Top story అమెరికాలో పురుషులకు సెక్స్ కష్టాలు

అమెరికాలో పురుషులకు కొత్త కష్టాలు మొదలయ్యాయా ? ఆ దేశ పురుషుల పాలిట శత్రవు...డోనాల్డ్ ట్రంపే విలనా ? అగ్రరాజ్యంలో ఆడాళ్లంతా ఏకమవుతున్నారా ? పురుషుల టార్గెట్ గా ఉద్యమాలు ఊపందుకుంటున్నాయా ?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 11, 2024 | 03:05 PMLast Updated on: Nov 11, 2024 | 3:05 PM

Top Story Sex Struggles For Men In America

అమెరికాలో పురుషులకు కొత్త కష్టాలు మొదలయ్యాయా ? ఆ దేశ పురుషుల పాలిట శత్రవు…డోనాల్డ్ ట్రంపే విలనా ? అగ్రరాజ్యంలో ఆడాళ్లంతా ఏకమవుతున్నారా ? పురుషుల టార్గెట్ గా ఉద్యమాలు ఊపందుకుంటున్నాయా ? దక్షిణ కొరియా స్త్రీవాద ఉద్యమం…అమెరికాకు పాకిందా ? భార్యాభర్తలు, లవర్స్ మధ్య అమెరికా ఎన్నికలు చిచ్చు రాజేశాయా ?

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్…అధ్యక్ష ఎన్నికలలో తిరుగులేని విజయం సాధించారు. వచ్చే ఏడాది జనవరిలో అధ్యక్షుడిగా రెండోసారి డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. డోనాల్డ్ ట్రంప్ విజయంతో రిపబ్లికన్లు సంబరాల్లో మునిగిపోయారు. ఇక్కడే అమెరికాలోని పురుష పుంగవులకు కొత్త చిక్కొచ్చి పడింది. భర్తలకు భార్యలు…ప్రియుడికి ప్రియురాళ్లు దూరమవుతున్నారు. నో సెక్స్, నో డేటింగ్, నో పిల్లలు అంటున్నారు అమెరికన్ మహిళలు. దీంతో మహరాజుల్లా ఫీలైపోయే…మగరాయుళ్లు విరహ వేదనను తట్టుకోలేకపోతున్నారు.

అధ్యక్ష ఎన్నికలలో డొనాల్డ్ ట్రంప్ గెలుపుతో…4B ఉద్యమం ఆన్‌లైన్‌లో ఉప్పెనలా మొదలైంది. ఏ ముహూర్తాన ట్రంప్ గెలిచాడో కానీ…పురుషులకు ట్రబుల్స్ షురూ అయ్యాయి. కొంతమంది అమెరికన్ యువతులు పురుషులను బహిష్కరించడం గురించి మాట్లాడుకుంటున్నారు. ఇది టిక్‌టాక్, ఆన్‌లైన్ సెర్చ్ ఇంజన్‌లలో ట్రెండింగ్ అవుతోంది. పురుషులను బహిష్కరించాలని మహిళలు, అమ్మాయిలు పిలుపునిస్తున్నారు. ట్రంప్ విజయానికి పురుషులే కారణమని ఆ దేశ మహిళలు నమ్ముతున్నారు. డెమొక్రటిక్ అభ్యర్థికి మగరాయుళ్లు ఓటు వేయలేదని…డోనాల్డ్ ట్రంప్ గెలుపులో కీలకపాత్ర పోషించారని స్త్రీలు నమ్ముతున్నారు. 4బీ ఉద్యమంలో చేరతామని పలువురు అమెరికన్ మహిళలు ప్రమాణం చేస్తున్నారు.

4B అని పిలువబడే ఈ ఉద్యమం…దక్షిణ కొరియా ఉద్యమం నుంచి వచ్చింది. 4 సంఖ్యలు…bi అంటే కొరియన్ భాషలో కాదు అని అర్థం. ఇది పురుషులతో డేటింగ్ (బియోనే), పురుషులతో లైంగిక సంబంధాలు (బిసెక్సు), భిన్న లింగ వివాహం (బిహోన్), ప్రసవం (బిచుల్సన్)లను తిరస్కరించడమే 4బీ ఉద్యమం. సోషల్ మీడియాలో 4బీ హ్యాష్‌ట్యాగ్ టాప్ లో ట్రెండింగ్ అవుతోంది. 2018లో దక్షిణ కొరియాలో ప్రారంభమైన 4B ఉద్యమం కొంతమంది మహిళలకు…స్త్రీద్వేషం, లింగ వివక్ష, మహిళలపై హింసను నిరసించే మార్గంగా మారింది. 4B ఉద్యమంలోని సభ్యులు వివాహాన్ని మహిళలకు అస్తిత్వ ముప్పుగా భావిస్తారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే పురుషులను అన్ని రకాలుగా దూరం పెట్టేయడమే 4బీ. ఈ ఉద్యమ ప్రభావం ఆరోగ్యకర స్త్రీపురుష బంధాలపై పడుతోందని దక్షిణ కొరియా అధ్యక్షుడే వాపోయారు. దక్షిణ కొరియాలో పడిపోతున్న సంతానోత్పత్తి రేటుకు…ఈ ఉద్యమం కూడా కారణమని అక్కడి విశ్లేషకులు భావిస్తున్నారు.

ఎన్నికల తర్వాత 4B ఉద్యమంపై అమెరికాలోని మహిళలు, యువతులకు ఆసక్తి పెరిగింది. TikTok, X వంటి ప్లాట్‌ఫాంలోని పోస్ట్‌లలో అనేకమంది యువతులు…4బీ గురించి అన్వేషిస్తున్నారు. పలువురు 4బీ ఉద్యమాన్ని ప్రచారం చేస్తున్నారు. డజన్ల కొద్దీ మహిళలు తమ సొంత వెర్షన్ 4B ట్రెండ్‌లో పాల్గొనాలనే ఉద్దేశంతో…వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. 48 గంటల వ్యవధిలోనే గూగుల్ లో “4B మూవ్‌మెంట్” కోసం 5 లక్షల మంది పరిశోధించారు. ఆన్‌లైన్‌ వేదికగా 4బీ ఉద్యమానికి ఊహించని విధంగా స్పందన వస్తోంది.

ఎన్నికల్లో గెలిస్తే గర్భస్రావం హక్కును రద్దు చేస్తానని ఎన్నికల ప్రచారం ప్రకటించారు డోనాల్డ్ ట్రంప్. 2022లో రో వర్రెస్ వేడ్…సుప్రీంకోర్టు రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. అనుకున్నట్లే ట్రంప్ గెలిచారు. దీంతో అమెరికన్ మహిళలు జీర్ణించుకోలేకపోతున్నారు. నిర్బంధ గర్భస్రావం నిషేధాన్ని రద్దు చేసిన మొదటి రాష్ట్రంగా మిస్సౌరీ నిలిచింది. యునైటెడ్ స్టేట్స్‌లో చాలా మంది స్త్రీని కాకుండా మరెవరినైనా అధ్యక్షుడిగా ఇష్టపడతారు. బహుశా అందుకేనేమో దక్షిణ కొరియా 4B ఉద్యమంపై ఆసక్తి, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా ఉద్యమం… ట్రంప్ గెలిచిన కొద్ది గంటలకే అమెరికాలో ఊపందుకుంది.