మరోసారి నిజమైన బాబా వంగా జోస్యం మయన్మార్, థాయ్‌లాండ్‌లో ప్రకృతి విలయం
బాబా వంగా...బల్గేరియాకు చెందిన కాలజ్ఞాని. ఆయన కాలం చెంది 29 ఏళ్లు పూర్తయ్యాయి. అయినప్పటికీ ఆయన నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిలా...ఆయన చెప్పిన కాలజ్ఞానం నిజమవుతూనే ఉంది.

బాబా వంగా…బల్గేరియాకు చెందిన కాలజ్ఞాని. ఆయన కాలం చెంది 29 ఏళ్లు పూర్తయ్యాయి. అయినప్పటికీ ఆయన నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిలా…ఆయన చెప్పిన కాలజ్ఞానం నిజమవుతూనే ఉంది. ఒకటి కాదు రెండు….ఎన్నో బాబా వంగా చెప్పినవీ చెప్పినట్లే జరుగుతున్నాయి.
బాబా వంగా.. గత కొన్ని రోజులుగా ఈ పేరు మారుమోగిపోతోంది. ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి విపత్తు సంభవించినా…ఈ కాలజ్ఞాని పేరే చర్చనీయాంశంగా మారుతోంది. బాబా వంగా భవిష్యత్తు గురించి చెప్పిన పలు జోస్యాలు నిజమయ్యాయి. 2025 లో జరగబోయే ప్రకృతి విలయాలు, అనర్థాల గురించి దశాబ్దాల క్రితమే అంచనా వేశారు. 2025 నాటికి వాతావరణంలో పెనుమార్పులు చోటు చేసుకుంటాయని…అధిక సంఖ్యలో ప్రకృతి విపత్తులు చోటు చేసుకుంటాయని బాబా వంగా జోస్యం చెప్పారు. శీతోష్ణస్థితిలో భారీ మార్పులు ఉండవచ్చని, మన భూమి కక్ష్యలో మార్పు వస్తుందని అంచనా వేశారు. ఇది పెద్ద విపత్తులకు దారితీస్తుందని బాబా వంగా జోస్యం చెప్పారు.
బాబా వంగా చెప్పినట్లే మయన్మార్, థాయ్‌లాండ్‌ను భూకంపాలు వణికించాయి. మయన్మార్, థాయ్‌లాండ్…భారీ భూకంపం ధాటికి విలవిల్లాడుతున్నాయి. నిమిషాల వ్యవధిలో సంభవించిన వరుస భూకంపాల తీవ్రతతో మయన్మార్‌లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ రెండు దేశాల్లో మృతుల సంఖ్య ఇప్పటివరకు 2వందలు దాటేసింది. ఒక్క మయన్మార్‌లోనే 2వందల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. థాయ్‌లాండ్‌లో దాదాపు పది మంది మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. మయన్మార్, థాయ్‌లాండ్‌లలో వందలాది మంది గాయపడటంతో మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది. కూలిన ఎత్తైన భవనాల కింద చిక్కుకొని హాహాకారాలు చేస్తున్నవారిని రక్షించేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో నిర్మాణంలో ఉన్న ఎత్తైన భవనం పేకమేడలా కుప్పకూలిన ఘటనలో ముగ్గురు మృతిచెందగా 90మంది గల్లంతయ్యారు.
మయన్మార్‌లో 12 నిమిషాల వ్యవధిలో సంభవించిన రెండు భారీ భూకంపాలు అపార నష్టం కలిగించాయి. రాజధాని నెపిడాతోపాటు మరికొన్ని నగరాల్లో కనుచూపు మేరలో ఎక్కడచూసినా కూలిన భవనాలు, బీటలు వారిన రోడ్లే కనిపిస్తున్నాయి. ఎటు చూసినా భయానక పరిస్థితులు నెలకొన్నాయి. రిక్టర్ స్కేల్‌పై మొదటి భూకంపం తీవ్రత 7.7గా, రెండో భూకంపం తీవ్రత 6.4గా నమోదైంది. ఆ తర్వాత మరో నాలుగు ప్రకంపనలు వచ్చాయి. అటు థాయ్‌ల్యాండ్‌లో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటిగంటా ముప్పై నిమిషాలకు భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.7గా నమోదైంది. బ్యాంకాక్లోనూ నష్టం భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది.
బాబా వంగా…1911లో బల్గేరియాలో పాండేవా దిమిత్రోవాగా జన్మించాడు. 12 ఏళ్ల వయసులో పెద్ద తుఫాను రావడంతో… కంటిచూపు కోల్పోయాడు. పెళ్లి చేసుకుని చాలా కాలం కనిపించకుండా పోయాడు. తన మరణం సహా అతడు చెప్పినవి వివిధ సమయాల్లో నిజమని రుజువైంది. అతను 1996 లో మరణించాడు. 9/11 ఉగ్రవాద దాడులు, యువరాణి డయానా మరణం, చోర్నోబిల్ విపత్తు, బ్రెక్సిట్ వంటి ప్రధాన ప్రపంచ సంఘటనలను ముందే చెప్పారు. ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న రష్యా దండయాత్ర పూర్తి మారిపోతుందని…రెండు దేశాల మధ్య కొత్త వివాదం తలెత్తుతుందని ఆమె జోస్యం చెప్పారు.