ భారతీయ రెస్టారెంట్‌లో సోదాలు చేస్తే ఏకంగా ఏడుగురు ఎలాంటి పత్రాలు లేకుండా పట్టుబడ్డారు. అంతేకాకుండా నిబంధనలు పాటించకపోతే ఫైన్లు గట్టిగానే వేస్తున్నారు. అక్రమ వలసదారులను ఉద్యోగంలో తీసుకున్నందుకు దాదాపు 11వందల మందికి సివిల్ పెనాల్టీ నోటీసులు ఇచ్చారు. 60వేల పౌండ్ల వరకు అంటే మన కరెన్సీలో చెప్పాలంటే 64లక్షలకు పైనే అన్నమాట. ముందుగా దొరికిన వారిని క్యాంపులకు పంపుతున్నారు. వీరిలో నేరాలకు పాల్పడిన వారుంటే ముందుగా వారిని వారి వారి దేశాలకు తరలించేస్తున్నారు.

ట్రంప్‌నే ఫాలో అయిపోతున్నారు బ్రిటన్ ప్రధాని కీవ్ స్టార్మర్. ఎన్నికల ప్రచారంలో ఆయన అక్రమ వలసదారుల భరతం పడతానని వార్నింగ్ ఇచ్చారు. గెలిచిన తర్వాత ఆయనపై ఒత్తిడి పెరిగింది. పైగా ఎప్పుడైతే ట్రంప్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్‌పై యుద్ధం ప్రకటించారో అప్పటి నుంచి స్టార్మర్‌కు సొంతపార్టీ నుంచే సెగ తగిలింది. దీంతో అక్రమ వలసదారులను వేటాడంపై అధికారులకు అధికారాలు ఇచ్చేశారు. ట్రంప్ సర్కార్ డిపోర్టేషన్ ప్రక్రియను వీడియో తీసి విడుదల చేస్తోంది. బ్రిటన్ కూడా అలాంటి వీడియోనే రిలీజ్ చేసి మేము కూడా సీరియస్‌గానే ఉన్నామంటూ తమ ప్రజల్లో ఇమేజ్‌ను పెంచుకుంటోంది. దీంతో పాటు తమ దేశంలోకి అక్రమంగా ఏఏ దేశాల వారు చొరబడుతున్నారో గుర్తించి వారి వారి దేశాల్లో దీనికి వ్యతిరేకంగా క్యాంపయిన్ కూడా నిర్వహిస్తోంది బ్రిటన్. లక్షలు ఖర్చుపెట్టి ఇంగ్లండ్‌లో అడుగుపెట్టి భయంభయంగా గడుపుతూ యజమానుల దోపిడీకి గురవడం తప్ప ఉపయోగం ఉండదని హెచ్చరిస్తోంది. ఈ వారంలోనే బ్రిటన్ పార్లమెంట్ ముందుకు న్యూ బోర్డర్ సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ బిల్ రాబోతోంది. లా అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు మరిన్ని పవర్స్ ఇస్తూ దీన్ని తీసుకువచ్చారు. క్రిమినల్ గ్యాంగ్స్, మానవ అక్రమ రవాణాముఠాల పనిపట్టడానికి ఇది సమర్ధంగా పనిచేస్తుందన్నది కీవ్ స్టార్మర్ ప్రభుత్వ వాదన. అందులో భాగంగానే వేలమందిని అరెస్ట్ చేస్తోంది.

అమెరికాలో లాగానే బ్రిటన్‌లోనే చాలామంది భారతీయులు అక్రమంగా ఉంటున్నారు. వీరి సంఖ్య వేలల్లో కాదు లక్షల్లో ఉంటుందన్నది ఓ అంచనా. అమెరికన్ డాలర్ కంటే బ్రిటన్ పౌండ్ రేటెక్కువ. అయితే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కాస్త ఎక్కువ. మనవారిలో చాలామంది దొడ్డిదారిన బ్రిటన్ వెళ్లిపోయి అక్కడే ఏదో ఓ పనిచేసుకుంటూ బతికేస్తున్నారు. ఇప్పుడు వారందిరికీ ఈ డిపోర్టేషన్ టెన్షన్ పట్టుకుంది. ఇన్నాళ్లూ చూసీ చూడనట్లు వదిలేసిన ఇంగ్లండ్ అధికారులు ఇప్పుడు రెచ్చిపోతుండటంతో చాలామంది అండర్ గ్రౌండ్‌కి వెళ్లిపోయారు. మొత్తానికి ట్రంప్ చూపిన దారిలో బ్రిటన్ నడుస్తోంది. ఫ్రాన్స్ వంటి మరికొన్ని యూరోపియన్ దేశాలు కూడా ఇదే రూట్ ఫాలో అయిపోవాలని భావిస్తున్నాయి. ట్రంప్ పెట్టిన కంపు మొత్తానికి ఇలా లక్షలమందిని ఇరకాటంలోకి నెట్టింది.