Top story: సిరియాలో నెతన్యాహు మార్క్ విధ్వంసం.. ఇరాన్ టార్గెట్‌గా మొస్సాద్ మాస్టర్ స్ట్రాటజీ ఏంటి?

గాజాలో హమాస్ స్టోరీకి ఆల్మోస్ట్ ఎండ్ కార్డ్ పడిపోయింది. లెబనాన్‌లో హిజ్బుల్లా కథ కూడా క్లైమాక్స్‌కు చేరుకుంటోంది. మరో శత్రుదేశం ఇరాన్ కూడా మొస్సాద్ కొట్టిన దెబ్బతో గుడ్లు తేలేసింది. ఇక మిడిల్ ఈస్ట్‌లో అంతా ప్రశాంతమే అనుకున్నారంతా.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 13, 2024 | 01:32 PMLast Updated on: Dec 13, 2024 | 1:32 PM

Top Story Netanyahus Destruction Of Mark In Syria What Is Mossads Master Strategy To Target Iran

గాజాలో హమాస్ స్టోరీకి ఆల్మోస్ట్ ఎండ్ కార్డ్ పడిపోయింది. లెబనాన్‌లో హిజ్బుల్లా కథ కూడా క్లైమాక్స్‌కు చేరుకుంటోంది. మరో శత్రుదేశం ఇరాన్ కూడా మొస్సాద్ కొట్టిన దెబ్బతో గుడ్లు తేలేసింది. ఇక మిడిల్ ఈస్ట్‌లో అంతా ప్రశాంతమే అనుకున్నారంతా. ఇజ్రాయెల్ కూడా యుద్ధానికి ముగింపు చెప్పాలనే భావించింది. కానీ, ఎక్కడో ఒక చిన్న అనుమానం.. హమాస్, హిజ్బుల్లా అంత ఈజీగా అంతమయ్యే ఛాన్సే లేదని నెతన్యాహుకు తెలుసు. ఆ రెండు గ్రూపులు అంతం కావాలంటే ఇరాన్ సపోర్ట్ లేకుండా చేయడం ఒక్కటే మార్గం అనీ తెలుసు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే వెదకబోయిన తీగ కాలికి తగిలినట్టు అద్భుత అవకాశం నెతన్యాహు తలుపుతట్టింది. ఆ అవకాశమే సిరియా అంతర్యుద్ధం. ఇప్పుడా అవకాశాన్నే ఆయన ఉపయోగించుకుంటున్నారు. సిరియాలో విధ్వంసం సృష్టిస్తున్నారు. ఐతే, హమాస్, హిజ్బుల్లా అంతానికీ సిరియాలో ఇజ్రాయెల్ సృష్టిస్తున్న విధ్వంసానికీ లింకేంటి? మిషన్ సిరియా వెనుక మొస్సాద్ మాస్టర్ స్ట్రాటజీ ఏంటి? ఈ స్టోరీ చూద్దాం..

డిసెంబర్ 7వ తేదీ.. సిరియాలో అంతర్యుద్ధం పతాకస్థాయికి చేరిన రోజు. తిరుగుబాటు దళాలు
సిరియాలోని ఒక్కో నగరాన్నీ ఆక్రమించుకుంటూ బుల్లెట్ వేగంతో దూసుకొస్తున్నారు. ఈ పరిణామాలను సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ నిశితంగా పరిశీలిస్తున్నాడు. అదే సమయంలో సిరియా పరిణామా లను మరొకరు కూడా పరిశీలిస్తున్నారు. సిరియా తిరుగుబాటు దళాల వశమైతే ఏం చేయాలి? ఎలా ముందుకు వెళ్లాలని తన టీమ్‌తో చర్చిస్తున్నారు. అతడు మరెవరో కాదు.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.! ఈ ఇద్దరిలో ఒకరు ప్రాణం కాపాడుకోడానికీ, మరొకరు దేశాన్ని కాపాడుకోడానికీ సమాలోచనలు చేస్తున్నారు. చివరికి ఆ రోజు అర్థరాత్రి సమయానికి అసద్‌కు తన ఫ్యూచర్ ఏంటో అర్ధమైపోయింది. తాను ఇంకా సిరియాలోనే ఉంటే మరణం తప్పదనే నిర్ణయానికి వచ్చేశాడు. ఆ వెంటనే రష్యాతో సంప్రదింపులు మొదలు పెట్టాడు. ఇంచుమించు అదే సమయంలో నెతన్యాహు సైతం సిరియాలో అసద్ ప్రభుత్వం మనుగడ సాగించడం ఇంపాజిబుల్ అనే నిర్ణయానికి వచ్చేశారు. నెక్స్ట్ ఏం చేయాలనేదానిపై మొస్సాద్‌ తో చర్చలు జరిపారు. నిమిషాల్లోనే ప్లాన్ సిద్ధమైపోయింది. ఇక చేయాల్సిందల్లా ఫోర్స్‌ను సిద్ధం చేయడం ఒక్కటే.

