Algerian boxer : అతడా ? ఆమెనా ? అల్జీరియా బాక్సర్ పై నెట్టింట చర్చ
క్రీడల్లో (Sports) అప్పడప్పుడు జెండర్ వివాదాలు చూస్తూనే ఉంటాం... మహిళల విభాగంలో పోటీపడుతున్నా కొందరికి హార్మోన్ల లోపాలతో ఎక్స్ వై క్రోమోజోమ్స్ (Chromosomes), టెస్టోస్టిరాన్స్ (Testosterones) పురుషుల స్థాయిలో ఉండడంతో వారిపై సందేహాలు వస్తుంటాయి.
క్రీడల్లో (Sports) అప్పడప్పుడు జెండర్ వివాదాలు చూస్తూనే ఉంటాం… మహిళల విభాగంలో పోటీపడుతున్నా కొందరికి హార్మోన్ల లోపాలతో ఎక్స్ వై క్రోమోజోమ్స్ (Chromosomes), టెస్టోస్టిరాన్స్ (Testosterones) పురుషుల స్థాయిలో ఉండడంతో వారిపై సందేహాలు వస్తుంటాయి. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే అల్జీరియా బాక్సర్ ఇమానె ఖెలీఫ్ కు వచ్చింది. పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics) మహిళల బాక్సింగ్ (Women’s Boxing) 66 కేజీల విభాగంలో బౌట్ సందర్భంగా ఇమానె ప్రత్యర్థి ఏంజెలా కెరాని తప్పుకోవడంతో వివాదం మొదలైంది. ఇమానె ఇచ్చిన పంచ్ తో ఏంజెలా ముక్కు పగిలిపోగా.. అసలు అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య నిషేధం విధించిన బాక్సర్ ను పోటీలకు ఎలా అనుమతించారంటూ ప్రశ్నలు మొదలయ్యాయి. ఆమెలో ఎక్స్ వై క్రోమోజోమ్స్, టెస్టోస్టిరాన్స్ పురుషుల స్థాయిలో ఉన్నాయని డీఎన్ఏ పరీక్షల్లో (DNA tests) తేలింది.
ఈ కారణంగానే బాక్సింగ్ సమాఖ్యపై ఆమెను పోటీల నుంచి బ్యాన్ చేసింది. అయితే విశ్వ క్రీడలకు వచ్చేసరికి కొన్ని నిబంధనల్లో సడలింపులు ఉంటాయి. నిబంధనలకు అనుగుణంగానే ఇమానేకు మహిళల బాక్సింగ్ లోనే పోటీపడేందుకు అనుమతినిచ్చామని ఇప్పటికే ఒలింపిక్ సమాఖ్య స్పష్టం చేసింది. అయినప్పటకి నెట్టింట చర్చ మాత్రం ఆగడం లేదు. పలువురు ప్రముఖులు సైతం ఈ జెండర్ వివాదంపై స్పందించారు. కొందరు ఇమానేకు మద్ధతుగా నిలిస్తే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. అమ్మాయిల బాక్సింగ్ లో పురుష లక్షణాలున్న వారిని ఎలా ఆడిస్తారని ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk) ప్రశ్నించారు. ఇటలీ ప్రధాని, అమెరికా మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ (Trump) వంటి వారు సైతం ఇమానేకు అనుమతివ్వడాన్ని తప్పుపట్టారు. తాజా వివాదం నేపథ్యంలో తర్వాత మ్యాచ్ లకు ఇమానేను ఆడిస్తారా.. లేక తనని తప్పిస్తారా అనేది చూడాలి. మరి ఏంజెలా తరహాలోనే అందరూ తప్పుకుంటే ఖెలీఫాకు గోల్డ్ మెడల్ (Gold Medal) ప్రకటిస్తారా అనే దానిపైనా చర్చ జరుగుతోంది. అయితే ఐవోసీతో పాటు పలువురు బాక్సర్లు ఇమానేకు మద్ధతుగా నిలుస్తున్నారు.