ట్రంప్‌ను గెలిపించిన అంశాలు ఇవే

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎప్పుడూ కనిపించనంత సస్పెన్స్‌ ఈ ఎన్నికల్లో కనిపించింది. మొదటి నుంచీ ఎవరు గెలుస్తారని విశ్లేశించడంతో ఏజెన్సీలు ఎలా ఫెయిల్‌ అయ్యాయో.. ఎన్నికల్లో కూడా చివరకూ నిమిషం వరకూ విజేత ఎవరు అని చెప్పడంలో అందరూ అంతే సస్పెన్స్‌ ఫీలయ్యారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 6, 2024 | 04:17 PMLast Updated on: Nov 06, 2024 | 4:17 PM

These Are The Factors That Won Trump

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎప్పుడూ కనిపించనంత సస్పెన్స్‌ ఈ ఎన్నికల్లో కనిపించింది. మొదటి నుంచీ ఎవరు గెలుస్తారని విశ్లేశించడంతో ఏజెన్సీలు ఎలా ఫెయిల్‌ అయ్యాయో.. ఎన్నికల్లో కూడా చివరకూ నిమిషం వరకూ విజేత ఎవరు అని చెప్పడంలో అందరూ అంతే సస్పెన్స్‌ ఫీలయ్యారు. ఎట్టకేలకు డొనాల్డ్‌ ట్రంప్‌ గెలిచారు. మరోసారి అమెరికా అధ్యక్ష పీఠాన్ని ఎక్కబోతున్నారు. కానీ సస్పెన్స్‌ మాత్రం పీక్స్‌కు వెళ్లింది. అమెరికా ఎన్నికలను అర్థం చేసుకోవడం అంత కష్టమా అంటే.. ఎస్‌.. అమెరికాలో ఎలక్షన్‌ ప్రాసెస్‌ చాలా క్లిష్టంగా ఉంటుంది. యూఎస్‌లో ప్రెసిడెన్షియల్‌ ఎలక్షన్స్‌ పరోక్ష పద్ధతిలో జరుగుతాయి.

నవంబర్ 5న ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నా, ఎలక్టోరల్ కాలేజీకి చెందిన 538 మంది ఓటర్లు అమెరికా అధ్యక్షున్ని ఎన్నుకుంటారు. ప్రతీ రాష్ట్రానికి ఓ కాంగ్రెస్‌ ఉంటుంది. ఆ రాష్ట్రంలో ఉండే సెనెటర్లు, రిప్రజెంటేటివ్స్‌ను కలిపి కాంగ్రెస్‌ అంటారు. రాష్ట్రంలో ఉండే జనాభాను బట్టి వీళ్లు ఎంత మంది ఉంటారు అనేది డిసైడ్‌ చేస్తారు. వీళ్లు ఎవరికి ఓటు వేస్తే వాళ్లే అమెరికా అధ్యక్షులు అవుతారు. వీళ్లే వేసే ఓట్‌నే ఎలక్టోరల్‌ ఓట్‌ అంటారు. ప్రస్తుతం అమెరికాలో 538 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్నాయి. ఇందులో 270 ఓట్లకు లేదం అంతకు మించి ఎవరు గెలుచుకుంటారో వాళ్లే అమెరికా ప్రెసిడెంట్‌. అమెరికాలో మొత్తంగా కాంగ్రెస్‌లో 100 మంది సెనేటర్లు, 435 మంది ప్రతినిధులు ఉన్నారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ D.C.కి సెనేటర్లు, ప్రతినిధులు లేనప్పటికీ ముగ్గురు ఓటర్లు ఉన్నారు.

