China NH Highway collapsed : చైనాలో కుంగిన జాతీయ రోడ్డు.. 19మంది మృతి

భారత్ పొరుగు దేశం అయిన చైనాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చైనాలోని ఓ జాతీయ రహదారి ఒక్కసారిగా క్షణాల వ్యవధిలో కుంగిపోయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 1, 2024 | 02:30 PMLast Updated on: May 01, 2024 | 2:30 PM

National Highway Collapsed In China 19 People Died

భారత్ పొరుగు దేశం అయిన చైనాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చైనాలోని ఓ జాతీయ రహదారి క్షణాల వ్యవధిలో కుంగిపోయింది.

ఇక విషయంలోకి వెళితే..
దక్షిణ చైనా (South China) లో బుధవారం తెల్లవారుజామున గ్వాంగ్జాం రాష్ట్రాంలోని సమీపంలో ఓ జాతీయ హైవే (National Highway) (గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ లోని మీజౌ, డాబు కౌంటీ ల హైవే) రోడ్డులో కొంత భాగం కుప్పకూలింది. ఒక్క సారిగా హైవే పై ప్రయాణిస్తున్న 18 వాహనాలు గోతిలో పడిపోయాయి. అందులో ప్రయణిస్తున్న 49 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో 19 మంది మృతి చెందారు. క్షతగాత్రులను 500 మంది అధికారుల సిబ్బందితో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. మిగిలిన వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అయితే రహదారి కుంగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

కాగా సౌత్ చైనాలో ఇటీవల భారీ వర్షాలకు.. వరదలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.. కాగా భారీ వర్షాలతో హైవే దారిలో నేలలో నీరు దిగువకు ఇంకి పోవడం వల్లే.. పైన ఉన్న జాతీయ హైవే కుంగుటకు కారణమని వాతావరణ శాఖ నిపుణులు ఆరా తీస్తున్నట్లు చైనా మీడియా వెల్లడించింది. కాగా ఈ ప్రమాద దృశ్యలన్ని అక్కడి CCTV లో రికార్డయింది.

SSM