అమెరికా ఎన్నికల్లో గెలిచిన తెలుగువాళ్ళు వీళ్లే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయకేతనం ఎగరవేశారు. క్లియర్ మెజార్టీతో గెలిచి రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠాన్ని అదిరోహించనున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు కూడా సత్తా చాటారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయకేతనం ఎగరవేశారు. క్లియర్ మెజార్టీతో గెలిచి రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠాన్ని అదిరోహించనున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు కూడా సత్తా చాటారు. మొత్తం 9 మంది ఎన్నికల్లో పోటీ చేస్తే అందులో ఆరుగురు అభ్యర్థులు ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. గత కాంగ్రెస్‌లో అయిదుగురు భారతీయ అమెరికన్ సభ్యులు ఉండగా.. ఈసారి ఆ సంఖ్య ఆరుగురికి చేరింది. ఇక్కడ హైలెట్ ఏంటంటే గెలిచనివాళ్లంతా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థులే. శ్రీ తానేదార్ అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రం లోని 13వ జిల్లా నుంచి యూఎస్ కాంగ్రెస్ కు తిరిగి ఆయన ఎన్నికయ్యారు.
2023 నుంచి డెమోక్రటిక్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ తానేదార్.. 68.6 శాతం ఓట్లు తెచ్చుకుని విజయం సాధించారు. శ్రీ తానేదార్ కర్ణాటకలో జన్మించారు. ఉన్నత విద్య కోసం ఆమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఇల్లినోయీ రాష్ట్రం 8వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు రాజా కృష్ణమూర్తి ఎన్నికయ్యారు. ఢిల్లీకి చెందిన ఈయన రిపబ్లికన్ పార్టీపై దాదాపు 30 వేలకు పైగా ఓట్ల తేడాతో గెలిచారు. కృష్ణమూర్తి 2016 లో తొలిసారి అక్కడి నుంచి ప్రతినిధుల సభకు వెళ్లారు. చిన్నప్పటి నుంచీ అమెరికాలోనే పెరిగిన కృష్ణమూర్తి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న కృష్ణమూర్తి.. ఇల్లినోయీలో పలు పదవులు నిర్వహించారు. స్టేట్ ట్రెజరర్‌గా కూడా ఆయన సేవలు అందించారు. కాలిఫోర్నియా 17వ జిల్లా నుంచి యూఎస్ హౌస్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో భారత సంతతికి చెందిన రో ఖన్నా విజయం సాధించారు.
పంజాబ్ నుంచి అమెరికాకు వలస వెళ్లిన హిందూ కుటుంబంలో రో ఖన్నా జన్మించాడు. ఆయనకు ప్రత్యర్థిగా రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీ చేసిన అనితా చెన్ కూడా భారత సంతతికి చెందని మహిళే. ఎన్నికల్లో అనితను చాలా సింపుల్‌గా ఓడించారు రో ఖన్నా. రో ఖన్నాకు 66 శాతం ఓట్లు రాగా.. అనితా చెన్ కు 34శాతం ఓట్లు వచ్చాయి. సీనియర్ ఇండో అమెరికన్ సెనేటర్ అయిన అమిబెరా.. ఈ సారి కూడా కాలిఫోర్నియా 6వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి విజయం సాధించారు. వృత్తి పరంగా ఆయన డాక్టర్. 2013 నుంచి వరుసగా ఆరు సార్లు అమిబెరా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లోనూ ఏడోసారి బరిలోకి దిగిన ఆయన.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిపై విజయం సాధించారు. డెమోక్రటిక్ నేత ప్రమీలా జైపాల్ వాషింగ్టన్ 7వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి విజయం సాధించారు. ఈమె 2017 నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
ఈసారి ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నేత డాన్ అలెగ్జాండర్‌ను ఓడించి తిరిగి ఎన్నికయ్యారు. 59ఏళ్ల ప్రమీలా జైపాల్ డెమోక్రటిక్ పార్టీలో కీలక నేతల్లో ఒకరు. ఈ ఎన్నికల్లో ప్రమీలా జైపాల్‌కు 84.9 శాతం ఓట్లు రాగా.. తన ప్రత్యర్థి డాన్ అలెగ్జాండర్‌కు 15.1 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. వర్జీనియా పదో కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి సుహాస్ సుబ్రహ్మణ్యం బరిలోకిదిగి విజయం సాధించాడు. సుబ్రమణ్యం తన ప్రత్యర్థి మైక్ క్లాన్సీపై విజయం సాధించాడు. సుబ్రహ్మణ్యంకు దాదాపు 53 శాతం ఓట్లు పోలయ్యాయి. డెమోక్రాట్లకు వర్జీనియా రాష్ట్రం కంచుకోటగా ఉంది. దీంతో వర్జీనియా నుంచి గెలిచిన తొలి ఇండో అమెరికన్‌గా సుబ్రమ్మణ్యం రికార్డు సృష్టించాడు. గతంలో ఒబామా హయాంలో ఆయన సాంకేతిక విధాన సలహాదారుగా సుబ్రమ్మణ్యం పనిచేశారు. ఈ ఇండో అమెరికన్ల విజయంతో భారత్ అమెరికా సంబంధాలు మరింత బలపడనున్నాయి.