China landslides : చైనాలో గేమి తుపాన్ బీభత్సం.. విరిగిపడ్డ మట్టి చరియలు.. 11 మంది మృతి
చైనా దేశంలో గత కొన్ని రోజులుగా భారత కు దిటుగా.. అక్కడ కూడా భారీ వర్షాలు అక్కడి ప్రజలను వణికిస్తున్నాయి. భారీ వర్షాలకు చైనా లోని పలు ప్రాంతాలు నీటి మునిగాయి.
చైనా దేశంలో గత కొన్ని రోజులుగా భారత కు దిటుగా.. అక్కడ కూడా భారీ వర్షాలు అక్కడి ప్రజలను వణికిస్తున్నాయి. భారీ వర్షాలకు చైనా లోని పలు ప్రాంతాలు నీటి మునిగాయి. భారీ వరదలతో కొన్ని గ్రామాలు నామ రూపాలు లేకుండా వరద నీటిలో కొట్టుకు పోయాయి. తాజాగా చైనాలో మరో ఘటన చోటు చేసుకుంది. చైనా ఆగ్నేయ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు మట్టిచరియలు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 11 మంది దుర్మరణం చెందారు. హునన్ ప్రావిన్సులోని హెంగ్‌యాంగ్ నగర పరిధిలో ఉన్న యూలిన్ గ్రామంలోని ఓ ఇంటిపై ఆదివారం ఉదయం మట్టిచరియలు విరిగిపడ్డట్లు స్థానిక అధికారులు తెలిపారు. దీంట్లో 18 మంది చిక్కుకున్నట్లు స్థానికులు గుర్తించారు. దీంతో వెంటనే ఆ సమాచారనని విపత్తు నిర్వహణ బృందానికి చేరవేశారు. ఘటన స్థలానికి చేరుకున్న సహాయక బృందం ఏడుగురిని రక్షించినట్లు తెలిపారు. మరొకరి ఆచూకీకి గుర్తించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
కాగా చైనాలో గేమి తుపాను కారణంగా గురువారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఈ తుపాను బలహీనపడినప్పటికీ.. ఇంకా వానలు విస్తారంగా కురుస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు భారీ వర్షాల వల్ల చైనాలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ మరణాలు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల ధాటికి షాంఘై నగరంలో ఓ భారీ చెట్టు నేలకూలిన ఘటనలో ఓ డెలివరీ బాయ్ అక్కడికక్కడే మృతి చెందాడు.