Israel: లక్ష మంది భారతీయులకు ఉద్యోగాలు.. రమ్మని ఆహ్వానం పలికిన ఇజ్రాయెల్..
ఇజ్రాయెల్‌లో భారతీయులకు ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి అంటే.. అక్కడ భవనాలు, ప్రాజెక్టుల నిర్మాణాలకు సంబంధించిన పనివాళ్ళ అవసరం ఎక్కువగా ఉంటుంది. చైనాతో పాటు ఇండియన్ వర్కర్లకు ఆ దేశం ప్రాధాన్యం ఇస్తోంది.
Israel: అర్జెంట్‌గా ఇండియా నుంచి లక్ష మంది ఉద్యోగులు కావాలి.. వెంటనే మా దేశానికి పంపండి.. అనూహ్యంగా ఈ భారీ ఆఫర్ ఇచ్చింది ఏ కంట్రీయో తెలుసా.. ఇజ్రాయెల్ (Israel). గత జూన్‌లో ఇజ్రాయెల్, ఇండియా (India) మధ్య ఓ ఒప్పందం జరిగింది. 42 వేల మంది భారతీయులను తమ దేశంలో పనిచేయడానికి అనుమతిస్తామని ఈ అగ్రిమెంట్ సారాంశం. అయితే 42 వేలు కాదు.. ఇప్పుడు లక్ష మంది భారతీయులకు ఛాన్స్ ఇస్తాం.. పనిచేయడానికి రమ్మని పిలుస్తోంది ఇజ్రాయెల్. ఎందుకు ఇంత అత్యవసరంగా లక్ష మంది వర్కర్లు కావాలి..? పైగా పాలస్తీనా (palestine)తో యుద్ధం జరుగుతున్న టైమ్‌లో..? ఈ జాబ్ రిక్రూట్‌మెంట్ ఏంటి అనుకుంటున్నారా..?
TELANGANA ASSEMBLY ELECTIONS: నామినేషన్లకు మూడు రోజులే.. టిక్కెట్లు ఇవ్వండి బాబో..!
ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాదులు అక్టోబర్ 7న ఉన్నట్టుండి వేల సంఖ్యలో రాకెట్లతో దాడులు జరిపారు. షాక్ నుంచి తేరుకోడానికి కాస్త టైమ్ పట్టినా.. తర్వాత ఇజ్రాయెల్ మాత్రం అందుకు ప్రతీకారం తీర్చుకుంటోంది. తమ దేశస్థులను ఊచకోత కోయడంపై తీవ్ర ఆగ్రహంగా ఉంది. హమాస్ ఉగ్రవాదులు తిష్టవేసిన గాజాపై మొదట రాకెట్, వైమానిక దాడులు చేసిన ఆ దేశం.. ఇప్పుడు గ్రౌండ్ లెవల్‌కి వెళ్ళి ఎటాక్స్ చేస్తోంది. ఈ యుద్దం ఇంకా ఎన్నాళ్ళు ఇలా కంటిన్యూ అవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. అసలు ఇజ్రాయెల్‌లో భారతీయులకు ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి అంటే.. అక్కడ భవనాలు, ప్రాజెక్టుల నిర్మాణాలకు సంబంధించిన పనివాళ్ళ అవసరం ఎక్కువగా ఉంటుంది. చైనాతో పాటు ఇండియన్ వర్కర్లకు ఆ దేశం ప్రాధాన్యం ఇస్తోంది. గత జూన్‌లో ఇజ్రాయెల్ ప్రభుత్వ బృందం స్వయంగా చైనాలో ఇంటర్వ్యూలు నిర్వహించి 5 వేల మందిని రిక్రూట్ చేసుకుంది. అయితే ఇప్పుడు ఎక్కువగా భారతీయులకు ప్రాధాన్యం ఇస్తోంది ఈ యూదు దేశం.
CPM-CONGRESS: సీపీఎం పోటీతో కాంగ్రెస్‌కే నష్టం.. ఓట్ల చీలికతో బీఆర్ఎస్‌కు లాభం..
ఇండియన్స్‌ని నిర్మాణ రంగంతో పాటు నర్సింగ్ సెక్టార్‌లో నియమించుకుంటోంది. యుద్ధం పీక్ స్టేజ్‌లో ఉన్న ఈ టైమ్‌లో అర్జెంట్‌గా ఉద్యోగులను ఇజ్రాయెల్ నియమించుకోవడం వెనుక కారణం ఉంది. ప్రస్తుతం వర్క్ పర్మిట్ కింద 90 వేల మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ దేశంలో పనిచేస్తున్నారు. యుద్ధం మొదలయ్యాక.. పాలస్తీనా వర్క్ పర్మిట్లను ఇజ్రాయెల్ రద్దు చేసింది. వీళ్లలో ఎక్కువ మంది నిర్మాణ రంగంలో పనిచేస్తున్న వారే. వీళ్ళ స్థానంలో భారతీయులకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు అక్కడి అధికారులు. ప్రస్తుతం యుద్ధం జరుగుతున్న టైమ్‌లో.. ఇజ్రాయెల్‌కు వెళ్ళడానికి ఎంతమంది ఇండియన్ లేబర్స్ ముందుకు వస్తారన్నది అనుమానంగానే ఉంది. హమాస్ ఉగ్రవాదులు గానీ, వారికి సహకరిస్తున్న ఇరుగు పొరుగు దేశాలు గానీ మళ్లీ దాడులు చేయవన్న గ్యారంటీ అయితే లేదు. పైగా ఇజ్రాయెల్‌లో కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పెరిగిపోయిందని చెబుతున్నారు.
యుద్ధం నేపథ్యంలో ఇప్పటికే ఆపరేషన్ అజయ్ ద్వారా చాలామంది భారతీయులను ఇండియాకు తీసుకొచ్చింది మోడీ ప్రభుత్వం. మళ్ళీ భారతీయ కార్మికులు అక్కడికి వెళ్ళడంపై మాత్రం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయెల్ లక్ష ఉద్యోగాలకు ఆఫర్ అయితే ఇచ్చింది కానీ.. ఎంత మంది ఇండియన్స్ అక్కడికి వెళ్తారన్నది చూడాలి.