Vistara Flight, Bomb Calls : విస్తారా విమానానికి బాంబు బెదిరింపు..
గత కొంత కాలంగా దేశంలో భారీగా బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నయి. అందులోను ముఖ్యంగా విమానాలకు ఎక్కువ సంఖ్యల్లో బాంబు బెదిరింపు కాల్స్ (Bomb Threat Calls) వస్తున్నాయి.

Recently, there was a bomb threat on the Vistara flight traveling between Paris and Mumbai on Sunday.
గత కొంత కాలంగా దేశంలో భారీగా బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్నయి. అందులోను ముఖ్యంగా విమానాలకు ఎక్కువ సంఖ్యల్లో బాంబు బెదిరింపు కాల్స్ (Bomb Threat Calls) వస్తున్నాయి. తాజాగా ఆదివారం పారిస్-ముంబై (Paris-Mumbai) మధ్య ప్రయాణించే విస్తారా విమానానికి (Vistara Flight) బాంబు బెదిరింపు వచ్చింది. పారిస్లోని చార్లెస్ డి గాలె విమానాశ్రయం నుంచి 12 మంది సిబ్బందితో సహా 306 మంది ప్రయాణికులతో UK 024 విమానం ముంబైకి బయలుదేరింది.
విమానం గాల్లో ఉండగానే లోపల బాంబు ఉన్నట్లుగా ఎయిర్ సిక్ నెస్ బ్యాగ్ పై చేతితో రాసిన నోట్ కనిపించింది. కాగా విమానాన్ని సురక్షితంగా ముంబైలో ల్యాండ్ చేశారు. ప్రయాణికులను ముంబైలో దింపివేసి.. విమానాన్ని టెర్మినల్ వద్దకు తరలించి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అయితే విమానంలో బాంబు ఆనవాళ్లు లేక పోవడంతో విమానయాన సిబ్బందితోపాటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
మరోవైపు నిన్న జూన్ 1వ తేదీన చెన్నై నుంచి ముంబై బయలుదేరిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో విమానాన్ని ముంబై ఎయిర్ పోర్ట్‌లో అత్యవసరంగా దించి వేశారు.