China Shock to Pakistan: మేడిన్ చైనా అంతే.. పాపం.. పాకిస్థాన్‌లో పనిచేయని చైనా రాడార్లు..!

మేడిన్ చైనా రాడార్లతో పాకిస్తాన్ సైన్యం షాక్ తిన్నది. రెండు రోజుల క్రితం రాత్రి వేళల్లో పాకిస్తాన్ భూభాగంపై సర్జికల్ స్ట్రైక్ చేసింది ఇరాన్ సైన్యం. బలూచిస్తాన్‌లోని జైషే అల్ అదిల్ ఉగ్రవాద శిబిరాలపై మిస్సైల్స్, డ్రోన్స్‌తో ఇరాన్ బాంబుల వర్షం కురిపించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 18, 2024 | 04:21 PMLast Updated on: Jan 18, 2024 | 4:21 PM

Pakistans Chinese Radar Failed To Detect Iran Missiles And Drone

China Shock to Pakistan: తమకు ఎప్పుడూ చైనా అండగా ఉంటుంది.. పొరుగుదేశం ఎప్పుడైనా రెచ్చిపోతే వెన్నంటి ఉండి పోరాడుతుంది అని చైనాను చూసి పగటి కలలు కంటోంది పాకిస్తాన్. మేడిన్ చైనా రాడార్లను పెట్టుకొని సంతోషంతో మురిసిపోతోంది. కానీ మొన్న ఇరాన్ విసిరిన మిస్సైల్స్ జాడను ఈ చైనా రాడార్లు కనిపెట్టలేకపోయాయి. ఎంతైనా మేడిన్ చైనా కదా. మన దగ్గర ఏవైనా సరిగా పనిచేయని వస్తువు ఉందంటే వెంటనే వచ్చే ఒకే ఒక మాట.. అది మేడిన్ చైనా.. ఎందుకు పనిచేస్తుంది అని. అంటే నాసిరకం వస్తువులకు కేరాఫ్ చైనా అని మనందరికీ తెలుసు.

NANDAMURI BALAKRISHNA: ఇదీ అసలు సంగతి! బాలయ్య తిట్టింది ఎన్టీఆర్‌ను కాదట..

మరీ.. మిస్సైల్స్, డ్రోన్లను కనిపెట్టే రాడార్ల విషయంలోనూ చైనా ఇలాగే చేస్తుందని పాకిస్థాన్ ఊహించలేకపోయింది. మేడిన్ చైనా రాడార్లతో పాకిస్తాన్ సైన్యం షాక్ తిన్నది. రెండు రోజుల క్రితం రాత్రి వేళల్లో పాకిస్తాన్ భూభాగంపై సర్జికల్ స్ట్రైక్ చేసింది ఇరాన్ సైన్యం. బలూచిస్తాన్‌లోని జైషే అల్ అదిల్ ఉగ్రవాద శిబిరాలపై మిస్సైల్స్, డ్రోన్స్‌తో ఇరాన్ బాంబుల వర్షం కురిపించింది. కానీ పాకిస్తాన్‌లో ఉన్న చైనా తయారీ రాడార్స్ వాటిని ముందుగా పసిగట్టడంలో ఘోరంగా విఫలమయ్యాయి. దీంతో పాకిస్తాన్ ఇప్పుడు లబోదిబోమంటోంది. ఎందుకు పనిచేయలేదని చైనాను ప్రశ్నిస్తుంది. ఇటు భారత్ నుంచి భవిష్యత్తులో ఏదైనా ముప్పు వస్తుందేమోనని కూడా చైనాకు చెందిన రాడార్స్‌ను మన సరిహద్దుల్లో మొహరించింది పాకిస్తాన్. మరి వాటి పనితనం ఎలా ఉంటుందో ఏమో. తమ మిత్రుడు అనుకున్న చైనా.. ఇరాన్ దాడిని ఖండించకపోవడం పాకిస్తాన్‌కు మరింత ఇబ్బందిగా మారింది. రెండు దేశాలు సంయమనం పాటించాలని మాత్రమే డ్రాగన్ చెప్పింది. కానీ ఇరాన్ చర్యను ఎందుకు తప్పుబట్టలేదని పాక్ పాలకులు ఆగ్రహంగా ఉన్నారు. అయితే అమెరికాను ఎదురించి పోరాడుతున్న ఇరాన్‌కు చైనా సపోర్ట్ ఉంది. అందువల్ల పాకిస్తాన్ కోసం ఇరాన్‌తో గొడవ పెట్టుకునే పరిస్థితి డ్రాగన్‌కు లేదని అర్థమవుతోంది.
ఇరాన్‌పై పాకిస్తాన్ ప్రతీకార దాడులు
ఇరాన్ సర్జికల్ స్ట్రైక్స్‌కి పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంటోంది. పాక్ దేశానికి చెందిన ఎయిర్ ఫోర్స్ జరిపిన దాడుల్లో 9 మంది ఇరానియన్లు చనిపోయినట్టు తెలుస్తోంది. కిల్లర్ డ్రోన్స్, రాకెట్లు, ఇతర ఆయుధాలతో దాడులు చేసినట్టు పాక్ వర్గాలు చెబుతున్నాయి. ఇరాన్ బోర్డర్‌లో తలదాచుకున్న బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్, లిబరేషన్ ఆర్మీ దళాలను టార్గెట్‌గా చేసుకొని పాక్ ఈ ప్రతీకార దాడులకు పాల్పడింది. కానీ తమకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని BLF ప్రకటించింది. కానీ సరిహద్దుల్లో తలదాచుకుంటున్న విదేశీ పౌరులు చనిపోయారని ఇరాన్ వర్గాలు తెలిపాయి. తమ భూభాగంలో 3 నుంచి 4 కిలోమీటర్ల లోపల దాడులు జరిగాయనీ.. చిన్న చిన్న భవనాలు దెబ్బతిన్నాయని చెప్పింది. పాక్ ప్రతీకార దాడులపై ఇరాన్ ఆగ్రహంగా ఉంది.