T20 World Cup : ఇక సూపర్ 8 సమరం… ఆఫ్గనిస్తాన్ తో భారత్ పోరు

టీ ట్వంటీ వరల్డ్‌కప్‌లో సూపర్‌-8 రౌండ్ మ్యాచ్ లు మొదలయ్యాయి. టీమిండియా సూపర్‌-8లో ఇవాళ బార్బోడస్‌ వేదికగా అఫ్గానిస్తాన్‌తో భారత్‌ తలపడనుంది. టీమిండియా ఒక్క ఓట‌మి లేకుండా సూప‌ర్ 8లోకి ఎంట్రీ ఇచ్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 20, 2024 | 01:30 PMLast Updated on: Jun 20, 2024 | 1:30 PM

Super 8 Round Matches Have Started In T20 World Cup

టీ ట్వంటీ వరల్డ్‌కప్‌లో సూపర్‌-8 రౌండ్ మ్యాచ్ లు మొదలయ్యాయి. టీమిండియా సూపర్‌-8లో ఇవాళ బార్బోడస్‌ వేదికగా అఫ్గానిస్తాన్‌తో భారత్‌ తలపడనుంది. టీమిండియా ఒక్క ఓట‌మి లేకుండా సూప‌ర్ 8లోకి ఎంట్రీ ఇచ్చింది. లీగ్ ద‌శ‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన టీమిండియా మూడింటిలో విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిచి సూపర్‌-8 రౌండ్‌ను విజయంతో ఆరంభించాలని రోహిత్‌ సేన భావిస్తోంది. గత రెండు రోజులుగా నెట్ ప్రాక్టీస్ లో భారత్ క్రికెటర్లు తీవ్రంగా శ్రమించారు. అయితే అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌ అంత సులభం కాదని చెప్పొచ్చు. రషీద్‌ ఖాన్‌ నేతృత్వంలోని అఫ్గానిస్తాన్‌ సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ మెగా టోర్నీలో న్యూజిలాండ్‌ వంటి పటిష్ట జట్టును మట్టికరిపించిన అఫ్గాన్‌.. భారత్‌, ఆస్ట్రేలియా వంటి టాప్ జట్లకు సవాల్ విసురుతోంది.

ఈ మ్యాచ్‌లో అందరి చూపు విరాట్‌ కోహ్లిపైనే ఉంది. గ్రూపు స్టేజిలో విఫలమైన కోహ్లి.. సూపర్‌-8లోనైనా సత్తాచాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. అలాగే సూర్య కుమార్ యాదవ్, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య సత్తా చాటల్సిన అవసరం ఉంది. మరోవైపు అఫ్గానిస్తాన్‌ ప్రధాన బలం బౌలింగ్‌ అనే చెప్పాలి. అఫ్గాన్‌ జట్టులో అద్బుతమైన ఫాస్ట్‌ బౌలర్లు, స్పిన్నర్లు ఉన్నారు. ఈ మెగా టోర్నీలో గ్రూపు స్టేజిలో వెస్టిండీస్‌పై మినహా మిగితా మూడు మ్యాచ్‌ల్లోనూ అఫ్గాన్‌ బౌలర్లు సంచలన ప్రదర్శన కనబరిచారు. అయితే స్టార్‌ స్పిన్నర్‌ ముజీబ్‌ ఉర్‌ రెహ్మన్‌ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరం కావడం అఫ్గాన్‌కు గట్టి ఎదురుదెబ్బగా చెప్పొచ్చు.

ఇక గత రికార్డుల పరంగా భారత్ దే పై చేయిగా ఉంది.ఇప్ప‌టివ‌ర‌కు ఆప్ఘ‌నిస్తాన్‌తో టీమిండియా ఎనిమిది టీ20 మ్యాచులు ఆడింది. ఇందులో ఏడు సార్టు టీమిండియా విజ‌యంసాధించ‌గా…ఓ మ్యాచ్ ర‌ద్ధ‌యింది. టీ20ల్లో టీమిండియాపై ఒక్క‌సారి కూడా ఆప్ఘ‌నిస్థాన్ గెల‌వ‌లేదు.