వందకుపైగా వ్యూహాత్మక స్థావరాలు, యుద్ధ విమానాలు, క్షిపణులు, సబ్‌మెరైన్లు, యుద్ధ నౌకలు. వీటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా మిగలకూడదనేది నెతన్యాహు ఆలోచన. కానీ, లక్ష్యం అంత చిన్నదేం కాదు.. అలా అని ఇజ్రాయెల్‌కు అదంత కష్టమైన పనీ కాదు. చివరకి మూడు రోజుల టైం తీసుకున్నారు.. 350 యుద్ధ విమానాలను యాక్షన్‌లో దించారు. అనుకున్నట్టే 320 లక్ష్యాలపై ఆ ఫైటర్ జెట్లు విరుచుకు పడిపోయాయి. మొదటిరోజే సిరియా ఎయిర్‌ఫోర్స్‌, నేవీ ఆయుధాలను 80శాతం ధ్వంసం చేసేశాయి. రెండు కీలక పోర్టులను నామరూపాల్లేకుండా తుడిచిపెట్టేశాయి. 15 యుద్ధ నౌకలు, రాడార్లు, మిస్సైళ్లు, దాడి చేసే సత్తా ఉన్న హెలికాప్టర్లు.. ఇలా ఒక్కటేంటి కంటికి కనిపించిన ఏ లక్ష్యాన్నీ విడిచిపెట్టకుండా సిరియాను తగలబెట్టేసి వచ్చింది ఇజ్రాయెల్ వాయుసేన. జస్ట్ 48 గంటల గ్యాప్‌లోనే 480 దాడులుచేసి సిరియాలో అల్లకల్లోలం సృష్టించింది. ఒకవైపు ఆకాశం నుంచి విరుచుకుపడుతుండగానే మరోవైపు 1974నాటి లైన్ ఆఫ్ కంట్రోల్ ఒప్పందాన్ని ఉల్లంఘించి మరీ ఐడీఎఫ్ సేనలు సిరియా‌లోకి చొచ్చుకు పోయాయి. సిరియా రాజధాని డమాస్కస్‌కు 20 కిలోమీటర్ల దూరం వరకూ ఐడీఎఫ్ యుద్ధ ట్యాంకులను తీసుకెళ్లింది. ఈ డెడ్లీ మిషన్ కోసం ఎప్పట్లానే మొస్సాద్ ఏళ్ల తరబడి సేకరించిన ఇంటెలిజెన్స్, ప్లానింగ్ ఉపయోగపడ్డాయి. కానీ, నెతన్యాహు సిరియాను ఈ స్థాయిలో ఎందుకు టార్గెట్ చేశారు?

