Nepal Earthquake : హిమాలయన్ దేశం.. నేపాల్ భూకంపం 150 మందికి పైగా దుర్మరణం.. 2015 తర్వాత మరో భారీ భూకంపం
హిమాలయన్ దేశం అయిన పశ్చిమ నేపాల్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి 11:47 గంటలప్పుడు ఈ భూకంపం సంభవించిందని భూకంప కేంద్రం జాజర్ కోట్ లో కేంద్రీకృతం అయింది యూఎస్ జియోలాజికల్ సర్వే సెంటర్ తెలిపింది. ఈ భూకంప కేంద్రం 17 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించింది. నేపాల్లో 2015 నాటి భూకంపంలో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంప కారణంగా దాదాపు 9 వేల మంది దుర్మరణం చెందారు. ఇదే తీవ్రమైన భూకంపం అని నేపాల్ దేశం విపత్తు శాఖ ప్రకటించింది. ఈ భారీ భూకంపంతో నేపాల్ లోని చాలా ప్రాంతాల మధ్య కమ్యూనికేషన్ తెగిపోయింది.

The US Geological Survey Center said that the earthquake occurred in the Nepal region at 11:47 pm on Friday and the epicenter was centered in Jajar Kot
హిమాలయన్ దేశం అయిన పశ్చిమ నేపాల్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి 11:47 గంటలప్పుడు ఈ భూకంపం సంభవించిందని భూకంప కేంద్రం జాజర్ కోట్ లో కేంద్రీకృతం అయింది యూఎస్ జియోలాజికల్ సర్వే సెంటర్ తెలిపింది. ఈ భూకంప కేంద్రం 17 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించింది. నేపాల్లో 2015 నాటి భూకంపంలో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంప కారణంగా దాదాపు 9 వేల మంది దుర్మరణం చెందారు. ఇదే తీవ్రమైన భూకంపం అని నేపాల్ దేశం విపత్తు శాఖ ప్రకటించింది. ఈ భారీ భూకంపంతో నేపాల్ లోని చాలా ప్రాంతాల మధ్య కమ్యూనికేషన్ తెగిపోయింది. ఈ భూకంప తీవ్రతకు భారత్‌లో కూడా అనేక ప్రాంతాలు కంపించాయి. 800 కి.మీ దూరంలో ఉన్న ఢిల్లీతో పాటు యూపీ, బిహార్‌లోని ఏరియాల్లో ప్రకంపనలు వచ్చాయి. ఢిల్లీలో ప్రాణ నష్టం జరగకపోయినా భయానక వాతావరణం కనిపించింది. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు.. రోడ్లపై పరుగులు పెట్టారు. ఢిల్లీతో పాటు బీహార్ పాట్నా, వారణాసి, ప్రయాగ్ రాజ్ లో ప్రకంపనలు వచ్చాయి.
Nepal Earthquake: నేపాల్‌లో భూకంపం- 70 మందికి పైగా మృతి
భూకంపం సంభవించినప్పటి నుండి శనివారం ఉదయం వరకున్న సమాచారం జాజర్ కోట్ జిల్లాలో 95 మంది చనిపోయారని నేపాల్ సైన్యం ప్రతినిధి భండారీ తెలిపారు. రుకుమ్ వెస్ట్ జిల్లాలో 38 మంది మరణించినట్లు ప్రజలు సమాచారం ఇచ్చారని జిల్లా ఎస్ పీ నామ్ రాజ్ భట్టారీ తెలిపారు. నాల్గఢ్ మున్సిపాలిటీ చనిపోయినవారిలో డిప్యూటీ మేయర్ సరిత సింగ్ కూడా ఉన్నట్లు సమాచారం.
ఈ భూకంపంలో సుమారుగా 150 కి పైగా ప్రజలు మృతి చెందినట్లు అధికారికంగా నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. కేవలం జాజర్ కోట్, రుకుమ్ జిల్లాలోనే దాదాపు 128 మంది మృతి చెందారు. ఈ భారీ భూకంపం వల్ల నేపాల్ ప్రాణ, ఆస్తి నష్టంపై ప్రధాని తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
SURESH