America : న్యూయార్క్ పార్క్‌లో కాల్పుల కలకలం.. విచక్షణ రహితకంగా కాల్పులు..
అమెరికా (America) లోని న్యూయార్క్ (New York) రాష్ట్రం రోచెస్టర్‌లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. న్యూయార్క్‌లో మరో సారి కాల్పుల ఘటన చోటు చేసుకుంది.

Shooting chaos in New York Park.. Indiscriminate firing..
అమెరికా (America) లోని న్యూయార్క్ (New York) రాష్ట్రం రోచెస్టర్‌లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. న్యూయార్క్‌లో మరో సారి కాల్పుల ఘటన చోటు చేసుకుంది. మాపెల్‌వుడ్ పార్క్ (Maplewood Park) లో ఆదివారం సాయంత్రం 6:20 గంటలకు ప్రజలు గుమిగూడిన సమయంలో ఒక్కసారిగా తుపాకుల మోత మోగింది. ఈ ఘటనలో 20 ఏళ్ల యువకుడు ఒకరు మృతి చెందగా.. ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని న్యూయార్క్ పోలీసులు తెలిపారు. దుండగుల వివరాలను సేకరిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఇప్పటి వరకు ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదు. కాగా హత్యకు గురైన వ్యక్తి ఎవరనేది పోలీసులు వెల్లడించలేదు. పార్కు (Park) నుంచి సందర్శకులు పరుగులు పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కాల్పుల ఘటనలో ఐదుగురు వ్యక్తులు స్వల్ప గాయాలతో ఆసుపత్రిలో చేరారు. మరికొందరిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.