ఎందుకంటే, ఇజ్రాయెల్‌కు ఇప్పుడు అతిపెద్ద ముప్పు హమాస్ నుంచో, హిజ్బుల్లా నుంచో కాదు.. సిరియా నుంచే పొంచి ఉంది. అందుకు కారణం టెల్ అవీవ్‌ నియంత్రణలో ఉన్న గోలన్ హైట్స్‌కు అతి చేరువలో హయత్ తహ్రీర్ అల్ షామ్ వంటి సిరియా తిరుగుబాటు దళాలు పాగా వేయడమే. దీంతో తమకు ముప్పు పొంచి ఉంది అని ఇజ్రాయెల్ భావిస్తోంది. ఇదే సమయంలో రసాయన ఆయుధాలు, అధునాతన ఆయుధాలు శత్రువుల చేతుల్లోకి చేరడంతో ఇజ్రాయెల్ భద్రత మరింత రిస్క్‌లో పడింది. ఈ ముప్పుతో పాటు సిరియా సంక్షోభం ఇజ్రాయెల్‌కు మరో అవకాశాన్ని అందించింది. ఇరాన్ మద్దతుతో సిరియాలో దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న అసద్ ప్రభుత్వం కూలిపోవడం వల్ల మరో అవకాశం లభించినట్లు అయింది. నిజానికి.. లెబనాన్‌లోని హిజ్బుల్లా గ్రూప్‌కు సిరియా ద్వారానే ఇరాన్ ఆయుధ సాయం చేస్తోంది. అసద్ ప్రభుత్వం మద్దతుతో హిజ్బుల్లాకు అవసరమైన ప్రతిసారీ ఇరాన్ ఆయుధాలను స్మగ్లింగ్ చేసేది.
దీంతో సిరియా ద్వారా లెబనాన్లోని హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్నకు ఇరాన్ చేసే అయుధాల స్మగ్లింగ్కు అడ్డుకట్ట వేసేందుకు ఇదో అద్భుత అవకాశంగా ఇజ్రాయెల్ భావించింది. అందుకే, సిరియాలో ఈ రేంజ్ యాక్షన్‌లోకి దిగింది. తన మిత్రదేశమైన సిరియాలో ఇజ్రాయెల్ ఆయుధాలను ధ్వంసం చేస్తుంటే.. ఇరాన్‌ చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది.

ఇదిలా ఉంటే.. సిరియా సంక్షోభం పశ్చిమాసియాలో వ్యాపించకుండా చూడటమే తమ కర్తవ్యం అని ఇజ్రాయెల్ చెబుతోంది. సిరియా ఆక్రమణ వార్తలను ఖండించిన ఇజ్రాయెల్ రక్షణ మంత్రి, బఫర్ జోన్ను తమ ఆధీనంలోకి తీసుకున్నాక, దానికి మించిన సెక్యూరిటీ జోన్ ఏర్పాటు చేస్తామన్నారు. సిరియా వ్యాప్తంగా ఉన్న భారీ ఆయుధాలను ధ్వంసం చేసి సెక్యూరిటీ జోన్ క్రియేట్ చేస్తామన్నారు. తద్వారా సిరియా మీదుగా లెబనాన్కు ఇరాన్ చేసే ఆయుధ స్మగ్లింగ్ అడ్డుకుంటామన్నారు. సరిహద్దును మార్చాలని లేదా సిరియాను ఆక్రమించాలనేది తమ లక్ష్యం కాదని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇది వ్యూహాత్మక ఆపరేషన్ మాత్రమే అంటోంది. సింపుల్‌గా చెప్పాలంటే సిరియన్ ఆర్మీని కుప్పకూల్చడం ద్వారా తమ సరిహద్దులను సురక్షితంగా ఉంచుకోవాలనేది ఇజ్రాయెల్ స్ట్రాటజీ. ఈ ఆపరేషన్‌ ద్వారా ఇప్పటికే దెబ్బతిన్న హమాస్, హిజ్బుల్లాను తిరిగి పుంజుకోకుండా చేయొచ్చు. ముఖ్యంగా ఇరాన్‌ నుంచి ఆ రెండు గ్రూపులకు ఉన్న లింకును తెంచేయొచ్చు. ఇప్పుడు నెతన్యాహు చేస్తోంది అదే. సింపుల్‌గా చెప్పా లంటే మిడిల్ ఈస్ట్‌లో అసలు సిసలు ఆట ఇప్పుడే మొదలైంది.