Ramcharan-Sukumar : రామ్ చరణ్ తో సుకుమార్ … రికార్డ్స్ బద్దలే..!

గ్లోబల్ స్టార్ (Global Star) రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్నాడు. ఆర్ఆర్ఆర్ వంటి గ్లోబల్ హిట్ తరువాత చెర్రీ క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. దీంతో.. తన సినిమాలు కూడా అదే రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమా చేస్తున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 23, 2024 | 11:06 AMLast Updated on: Mar 23, 2024 | 11:06 AM

Ram Charan And Sukumar Breaking Records

గ్లోబల్ స్టార్ (Global Star) రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్నాడు. ఆర్ఆర్ఆర్ వంటి గ్లోబల్ హిట్ తరువాత చెర్రీ క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. దీంతో.. తన సినిమాలు కూడా అదే రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక గేమ్ ఛేంజర్ తరువాత దర్శకుడు బుచ్చిబాబు సనతో మరో పాన్ ఇండియా (Pan India) సినిమా చేసేందుకు సిద్దమయ్యాడు చెర్రీ.. ఈ సినిమాను కూడా భారీ లెవల్లో తెరకెక్కిస్తున్నారు మేకర్స్.. ఇక ఈ రెండు సినిమాల తరువాత మరోసారి క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ తో జతకట్టనున్నాడు రామ్ చరణ్. దీంతో.. ఈ రెండు సినిమాలను మించిన అంచనాలు ఆర్సీ17పై ఇప్పటి నుంచే ఏర్పడ్డాయి. లెక్కల మాస్టారి డైరెక్షన్‌లో చెర్రీ మరో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టడం ఖాయమంటూ మెగా ఫ్యాన్స్ ఇప్పటి నుంచే లెక్కలు మొదలు పెట్టేశారు.

ఇప్పటికే రామ్‌చరణ్-సుకుమార్ (Ramcharan-Sukumar) కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది ఈ సినిమా. రామ్ చరణ్ ది బెస్ట్ చిత్రాల్లో ఒకటిగా రంగ స్థలం నిలిచింంది. చిట్టి బాబు పాత్రలో చెవిటి వ్యక్తిగా చెర్రీ యాక్టింగ్ ఇరగదీసాడు. ఈ క్రమంలోనే లెక్కల మాస్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి జత కట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు కూడా త్వరలో ప్రకటించనున్నారని తెలుస్తోంది. మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ సినిమా ప్రకటన ఉండబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా గురించి చర్చలు జరిగాయని, నిర్మాణ సంస్థ కూడా ఫిక్స్ అయ్యిందంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. దీంతో.. మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్ఆనరు..

కాగా.. ఆర్ఆర్ఆర్ (RRR) రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి రామ్ చరణ్, సుకుమార్ సినిమా గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ ఇంట్రడక్షన్ చాలా హార్డ్ హిట్టింగ్ గా ఉంటుందంటూ ట్రిపుల్ ఆర్ ప్రమోషన్ టైమ్‌లో రాజమౌళి (Rajamouli) చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రీసెంట్‌గా రామ్ చరణ్ బుచ్చిబాబు కొత్త సినిమా మొదలైన నేపథ్యంలో.. రామ్ చరణ్, సుకుమార్ సినిమా గురించి ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మార్చ్ 27నే చరణ్ బర్త్ డే కానుకగా అఫీషియల్ అప్డేట్ రావచ్చని గట్టిగా వినిపిస్తున్న టాక్ తో ఈ క్రేజీ కాంబినేషన్ పై అంచనాలు ఆకాశమే హద్దు అనేలా ఉన్నాయి. మరి చూడాలి ఈ అవైటెడ్ కాంబినేషన్ పై అధికారిక క్లారిటీ వస్తుందో లేదో..