ట్రంప్‌ను బీట్ చేసిన కమలా రాయిటర్స్ సంచలన సర్వే
మరో నెల రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. అగ్రదేశ అధినేత ఎవరు అనే విషయం కొద్ది రోజుల్లోనే తేలిపోబోతంది. ఇద్దరు ప్రత్యర్థలు.. కమలా హ్యారిస్, డొనాల్డ్ ట్రంప్ హోరాహోరీ ప్రచారం చేస్తున్నారు.
మరో నెల రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. అగ్రదేశ అధినేత ఎవరు అనే విషయం కొద్ది రోజుల్లోనే తేలిపోబోతంది. ఇద్దరు ప్రత్యర్థలు.. కమలా హ్యారిస్, డొనాల్డ్ ట్రంప్ హోరాహోరీ ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో గెలిచేది ఎవరో అంచనా వేసే పనిలో చాలా మంది సర్వేలు నిర్వహిస్తున్నారు. రాయిటర్స్ రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఈ సర్వే ఇప్పుడు రిపబ్లికన్ పార్టీలో కొత్త టెన్షన్‌ను పుట్టిస్తోంది. ఎందకంటే రాయిటర్స్ సర్వేలో ట్రంప్ కంటే కమలా హ్యారిస్ ముందంజలో ఉన్నట్టు తేలింది. ఇప్పటి వరకూ వాళ్లు సేకరించిన డేటా ప్రకారం ట్రంప్ కంటే కమలా 4 శాతం ఓట్‌బ్యాంక్‌తో ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. కమలా హ్యారిస్‌కు 45 శాతం గెలుపు అవకాశాలు ఉంటే.. డొనాల్డ్ ట్రంప్‌కు మాత్రం కేవలం 41 శాతం మాత్రమే అవకాశాలు ఉన్నట్టు రాయిటర్స్ ప్రకటించింది. ఇద్దరి మధ్య 4 శాతం తేడా ఉండటంతో ఇప్పుడు రిపబ్లికన్స్‌లో కొత్త టెన్షన్ మొదలైంది. అయినప్పటికీ చాలా మంది తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ కూడా తన స్టైల్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. జో బైడెన్ నిర్ణయంతో అధ్యక్ష అభ్యర్థిగా తెరమీదకు వచ్చిన కమలా హ్యారిస్ ఎక్కడా తగ్గకుండా ట్రంప్‌కు తగ్గ పోటీ ఇస్తున్నారు. తాను గెలిస్తే ప్రత్యర్థి పార్టీ వ్యక్తిని కూడా మంత్రివర్గలోకి తీసుకుంటానని కమలా హ్యారిస్ చేసిన ప్రకటనతో ఆమె భారీ మద్దతును పొందారు. నిజానికి ట్రంప్ మీద జరిగిన దాడితో ఆయన భారీ మొత్తంలో మద్దతు కూడగట్టుకుంటారని అంతా అంచనా వేశారు. కానీ ఆ దాడి ట్రంప్ మీద సానుభూతి పెంచినా.. అది ఓట్‌బ్యాంక్‌గా పెద్దమొత్తంలో మారలేదు. కానీ ట్రంప్ మాత్రం కమలా హ్యారిస్‌ను చాలా సింపుల్‌గా ఓడిస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తగ్గ పోటీ కనబర్చే ఈ ఇద్దరు ప్రత్యర్థుల మధ్య అధ్యక్ష పీఠాన్ని అధిరోహించేది ఎవరో తెలియాలంటే నెల వరకూ ఆగాల్సిందే.