యూఎస్‌ రాజ్యాంగం ప్రకారం, నిర్దిష్ట వ్యక్తులు ఓటర్లుగా ఉండకూడదు. అంటే సెనేటర్లు, ప్రతినిధులు లేదా ప్రభుత్వ హోదాలో ఉన్న ఎవరినైనా ఓటు హక్కు పొందరు. అమెరికన్లు జనరల్‌ ఎలక్షన్స్‌లో నేరుగా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్‌కు ఓటు వేయరు. ఎలెక్టర్లుగా పేర్కొనే వ్యక్తులకు ఓటు వేస్తారు. ప్రతి ప్రెసిడెన్షియల్ అభ్యర్ధికి ఎలెక్టర్ల గ్రూపు వీళ్లను స్లేట్‌ అంటారు. 48 రాష్ట్రాలు, వాషింగ్టన్ డీసీలో అత్యధిక ఓట్లు పొందిన అభ్యర్థి ఆ రాష్ట్ర ఎన్నికల ఓట్లన్నీ గెలుస్తారు. దీన్ని ‘విన్నర్‌-టేక్‌-ఆల్’ సిస్టమ్ అంటారు. మైనే, నెబ్రాస్కా రాష్ట్రాల్లో మాత్రం రూల్స్ వేర్వేరుగా ఉన్నాయి. ఎందుకంటే అవి తమ ఎలక్టోరల్‌ ఓట్లను విభజించాయి. జిల్లా స్థాయి, రాష్ట్రవ్యాప్త ఫలితాల ఆధారంగా ఎలక్టోరల్‌ ఓట్లు కేటాయిస్తాయి. అధ్యక్ష ఎన్నికల్లో గెలవాలంటే, అభ్యర్థికి మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లలో కనీసం 270 అవసరం. ఒకవేల ఏ అభ్యర్థి కూడా ఈ మేజిక్‌ ఫిగర్‌ను చేరుకోకపోతే, ప్రతినిధుల సభ అధ్యక్షుడిని ఎన్నుకుంటుంది. నిజానికి ఇక్కడ కామన్‌ పీపుల్‌ వేసే ఓట్లు ప్రెసిడెంట్‌ను డిసైడ్‌ చేయవు.

వాళ్లు వేసే ఓట్‌ను పాపులర్‌ ఓట్‌ అంటారు. పాపులర్‌ ఓట్లు ఎక్కవగా వచ్చి ఎలక్టోరల్‌ ఓట్లు తక్కువగా వచ్చినా ఆ అభ్యర్థి ఓడిపోయిట్టే. 2016లో ఇదే జరిగింది. హిల్లరీ క్లింటన్‌కు పాపులర్‌ ఓట్లు ట్రంప్‌ కంటే ఎక్కువగా వచ్చినా.. ట్రంప్‌కు ఎలక్టోరల్‌ ఓట్లు ఎక్కువగా రావడంతో ఆయనే అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. కానీ ఇప్పుడు మాత్రం అటు పాపులర్‌ ఓట్లు, ఇటు ఎలక్టోరల్‌ ఓట్లు రెండింటింలో ట్రంప్‌ మెజారీ సాధించారు. ముఖ్యంగా స్వింగ్‌ స్టేట్స్‌ ట్రంప్‌కు జై కొట్టాయి. అమెరికాలో జార్జియా, నార్త్‌ కరోలినా, నెవెడా, అరిజోనా, మిచిగాన్‌, విస్కాన్సిన్‌, పెన్సిల్వేనియా లాంటి స్టేట్స్‌ను స్వింగ్‌ స్టేట్స్‌ అంటారు. వీళ్లు ఎప్పుడు ఎవరి వైపు ఉంటారో పెద్దగా క్లారిటీ ఉండదు. కానీ లాస్ట్‌ 2 ఎలక్షన్స్‌లో ఈ స్టేట్స్‌ దాదాపు డెమోక్రాట్లకే మద్దతు తెలిపాయి. కానీ ఈసారి మాత్రం కమళా హ్యారిస్‌కు షాకిచ్చాయి ఈ స్టేట్స్‌.

ట్రంప్‌ మొదటి నుంచీ మెజార్టీలో దూసుకుపోయినా 230 సీట్ల దగ్గర ఆగిపోయారు. అదే సమయంలో కమళా హ్యారిస్‌ 100 నుంచి దాదాపు ట్రంప్‌కు సమాన స్థాయికి రీచ్‌ అయ్యింది. ఈ స్పీడ్‌ చూసి కమళా గెలిచేస్తుందని చాలా మంది అనుకున్నారు కానీ.. ఈ స్వింగ్‌ స్టేట్స్‌లో కూడా ట్రంప్‌ హవా కొనసాగడంతో మెరుపు వేగంతో మేజిక్‌ ఫిగర్‌ను రీచ్‌ అయ్యారు ట్రంప్‌. రెండో సారి అమెరికా పీఠాన్ని అధిరోమించడమే కాకుండా.. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన పెద్ద వయస్కుడిగా కూడా రికార్డ్‌ సాధించారు. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌ ప్రమాణస్వీకారం చేసేటప్పటకి ఆయన వయసు కంటే ఇప్పుడు ట్రంప్‌ వయసు 7 నెలల పెద్ద. ఇలా ఒకేసారి రెండు రికార్డ్స్‌ను బ్రేక్‌ చేశాడు డొలాన్డ్‌ ట్రంప్‌.