Pakistan : పాకిస్తాన్ కి ఇదేం బుద్ది..? ఆఫ్గాన్లపై ఇంత దారుణమా..?
ఆఫ్గాన్ శరణార్థుల విషయంలో ఐక్యరాజ్యసమితి కూడా జోక్యం చేసుకుంది. పాకిస్తాన్ లో ఉన్న మైగ్రేంట్స్ ను ఇబ్బంది పెట్టవద్దని సూచించింది. కానీ పాకిస్తాన్ లో ప్రస్తుతం ఉన్న తాత్కాలిక ప్రభుత్వం.. ఆఫ్గాన్ శరణార్థులకు దేశం విడిచి వెళ్ళాలని అక్టోబర్ 31 వరకూ డెడ్ లైన్ పెట్టింది. ఆ లోగా వెళ్ళకపోతే.. 20 లక్షల మందిని నిర్ధాక్షణ్యంగా పంపేస్తామని చెప్పింది. దాంతో ఇప్పుడు ఆఫ్గాన్ శరణార్థుల ఇష్యూ.. పాక్ పాలకులు, తాలిబన్ల మధ్య కొత్త ఉద్రిక్తతకు దారితీస్తోంది.
మన దగ్గర ఓ మోటు సామెత ఉంది.. అడ్డుక్కునే వాడి దగ్గర ఇంకేదో అని.. ప్రస్తుతం పాకిస్తాన్ ( Pakistan ) పరిస్థితి అంతే ఉంది. ఆఫ్గానిస్తాన్ ( Afghan ) లో బతకలేక పాకిస్తాన్ కి వచ్చిన అక్కడి జనాన్ని దోచుకుంటోంది. అసలే శరణార్థులు.. తమ దేశంలో బతకలేక ఇక్కడికి వచ్చారు.. అని కాస్త జాలి, దయ లాంటివి ఏమీ చూపించకుండా.. ఆఫ్గాన్లను దోచుకోవడం ఏంటని పాకిస్తాన్ పై మండిపడుతున్నారు తాలిబన్లు. ఆఫ్గనిస్తాన్ లో అమెరికా దళాలు వెళ్ళిపోవడం.. ఆ తరువాత తాలిబన్లు తిరిగి అధికారంలోకి రావడంతో.. చాలా మంది ఆఫ్గాన్ల ఆశలు అడియాసలు అయ్యాయి. ఆ టైమ్ లో అమెరికా సహా ఇతర దేశాలు ఏర్పాటు చేసిన విమానాల్లో వెళ్ళేందుకు .. ఎంత మంది పోటీ పడ్డారో మనందరికీ గుర్తుండే ఉంటుంది. కొందరు విమానం బయట రెక్కలు పట్టుకొని .. సగం దూరంలోనే సముద్రంలో పడిపోయిన సందర్భాలు ప్రపంచంలో అందరికీ కన్నీళ్ళు తెప్పించాయి.
ఇప్పుడు ఆఫ్గానిస్తాన్ నుంచి విదేశాలకు ఎలాంటి రాకపోకలు లేవు. దాంతో చాలామంది తినడానికి తిండిలేక పొరుగునే ఉన్న పాకిస్తాన్ కు పొట్ట చేత పట్టుకొని వెళ్లారు. ఏదో కూలీనాలీ చేసుకుంటూ పాకిస్తాన్ లో బతుకుతున్నారు ఆఫ్గానిస్తాన్ ప్రజలు. అయితే ఇలా శరణార్థులుగా వచ్చిన వాళ్ళందర్నీ తిరిగి మీ దేశానికి తీసుకుపోండి అంటూ.. తాలిబన్లకు డెడ్ లైన్ పెట్టింది పాకిస్తాన్. లేకపోతే బలవంతంగా ఖాళీ చేయిస్తామని వార్నింగ్ కూడా ఇచ్చింది. ఆ టైమ్ లో తాలిబన్లు, పాకిస్తాన్ మంత్రుల మధ్య మాటల యుద్ధం నడిచింది.
Telangana Congress, CPM : కామ్రేడ్లను బుజ్జగిస్తున్న కాంగ్రెస్..
ఇప్పుడు మళ్ళీ కొత్త వివాదం మొదలైంది. పాకిస్తాన్ లో ఉన్న ఆఫ్గాన్ శరణార్థులను పాక్ పోలీసులు, అధికారులు క్రూరంగా హింసిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆఖరికి శరణార్థుల దగ్గర ఉన్న వ్యక్తిగత వస్తువులను పాకిస్తాన్ దోచుకుంటోందని తాలిబన్లు ఆరోపిస్తున్నారు. వాళ్ళు ఉంటున్న ఇళ్ళను పడగొడుతూ గూడు లేకుండా చేస్తోంది పాకిస్తాన్. ఆఫ్గాన్ శరణార్థులపై ఇలా అమానుషంగా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు తాలిబన్ ప్రభుత్వంలోని మంత్రి. పాకిస్తాన్ కు తాము తగిన బుద్ధి చెబుతామని వార్నింగ్ ఇచ్చారు.
Telangana Rythubandhu scheme : ఎక్కువ భూములుంటే రైతుబంధు కట్..!? బాంబు పేల్చిన కేటీఆర్
పాకిస్తాన్ లో ఇప్పటికే 20 లక్షల మంది దాకా ఆఫ్గాన్ శరణార్థులు తలదాచుకుంటున్నారు. వీళ్ళందర్నీ దేశం నుంచి పంపేస్తామని పాకిస్తాన్ చెబుతోంది. అలా పంపితే అంతర్జాతీయ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆఫ్గనిస్తాన్ ప్రధాని ముల్లా మహ్మద్ హస్సన్ ఈమధ్యే వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళంతట వాళ్ళు తిరిగి స్వదేశం వెళ్ళిపోయేదుకు టైమ్ ఇవ్వాలనీ.. అంతవరకూ వేధిస్తే ఊరుకునేది లేదన్నారు. మీరు పొరుగునే ఉన్నారు.. మీ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించుకోవాలని పాక్ కు వార్నింగ్ ఇచ్చారు ఆఫ్గనిస్తాన్ ప్రధాని.
ఆఫ్గాన్ శరణార్థుల విషయంలో ఐక్యరాజ్యసమితి కూడా జోక్యం చేసుకుంది. పాకిస్తాన్ లో ఉన్న మైగ్రేంట్స్ ను ఇబ్బంది పెట్టవద్దని సూచించింది. కానీ పాకిస్తాన్ లో ప్రస్తుతం ఉన్న తాత్కాలిక ప్రభుత్వం.. ఆఫ్గాన్ శరణార్థులకు దేశం విడిచి వెళ్ళాలని అక్టోబర్ 31 వరకూ డెడ్ లైన్ పెట్టింది. ఆ లోగా వెళ్ళకపోతే.. 20 లక్షల మందిని నిర్ధాక్షణ్యంగా పంపేస్తామని చెప్పింది. దాంతో ఇప్పుడు ఆఫ్గాన్ శరణార్థుల ఇష్యూ.. పాక్ పాలకులు, తాలిబన్ల మధ్య కొత్త ఉద్రిక్తతకు దారితీస్తోంది.