Top Story: బ్రిటన్‌లో పాకిస్తాన్ రేపిస్టుల అరాచకాలు, పాక్‌పై యుద్ధం ప్రకటించిన ఎలాన్ మస్క్

పురాణాల్లో రాక్షసులు ఎలా ఉంటారో పుస్తకాలు చదివితే ఐడియా వస్తుంది. సినిమాలు చూసినా క్లారిటీ వస్తుంది. కానీ, మనలా, మనతోపాటే తిరిగే రాక్షసులను ఎలా గుర్తుపట్టాలి? దశాబ్దాలుగా బ్రిటన్ ఇలాంటి రాక్షసులతోనే బిక్కుబిక్కుమంటోంది. మనలో ఒక్కరిగానే ఉంటారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 6, 2025 | 09:55 PMLast Updated on: Jan 06, 2025 | 9:55 PM

Pakistani Rapists Anarchy In Britain Elon Musk Declares War On Pakistan

పురాణాల్లో రాక్షసులు ఎలా ఉంటారో పుస్తకాలు చదివితే ఐడియా వస్తుంది. సినిమాలు చూసినా క్లారిటీ వస్తుంది. కానీ, మనలా, మనతోపాటే తిరిగే రాక్షసులను ఎలా గుర్తుపట్టాలి? దశాబ్దాలుగా బ్రిటన్ ఇలాంటి రాక్షసులతోనే బిక్కుబిక్కుమంటోంది. మనలో ఒక్కరిగానే ఉంటారు. మన చుట్టే, మనతోనే నడుస్తారు. ఒంటరిగా టీనేజ్ అమ్మాయి కనిపిస్తే మాత్రం వాళ్లలోని రాక్షసుడు బయటకొస్తాడు. డ్రగ్స్ అలవాటు చేస్తారు.. వేధింపులకు దిగుతారు. వందేళ్ల భవిష్యత్‌ను ఒక్కరోజులోనే నాశనం చేసేస్తారు. వీళ్లంతా సింగిల్‌గా కనిపించే నటోరియస్ గ్యాంగ్స్. ఉగ్ర దేశం పాకిస్తాన్ నుంచి బ్రిటన్‌కు వలస వెళ్లిన నరరూప రాక్షసులే వీళ్లంతా. ఇప్పుడు వీళ్ల ఆగడాలు మితిమీరిపోయాయి. దీంతో అపరకుబేరుడు మస్క్ సైతం పాకిస్తానీ గ్రూమింగ్ గ్యాంగులపై శివాలెత్తిపోతున్నారు. వారిని కంట్రోల్ చేయలేకపోతే ప్రభుత్వాన్నే దిగిపొమ్మన్ని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకూ, యూకేలో అసలేం జరుగుతోంది? దశాబ్దాల క్రితం పొట్టచేతపట్టుకుని యూకే వెళ్లిన పాకిస్తానీలు నరరూప రాక్షసులుగా ఎలా మారారు? టాప్ స్టోరీలో చూద్దాం..

గ్రూమింగ్ గ్యాంగ్స్.. ఈ పేరు మనకు కొత్తయినా బ్రిటన్‌కు కొత్త కాదు. పైగా ఈ గ్యాంగ్స్ పేరువింటే యూకేలోని తల్లిదండ్రులు చిగురుటాకులా వణికిపోతారు. ఇంట్లో టీనేజీ అమ్మాయిలున్న ఏ పేరెంట్స్‌కూ కంటిమీద కునుకుండదంటే ఈ డర్టీ గ్యాంగులు ఎంత క్రూరమైనవో అర్ధం చేసుకోవచ్చు. టీనేజ్ పిల్లలు, యుక్త వయసువారితో తెలిసిన వాళ్లు లేదా తెలియని వాళ్లు వ్యక్తిగత సంబంధాలు కలిగి ఉండటం, వారి భావోద్వేగాలను వాడుకుంటూ ఇతర అవసరాలకు వినియోగించుకోవడం, లైంగిక అవసరాలకు వాడుకోవ డం, వేధింపులకు పాల్పడటాన్ని గ్రూమింగ్ అంటారు. ఈ తరహా క్రిమినల్ గుంపులనే గ్రూమింగ్ గ్యాంగ్స్‌ గా పేర్కొంటారు. బ్రిటన్‌లో కొన్ని దశాబ్దాలుగా ఈ డర్టీ గ్యాంగ్స్ అరాచకాలు సాగిస్తున్నాయి. ఏ టీనేజ్ అమ్మాయి అయినా ఈ గ్యాంగ్ వలలో పడిందంటే దాదాపుగా ఆమె జీవితం నాశనమైనట్లే. అంతగా వారి జీవితాల్ని ఈ గ్యాంగ్స్ మార్చేస్తాయి.

