America Tornadoes : అమెరికాను కుదిపేస్తున్న టోర్నడోలు, తుపాను… ఈదురు గాలులకు కొట్టుకుపోయిన విమానం
అమెరికాలో (America) ఒక వైపు ఎండలు మండుతుంటే మరోవైపు టోర్నడోలు (Tornadoes) బీభత్సం సృష్టించాయి. అమెరికాలోని శక్తిమంతమైన టోర్నడోలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. టోర్నడోలతో టెక్సాస్, ఓక్లహామా, ఆర్కన్సాస్లో చాలా ఇళ్లులు ధ్వంసమయ్యాయి.

Tornadoes, storms that are shaking America... a plane washed away by strong winds
అమెరికాలో (America) ఒక వైపు ఎండలు మండుతుంటే మరోవైపు టోర్నడోలు (Tornadoes) బీభత్సం సృష్టించాయి. అమెరికాలోని శక్తిమంతమైన టోర్నడోలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. టోర్నడోలతో టెక్సాస్, ఓక్లహామా, ఆర్కన్సాస్లో చాలా ఇళ్లులు ధ్వంసమయ్యాయి. అర్కాన్సాస్లో ఎనిమిది మంది, టెక్సాస్లో ఏడుగురు, కెంటుకీలో నలుగురు, ఓక్లహోమాలో ఇద్దరు మరణించారు అని అధికారులు తెలిపారు. గాలుల తీవ్రతకు చెట్లు కూలి, ఇల్లులు పడిపోయి పదుల సంఖ్యల్లో మృతి చెందారు. ఇప్పటివరకు 46మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఉత్తర డాలస్లో టోర్నడో ధాటికి పలు చోట్ల భారీ వాహనాలు బోల్తాపడ్డాయి. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరోవైపు నాలుగు రాష్ట్రాల్లో తుఫాను కారణంగా 22 మంది మరణించడంతో పాటు వందలాది భవనాలు ధ్వంసమయ్యాయి. ఒక్లహమా, ఆర్కన్సాస్, టెక్సాస్ వంటి 16 రాష్ట్రాల్లో 600లకు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సాధారణ పరిస్థితిలోకి రావాలంటే చాలా సమయం పడితుందని అధికారులు చెబుతున్నారు.
అమెరికాలో తుఫాన్.. గాళ్లులకు కొట్టుకపోయిన విమానం..
అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో భారీ ఈదురుగాలులు.. తుఫాన్.. టోర్నడో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.. ఈ భారీ ఈదురుగాలులకు విమాన రాకపోకలక తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో డల్లాస్ ఫోర్ట్ వర్త్ ఎయిర్‌పోర్ట్‌లో సుమారు 700 విమానాలను ఎక్కడిక్కడ నిలిపివేశారు. ఆ సమయంలో ఈదురుగాలులకు రన్‌వేపై పార్క్ చేసిన అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737-800 విమానం ఒక్కసారిగా పక్కకు జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.