Olympics 2024 : ఒలింపిక్స్‌లో భోణి కొట్టిన భారత్.. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బాకర్ కు కాంస్య పతకం..
పారిస్ (Paris) లో జరుగుతున్న ఒలింపిక్స్ (Olympics) లో భోణి కొట్టిన భారత్.. ఎయిర్‌పిస్టల్ (Air Pistol Category) లో కాంస్య పతకం (Bronze medal)..
పారిస్ (Paris) లో జరుగుతున్న ఒలింపిక్స్ (Olympics) లో భోణి కొట్టిన భారత్.. ఎయిర్‌పిస్టల్ (Air Pistol Category) లో కాంస్య పతకం (Bronze medal).. యువ షూటర్ (Youth Shooter) మను బాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలుచుకుంది. ఈ పోటీలో మను 221.7 పాయింట్ల సాధించి మూడో స్థానంలో నిలువగా.. సౌత్ కొరియాకు చెందిన (243.2), కిమ్ (241.3) మొదటి రెండు స్థానాల్లో నిలిచి స్వర్ణం, రజత పథకాలు సొంతం చేసుకున్నారు. కాగా పారిస్ ఒలింపిక్స్‌లో షూటింగ్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళా షూటర్ (Women Shooter) గా సృష్టించింది.
గత ఒలింపిక్స్ లో మను బాకర్ దారుణంగా ఓడిపోయారు. దీంతో ఆ ఓటమితో ఆమె ఈ సారి అత్యుత్తమగా రాణిచ్చి.. కాంస్యం పథకం వరించింది. మరో వైపు క్వాలిఫైయింగ్ రౌండ్ పోటీలలో 22 సంవత్సరాల మను 580 పాయింట్లు సాధించడం ద్వారా మూడో అత్యుత్తమ షూటర్ గా ఫైనల్స్ లో చోటు ఖాయం చేసుకొంది. హంగెరీ షూటర్ వెరోనియా 582 పాయింట్లతో టాపర్ గా నిలిచింది. ఇదే విభాగంలో పోటీకి దిగిన మరో భారత షూటర్ రిథిమా సంగ్వాన్ 573 పాయింట్లతో 15వ స్థానం సాధించడం ద్వారా ఫైనల్లో చోటు దక్కించుకోలేకపోయింది.