గ్రూమింగ్ గ్యాంగ్స్ ఆడ పిల్లల్ని తమ లైంగిక అవసరాల కోసం వాడుకుంటాయి. డ్రగ్స్, చెడు వ్యసనాలకు బానిసలను చేస్తాయి. ఆడపిల్లల్ని అక్రమ రవాణా చేసేందుకు కూడా ఏమాత్రం వెనుకాడవు. టీనేజ్ అమ్మాయిలను నిత్యం మత్తులోనే ఉంచుతూ తమ దగ్గరున్నవాళ్లను వేరే గ్యాంగ్‌లకు అప్పగించే స్తారు. దానికి బదులుగా డ్రగ్స్, లేదంటే డబ్బులు తీసుకుంటారు. ఈ డేంజర్ గ్యాంగులకు ఎదురు తిరిగే ధైర్యం చేసిన అమ్మాయిలను అంతం చేయడానికి కూడా వెనుకాడరు. వ్యక్తిగతంగా పరిచయాలు పెంచు కుంటారు. లేదంటే ఆన్‌లైన్‌ ద్వారా తమ వలలో పడేట్టు చేస్తారు. ఇప్పటికే కొన్నివేలమంది బాలికలు గ్రూమింగ్ గ్యాంగుల అరాచకాలకు బలైపోయుంటారనేది బహిరంగ రహస్యం. ఈ గ్యాంగ్స్ బారిన పడి చిత్రవధ అనుభవించిన టీనేజర్ల అంశంలో అధికారిక లెక్కలు చెప్పడం కష్టం. వాళ్లు బతికున్నారో లేదో కూడా తెలిసే ఛాన్స్ అసలే ఉండదు. అందుకే ఈ గ్యాంగ్స్ పేరు వింటేనే బ్రిటన్ వాసులు వణికిపోతారు. నరరూప రాక్షసుల ఉచ్చులో తమ కుమార్తెలు పడకూడదని దేవుడిని వేడుకుంటారు.

నిజానికి ఈ నటోరియస్ గ్యాంగ్స్‌లోని క్రిమినల్స్ అందరూ బ్రిటిషర్స్ కాదు. అత్యధికులు బ్రిటన్ పాకిస్తానీయులే. గతేడాది బ్రిటన్ అప్పటి హోంమంత్రి బ్రేవర్మనే ఈ నిజాన్ని బయటపెట్టారు. పాకిస్తానీలే ఎక్కువగా గ్రూమింగ్ గ్యాంగ్స్‌లో ఉన్నారని చెప్పారు. అప్పట్లో ఆమె వ్యాఖ్యలను పాకిస్తాన్ ఖండించింది. కొందరు వ్యక్తుల నేర ప్రవర్తనను మొత్తం సమాజానికి వర్తింపజేసి తప్పుగా ముద్రవేశారని ఆరోపించింది. నిజానికి.. బ్రేవర్మన్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేకపోలేదు. ఇప్పటికే అరెస్ట్ అయిన గ్రూమింగ్ గ్యాంగ్ సభ్యుల్లో మెజారిటీ వ్యక్తులు బ్రిటన్ పాకిస్తానీలే అని తేలింది. రాజకీయంగా ఉన్న లొసుగులను వాడుకుని పాకిస్తానీలే బ్రిటన్ టీనేజర్లను టార్గెట్ చేస్తున్నట్టు నివేదికలు తేల్చాయి. అదికూడా ఇప్పటి మాట కాదు. ఎన్నో ఏళ్ల ముందు నుంచే ఈ గ్యాంగ్స్‌లో పాకీస్తానీల ప్రమేయం ఉంది. కానీ, పాకిస్తాన్ మాత్రం తమదేశ పౌరులు అమాయకులు అంటూ బొంకుతోంది.

1997-2013 మధ్య రోథర్‌హామ్ స్కాండల్‌ను యూకే వాసులు కలలో కూడా మరచిపోరు. ఆ పదహారేళ్ల వ్యవధిలో రోథర్‌హామ్ ప్రాంతంలో బ్రిటీష్ బాలికలు తీవ్రమైన అత్యాచారాలకు, లైంగిక దోపిడికి గురయ్యారు. 1400 వరకు అమ్మాయిలు బాధితులుగా ఉన్నారని స్వతంత్ర విచారణలో వెల్లడైంది. బాధితులు తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చినప్పటికీ, యూకే సర్కార్ ఈ గ్యాంగులపై కఠిన చర్యలు తీసుకోలేదని ప్రధాన ఆరోపణ. ఈ దారుణాలు జరిగిన సమయంలో క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ అధిపతిగా ప్రస్తుత యూకే ప్రధాని స్టార్మర్ ఉన్నారు. ఇప్పుడు ఆయన ప్రధానిగా ఉండికూడా రేపిస్టుల ఆట కట్టించడంలో విఫలమవుతుండటంపై బ్రిటన్ వాసులతో పాటు ఎలాన్ మస్క్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంటును రద్దుచేసి ఎన్నికల నిర్వహణకు ఆదేశించాలని ఏకంగా బ్రిటన్ రాజునే రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికైనా స్టార్మర్ సర్కార్ పాకిస్తానీ రాక్షసుల ఆట కట్టిస్తుందేమో చూడాలి.