Nepal Plane crash : నేపాల్ కుప్పకూలిన విమానం.. 19 మంది సజీవ దహనం..
భారత పొరుగు దేశం నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. నేపాల్‌లోని ఖాట్మండు సమీపంలో త్రిభువన్ విమానాశ్రయంలో విమాన కూప్పకులింది.

Plane crash in Nepal.. 19 people burnt alive..
భారత పొరుగు దేశం నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. నేపాల్‌లోని ఖాట్మండు సమీపంలో త్రిభువన్ విమానాశ్రయంలో విమాన కూప్పకులింది. విమానం టేకాఫ్ అవుతుండగా శౌర్య ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం స్కిడ్ అయి, ఫెన్నింగ్ ను ఢీ కొట్టింది. దీంతో కమర్షియల్ విమానంలో మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఫ్లైట్ పూర్తిగా మంటల్లో దగ్ధమైంది. దీంతో విమానంలో ఉన్న సిబ్బందితో సహా 19 మంది ప్రయాణికులు మరణించారు. పైలట్ 37 ఏళ్ల మనీశ్ షక్య ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కాగాఇక ఇప్పటి వరకూ 13 మంది మృతదేహాలను వెలికితీశారు. పైలట్‌కు తీవ్రగాయాలయని, ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.
Suresh SSM