Donald Trump : కొద్దిలో తప్పించుకున్న ట్రంప్ మామ.. ట్రంప్ పై కాల్పులు.. తీవ్రంగా గాయపడ్డ అమెరికా మాజీ అధ్యక్షుడు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై దాడి జరిగింది. పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో శనివారం సాయంత్రం దుండగులు కాల్పులు జరిపారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 14, 2024 | 01:30 PMLast Updated on: Jul 14, 2024 | 1:30 PM

Trumps Uncle Escaped In A Short Time Trump Was Shot At The Former President Of America Was Seriously Injured

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై దాడి జరిగింది. పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో శనివారం సాయంత్రం దుండగులు కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటన భారత కాలమాన ప్రకారం ఆదివారం తెల్లవారుజామున జరిగింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రసంగంలో పాల్గొన్న సమయంలో ట్రంప్ పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల ఘటనలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చెవి, ముఖంపై రక్తంతో కూడిన స్వల్ప పాటి గాయాలు అయ్యాయి. తనపై హత్యాయత్నం తర్వాత అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ తొలిసారి స్పందించారు. లేదన్నారు. ‘‘కాల్పుల ఘటనపై వేగంగా స్పందించినందుకు అమెరికా సీక్రెట్ సర్వీస్ సిబ్బందికి ధన్యవాదాలు. ర్యాలీలో ప్రసంగిస్తున్న సమయంలో శబ్దంతో ఏదో చెవిపై దూసుకుపోయినట్లు అర్థమైందని చెప్పారు. రక్తస్రావం జరగడంతో, ఆ తర్వాత ఏమైందో గ్రహించినట్లు పేర్కొన్నారు. వెంటనే అప్రమత్తమై మోకాళ్లపై కూర్చున్నట్లు వెల్లడించారు. దేశంలో ఇలాంటి ఘటన జరగడం నమ్మశక్యంగా లేదు అని వెల్లడించారు. మరో వైపు ఈ ఘటన పై ఎలన్ మస్క్ తీవ్రంగా మండిపడ్డారు. అమెరికా లాంటి టెక్నాలజీ దేశంలో ఈ కాల్పుల ఘటన జరగడం అనేది దురదృష్టకరం అని.. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ భద్రతా విభాగం చీఫ్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాల్పుల్లో గాయపడిన ట్రంప్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ట్రంప్‌పై కాల్పులు.. హెల్త్ అప్‌డేట్..
ఎన్నికల ర్యాలీలో దుండగుడి కాల్పులలో గాయాలపాలైన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం ప్రస్తుతం మెరుగ్గానే ఉన్నట్లు ఆయన ప్రతినిధి స్టీవెన్ తెలిపారు. స్థానిక మెడికల్ సిబ్బంది ఆయనకు చికిత్స అందించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో త్వరగా స్పందించిన భద్రతా సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు ట్రంప్ త్వరగా కోలుకోవాలని టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు.

ట్రంప్‌కు ప్రధాని మోదీ సంఘీభావం..
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని మోదీ సంఘీభావం తెలిపారు. ‘నా స్నేహితుడు ట్రంప్‌పై దాడిని ఖండిస్తున్నా. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. కాగా పెన్సిల్వేనియా రాష్ట్రంలోని బట్లర్ సిటీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌పై కాల్పులు జరిగాయి. దీంతో గాయాలపాలైన ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

ట్రంప్‌పై కాల్పులు.. బైడెన్, ఒబామా సంచలన వ్యాఖ్యలు..

అమెరికాలో హింసకు తావులేదని ప్రెసిడెంట్ జో బైడెన్ ట్వీట్ చేశారు. కాల్పుల్లో గాయపడిన ట్రంప్ క్షేమంగా ఉన్నారని తెలిసింది. ట్రంప్, ఆయన కుటుంబం కోసం నేను దేవుడిని ప్రార్థిస్తున్నా. మనం అందరం ఒక్కటై ఈ ఘటనను ఖండించాలి’ అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ హింసకు స్థానం లేదని బరాక్ ఒబామా ట్వీట్ చేశారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.