Dubai Heavy Floods : పెట్రోల్ బావులు తప్ప.. నీటి బావులు లేని దేశంలో ఇంతటి వరదలా.. ప్రకృతి శాపమా..? కృత్రిమ వర్షమా..?

ఏప్రిల్ 15వ తేదీ సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షాలతో (Heavy Floods) దుబాయ్ లోని చాలా ప్రాంతాలు జలమయంగా మారాయి. వర్షాలు, వరదలతో ఇప్పటికే 18 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అందరూ గొప్పగా చెప్పుకునే దుబాయ్ ఇప్పుడు చిగురుటాకులా వణికిపోతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 21, 2024 | 01:00 PMLast Updated on: Apr 21, 2024 | 1:00 PM

Is This Flood In A Country That Has No Water Wells Except Petrol Wells Artificial Rain

 

దుబాయ్ (Dubai).. ఇసుక దిబ్బల దేశం.. కొన్ని సంవత్సరాలకు ముందు వరకు.. అసలు ఇక్కడ మనుషులు జీవిస్తారా.. అన్నే ప్రశ వచ్చేది. ఇప్పుడు దుబాయ్ అంటే స్వర్గం అని అంటారు. అరచేతిలో వేళ్ళ మధ్యలో నుంచి జారిపోయే.. ఇసుక నుంచి.. ఆకాశాన్ని అందే బుర్జ్ ఖలీఫా (Burj Khalifa) వంటి భారీ భవంతులు వరకు అన్ని అద్భుతాలే.. దుబాయ్ అంత టెక్నలజే.. అక్కడ వర్షం పడటం ఓ వింత గా చెప్పుకుంటారు. అలాంటి దుబాయ్ లో ఇప్పుడు ఏకంగా వరదలతో మునిగిపోయింది.

ఏప్రిల్ 15వ తేదీ సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షాలతో (Heavy Floods) దుబాయ్ లోని చాలా ప్రాంతాలు జలమయంగా మారాయి. వర్షాలు, వరదలతో ఇప్పటికే 18 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అందరూ గొప్పగా చెప్పుకునే దుబాయ్ ఇప్పుడు చిగురుటాకులా వణికిపోతోంది. రెండ్రోజుల నుంచి తుఫాను కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో దుబాయ్ అతలాకుతలం అవుతోంది. ఆస్తి నష్టంతో పాటు ప్రాణనష్టం కూడా భారీగానే సంభవించేది.

  • చిగురుటాకులా వణుకుతున్న దుబాయ్…

వదలకుండా కురుస్తున్న భారీ వర్షాలకు దుబాయ్ నగరంలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. దుబాయ్ మాల్, మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్ వంటి ఫ్లాగ్‌షిప్ షాపింగ్ సెంటర్‌లతో సహా నగరంలోని కీలకమైన ప్రాంతాలు వరదలతో నిండిపోయాయి. దుబాయ్ మెట్రో స్టేషన్‌లో పాదాల లోతు నీరు నిలిచింది. కనుచూపు మేర నీరు 10 అడుగుల మేర నీరు నిలిచిపోవడం తో వాహనాలు ముందుకు సాగలేక నీళ్లలోనే చిక్కుకుపోయాయి. కార్లు, బస్సులు, ప్రైవేటు వాహనాలు కాగితపు పడవల్లా నీళ్లలో తేలుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయ సిబ్బంది భారీ వర్షాల కారణంగా విమానాలను దారి మళ్లించారు. దీంతో 100కుపైగా విమానాల రాకపోకలు బంద్ అయ్యాయి.

  • 75 ఏళ్ల చరిత్రలో… ఇదే ఫస్ట్ టైం..?

దుబాయ్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, జలప్రళయం గతంలో 75 ఏళ్లలో ఎప్పుడూ చూడలేదని అక్కడి జనం చెబుతున్నారు. సోషల్ మీడియా వేదికల్లో తమ దీన పరిస్థితి చూపించే విధంగా వర్షాలు, వరదల వీడియోలను షేర్ చేస్తున్నారు. దుబాయ్ వరదల దృశ్యాలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

  • దుబాయ్ కు భారీ వరదలు ముందే తెలుసా..?

