రెబల్ స్టార్ తో లేడీ పవర్ స్టార్.. మాడ్రన్ శోభన్ బాబు..

రెబల్ స్టార్ ప్రభాస్ ఫౌజీ తో సైనికుడిగా మారాడు. ది రాజా సాబ్ లో ఆత్మగా భయపెడుతూ, నవ్వించబోతున్నాడు. స్పిరిట్ లో పోలీస్ ఆఫీసర్ గా లాఠీ ఛార్జ్ కి రెడీ అయ్యాడు. మూడింట్లో ఎన్నడూ వేయని పాత్రలే.. కా

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 3, 2025 | 06:00 PMLast Updated on: Feb 03, 2025 | 6:00 PM

Lady Power Star With Rebel Star Modern Shobhan Babu

రెబల్ స్టార్ ప్రభాస్ ఫౌజీ తో సైనికుడిగా మారాడు. ది రాజా సాబ్ లో ఆత్మగా భయపెడుతూ, నవ్వించబోతున్నాడు. స్పిరిట్ లో పోలీస్ ఆఫీసర్ గా లాఠీ ఛార్జ్ కి రెడీ అయ్యాడు. మూడింట్లో ఎన్నడూ వేయని పాత్రలే.. కాని అన్నీంట్లో ఒక కామన్ పాయింట్ ఉంది… సడన్ గా టాలీవుడ్ కి రెబల్ స్టార్ శోభన్ బాబు కి మాడ్రన్ వర్షన్ గా తయారయ్యాడనే మాట వినిపిస్తోంది. తన ప్రతీ మూవీలో ఒక హీరోయిన్ అన్న మాటే ఔట్ డేట్ అవుతోంది. తనేం చేసినా, చేస్తున్నా.. చేయబోతున్నా అన్నీంట్లో కనీసం ఇద్దరు, లేదంటే ముగ్గురు హీరోయిన్లు ఉండి తీరుతున్నారు. కొత్తగా ఫౌజీ మూవీలో ఇమాన్వీ కాకుండా, లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి వచ్చి చేరింది. ఆఫీషియల్ గా ఎనౌన్స్ మెంట్ రాకున్నా, స్టోరీ డిస్కర్షన్ పూర్తయ్యాకే వార్త బయటికొచ్చింది. మొత్తానికి ఈ పాన్ ఇండియా కింగ్ కి ఒక్క క్వీన్ సరిపోదా? ఇది సెంటిమెంటా? స్క్రిప్ట్ డిమాండ్ చేయటం వల్ల తప్పని ట్రీట్మెంటా..? టేకేలుక్

రెబల్ స్టార్ ప్రభాస్ ఫౌజీ లో కవ్వించే లేడీ ఇమాన్వీ మాత్రమే కాదని తేలింది. మొన్నటి వరకు ఇది గాసిప్పే కాని, ఇప్పుడు ఆల్ మోస్ట్ కన్ఫామ్. దీంతో ఇప్పుడు సీతారామం లానే హీరో కి ఒకరుజోడీగా, మరొకర్ని మరోపాత్రకి పరిమితం చేస్తారా అన్న డౌట్లు పెరిగాయి. అయితే ఇమాన్వీ కాకుండు ఇప్పుడు రెబల్ స్టార్ సరసన మెరవబోతోంది లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి.

తనకి హాను రాఘవపూడీ స్వయంగా వెళ్లి కథ చెప్పాకే, ఇది కన్ఫామ్ అయ్యింది. కాకపోతే ఎవరి పాత్ర ఏంటతో తేలట్లేదు.. ఇందులో ఫ్లాష్ బ్యాక్ హీరోయిన్ గా సాయిపల్లవిని తీసుకుంటున్నారట. తన పాత్ర, సినిమా టోటల్ కథని నెరేట్ చేయటంతో, ఈ లేడీ పవర్ స్టార్ ఫౌైజీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలుస్తోంది. ఇదే కాదు ప్రభాస్ కమిటైన ప్రతీ మూవీలో తన జోడీగా ఒకరు కాదు, కనీసం ఇద్దరు ఉంటున్నారు

ది రాజా సాబ్ లో అయితే ఏకంగా ముగ్గురు హీరోయిన్లతో జోడీకట్టాడు రెబల్ స్టార్. ఇక ఫౌజీలో ఫ్లాష్ బ్యాక్ లో ఒక హీరోయిన్, తర్వాత మరో హీరోయిన్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు ప్రభాస్. ఇలా ప్రేమ ఖైదీగా పీరియాడికల్ డ్రామా చేస్తున్నతను, స్పిరిట్ లో కూడా ఇద్దరు భామల కౌగిలిలో మునిగిపోతున్నాడు. ఓరకంగా ఈ తరానికి తను మాడ్రన్ శోభన్ బాబుగా మారే పనిలో ఉన్నట్టున్నాడు

ఒకప్పుడు శోభన్ బాబు సినిమాలంటే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు స్టైల్లో, తెరమీద కనీసం ఇద్దరు హీరోయిన్లు మెరవాల్సిందే. ఆతర్వాత అలా మరే హీరో ఇద్దరు హీరోయిన్ల కాన్సెప్ట్ ని కంటిన్యూయస్ గా ఫాలో కాలేదు.. కాని రెబల్ స్టార్ ది శోభన్ బాబులా క్లాస్ కటౌట్ కాదు. ప్యూర్ మాస్ కటౌట్… కాబట్టి తనతో జోడీగా ఇద్దరు, లేదంటే ముగ్గురు హీరోయిన్లు కథానుసారమే తప్ప, కండీషన్ మాత్రం కాదు

కాకపోతే వరుసగా తను కమిటైన, లేదంటే చేస్తున్న సినిమాల్లో ఇద్దరు, లేదంటే ముగ్గురు హీరోయిన్లు కామన్ గా కనిపిస్తున్నారు. ఆఖరికి కల్కీ ఇద్దరిని చూపించారు. సలార్ లో శ్రుతి హాసన్ కాకుండా మరో హీరోయిన్ ఉందంన్నారు. అంటే కనీసం వరుసగా 5 సినిమాల్లో తనకి జోడీగా సింగిల్ హీరోయిన్ సరిపోదని తేలింది. డబుల్ డోస్ తప్పట్లేదని అర్ధమౌతోంది. కాబట్టే రెబల్ శోభన్ బాబు అన్న కామెంట్స్, కాంప్లిమెంట్స్ గా వినిపిస్తున్నాయి.