Paris Olympics : బుల్లెట్ దిగింది.. షూటింగ్ లో మనకు మరో మెడల్
పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics) లో భారత్ మూడో పతకం (India's Third Medal) సాధించింది. పురుషుల 50మీ రైఫిల్ 3 పొజిషన్స్ విభాగంలో స్వప్నిల్ కుశాలె (Swapnil Kushale) కాంస్యం గెలిచాడు.

The bullet landed.. Another medal for us in shooting
పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics) లో భారత్ మూడో పతకం (India’s Third Medal) సాధించింది. పురుషుల 50మీ రైఫిల్ 3 పొజిషన్స్ విభాగంలో స్వప్నిల్ కుశాలె (Swapnil Kushale) కాంస్యం గెలిచాడు. దీంతో ఈ విభాగంలో పతకం గెలిచిన తొలి భారత క్రీడాకారుడి (Indian Athletes)గా చరిత్రకెక్కాడు. ఫైనల్‌లో స్వప్నిల్ 451.4 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. అయితే మొదటి పొజిషన్ లో 153.3 పాయింట్లు సాధించి ఆరో స్థానంలో ఉన్న స్వప్నిల్ రెండో పొజిషన్ లో అయిదో స్థానానికి ఎగబాకాడు. అయితే నిలబడి షూట్ చేసే పొజిషన్ లో క్రమంగా తన స్థానాన్ని మెరుగుపరుచుకుంటూ మూడో స్థానంలో నిలిచాడు. మహారాష్ట్రకు చెందిన స్పప్నిల్‌కు ఇదే తొలి ఒలింపిక్ మెడల్. కాగా ఇప్పటి వరకూ పారిస్ ఒలింపిక్స్ లో మూడు పతకాలు షూటింగ్ లోనే వచ్చాయి. అంతేగాక అన్నీ కాంస్యాలే. షూటర్ మను బాకర్ రెండు కాంస్యాలు (Bronze Medal) గెలిచింది. తెలిసిందే. మొదట మహిళల 10మీ ఎయిర్‌పిస్టల్‌లో కాంస్యం నెగ్గిన మను.. సరబ్‌జ్యోత్ (Sarabjyot) తో కలిసి మిక్స్‌డ్ 10మీ ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో కంచు మోగించింది.