Austria : 41 ఏళ్లలో తర్వాత ఆస్ట్రియాకు భారత ప్రధాని.. ఆస్ట్రియాకు చేరుకున్న నరేంద్ర మోదీ..
భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా లో 2 రోజుల పర్యటన అనంతరం.. ఆస్ట్రియా దేశంకు చేరుకున్నారు. ఆ దేశంలో నరేంద్ర మోదీ 2 రోజలు పర్యటించనున్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా లో 2 రోజుల పర్యటన అనంతరం.. ఆస్ట్రియా దేశంకు చేరుకున్నారు. ఆ దేశంలో నరేంద్ర మోదీ 2 రోజలు పర్యటించనున్నారు. కొద్ది సేపటి క్రితమే.. ఆస్ట్రియా విదేశాంగ మంత్రి అలెగ్జాండర్ షాలెన్‌బర్గ్ భారత ప్రధానిని రిసీవ్ చేసుకున్నారు. దీనికి సంబంధించి మోదీ ట్వీట్ చేశారు. ‘ఇప్పుడు వియన్నాలో ల్యాండ్ అయ్యాను. ఆస్ట్రియాకు చేపడుతున్న ఈ పర్యటన చాలా ప్రత్యేకమైనది. ఇరు దేశాలు ఉమ్మడి విలువలతో అనుసంధానమై ఉన్నాయి. ఇక్కడి భారత ప్రజలు, ఛాన్సలర్‌ను కలిసేందుకు ఆసక్తిగా ఉన్నా’ అని పేర్కొన్నారు. మోదీ ఈ పర్యటనకు ముందు మోడీ మాట్లాడుతు.. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, న్యాయ పాలన ఉమ్మడి విలువలు కలిగిన రెండు దేశాలు ఎప్పటికీ సన్నిహిత భాగస్వామ్యాన్ని నిర్మించడానికి పునాదిగా ఉన్నాయన్నారు. ఆస్ట్రియా దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ.. ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్‌తో చర్చలు జరపున్నారు. ప్రధాని.. ఛాన్సలర్ ఇరు దేశాల వ్యాపారవేత్తలనుద్దేశించి ప్రసంగించనున్నారు.
41 ఏళ్లలో తర్వాత ఆస్ట్రియాకు భారత ప్రధాని..
ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన ముగించుకుని ఆస్ట్రియాకు పయనమయ్యారు. 41 ఏళ్లలో ఓ భారత ప్రధాని ఆస్ట్రియాకు వెళ్లడం ఇదే తొలిసారి. చివరిసారిగా 1983లో ఇందిరాగాంధీ ఆస్ట్రియా పర్యటనకు వెళ్లారు. అంతకుముందు 1955లో జవహర్ లాల్ నెహ్రూ ఆ దేశంలో పర్యటించారు. దీంతో ఆస్ట్రియాలో పర్యటించనున్న మూడో భారత ప్రధానిగా మోదీ నిలిచారు. వియన్నాలో ఆ దేశ అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్‌డర్ బెల్లెన్‌తో మోదీ భేటీ కానున్నారు.