Israel, Iran War : ఇజ్రాయెల్ పై ఇరాన్ భీకర దాడులు.. యుద్ధానికి సంకేతమా..?

ఇజ్రాయెల్ (Israel) పై ఇరాన్ (Iran) ప్రతీకార చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇరాన్ మద్దతుగల హిజ్బుల్లా గ్రూప్ ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దుకు సమీపంలోని పట్టణాలపై రాకెట్ల వర్షం కురిపించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 13, 2024 | 12:47 PMLast Updated on: Apr 13, 2024 | 1:22 PM

Irans Fierce Attacks On Israel A Sign Of War

 

 

 

ఇజ్రాయెల్ (Israel) పై ఇరాన్ (Iran) ప్రతీకార చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇరాన్ మద్దతుగల హిజ్బుల్లా గ్రూప్ ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దుకు సమీపంలోని పట్టణాలపై రాకెట్ల వర్షం కురిపించింది. లెబనీస్ భూభాగం నుంచి ఇజ్రాయెల్ వైపు దాదాపు 100 రాకెట్లు, డ్రోన్లు ప్రయోగించినట్లు సమాచారం.. దీంతో ఇరు దేశాల సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏ క్షణమైన ఇరు దేశల మద్య యుద్దం జరగవోచ్చని… ప్రస్తుత పరిస్థితులు చెబుతున్నాయి.

ఇటీవల సిరియాలోని ఓ కాన్సూలేట్పై ఇజ్రాయెల్ వైమానిక దాడి (Israeli air strikes) చేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ డాడిలో ఇరాన్ సైనిక జనరల్‌తోపాటు ఆరుగురు సైనికాధికారులు మరణించారు. తమ కాన్సులేట్‌పై దాడికి ప్రతీకారంగా 48 గంటల్లో ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష దాడులు చేసేందుకు ఇరాన్‌ సిద్ధమైందని ఇరాన్‌ నేత ఒకరిని ఉటంకిస్తూ వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ శుక్రవారం కథనం వెలువడ్డాయి. ఇరాన్‌ దాడి చేస్తే ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్‌ కూడా సిద్ధమవుతున్నట్లు ఇజ్రాయెల్‌ సైన్యం హెచ్చరించింది. ఇజ్రాయెల్‌పై డ్రోన్లు, క్రూయిజ్‌, బాలిస్టిక్‌ క్షిపణులతో ఇరాన్‌ దాడులు చేసే అవకాశం ఉన్నదని అమెరికా అధికారులు కూడా వెల్లడించారు.

ఈ దాడి వెనుక ఇజ్రాయెల్ ఉన్నట్లు ఇరాన్ ఆరోపించింది. కాగా ఈ దాడిలో తమ పాత్ర గురించి నేటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఏప్రిల్ 1న డమాస్కస్‌లోని ఇరాన్ కాన్సలేట్‌పై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తమపై యుద్ధం చేస్తున్న హమాస్ ఉగ్రవాదులకు ఇరాన్ మద్దతు ఇవ్వడం పట్ల ఇజ్రాయెల్ గ్రహం వ్యక్తం చేస్తోంది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి ఖాయమని భావిస్తున్న అమెరికా ఇజ్రాయెల్‌లోని అమెరికా పౌరులకు హెచ్చరిక జారీచేసింది.

SSM