Is this flood in a country that has no water wells except petrol wells? Artificial rain?

గత సంవత్సరం COP28 UN వాతావరణ సమావేశానికి హాజరైనవారు యూఏఈని ప్రకృతి వైపరీత్యాలు వెంటాడతాయని హెచ్చరించారు. నిజానికి సహజంగా కురవని దేశంలో.. ఇప్పుడు పడ్డ వర్షాలు నిజంగా సహజంగానే కురిసిన వానా.. లేక కృత్రిమ వర్షాలు అని చేప్పబడే.. క్లౌడ్ సీడింగ్ చేశారా.. ప్రశ్న ప్రపంచ దేశల నుంచి వినిపిస్తుంది.

  • కృత్రిమ వర్షం అంటే ఏమిటి?

Is this flood in a country that has no water wells except petrol wells? Artificial rain?

  • కృత్రిమ వర్షాలను (artificial rain) క్లౌడ్ సీడింగ్ (Cloud seeding) అంటారు.
  • గాలిలోనున్న మేఘాలనుంచి వర్షాలను కురిపించడాన్నే క్లౌడ్ సీడింగ్ అంటారు.
  • సాధారణంగా సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్, డ్రైఐస్ (ఘన కార్బన్ యాక్సైడ్) వంటి రసాయనాలను కృత్రిమ వర్షం కోసం వినియోగిస్తుంటారు.
  • ఇవి అదనపు మంచు కేంద్రకాలుగా పనిచేస్తాయి. మేఘాల్లో అంటుకోని అతి చల్లటి నీటి ఆవిరిని తమ చుట్టూ  చేరుకునేలా తోడ్పడుతాయి.
  • నీటి ఆవిరితో కూడిన బిందువులు దట్టంగా గూడుకట్టేలా చేస్తాయి.
  • బిందువులు పెద్దగా అయ్యేంత వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది.
  • అవి మరీ పెద్దగా అయ్యి, చివరికి వాన చినుకుల్లా కురుస్తాయి.
  • సిల్వర్ అయోడైడ్ అచ్చం మంచు స్పటికాల్లా ఉంటుంది.
  • అందువల్ల మరింత సమర్థంగా పనిచేస్తుంది. వేడి వాతావరణాల్లో క్యాల్షియం క్లోరైడ్ ఎక్కువగా వాడుతుంటారు.
  • మామూలు ఉప్పు(సోడియం క్లోరైడ్)తోనూ శాస్త్రవేత్తలు కృత్రిమ వర్షం కురిపించటానికి పరిశోధనలు చేస్తుంటారు.
  • కృత్రిమ వర్షానికి అనువైన వాతావరణం అవసరం. ఆకాశంలో తేమతో కూడిన మబ్బులు ఉండాలి, మేఘాలు కనీసం పెద్ద పర్వతాలంత ఎత్తులో ఉండాలి.
  • గాలి వీచే వేగం కూడా మరీ ఎక్కువగా ఉండకూడదు.
  • అప్పుడే లవణాల చుట్టూ నీటి ఆవిరి చేరి, వర్షం కురవటానికి వీలవుతుంది.
  • ప్రయోజనాలు: అవసరమైన చోట వర్షం కురిసేలా చేయటం వల్ల కరవు, క్షామం నివారించుకోవచ్చు.
  • తుపాన్లు వచ్చినప్పుడు మరింత నష్టం కలగకుండా నీటి ఆవిరిని నియంత్రించొచ్చు.

నష్టాలు:

  • కృత్రిమ వర్షంలో ఉపయోగించే రసాయనాలు పర్యావరణానికి హానికరం.
  •  కృత్రిమ వర్షం కారణంగా వాతావరణ నమూనాలు మారవచ్చు.
  • కృత్రిమ వర్షం కురవటానికి రసాయనాలు వాడటం వల్ల పర్యావరణానికి ముఖ్యంగా చెట్లు, జంతువులకు హాని కలగొచ్చు.
  • కృత్రిమ వర్షంలకు చాలా ఎక్కువగా ఖర్చవుతుంది. 

SSM